Tuesday, November 22, 2016

మూఢమి అంటే ఏమిటి ? మూఢాలు ఎందుకు వస్తాయి ? మూఢాల వలన సమస్యలు ఏమిటి ?

⛤ మూఢమి ⛤

ప్ర.  మూఢమి అంటే ఏమిటి ?  మూఢాలు  ఎందుకు వస్తాయి ? మూఢాల వలన సమస్యలు  ఏమిటి ?

జ . మూఢాలు అంటే  అశుభ దినాలు , అశుభ రోజులు .చీకటి  రోజులు , రోజులు చెడు దినాలు . శుభ కార్యాలు  చేసు కోవడానికి  వీలు కాని రోజులు . మంచి రోజులు కావు అని అర్థం . మూఢాలు అంటే ఖచ్చితంగా  విడవదగిన కాలం  అని అర్ధం .

మూఢాలు రెండు  రకాలు . అవి ఒకటి  గురు మూఢమి , రెండవది  శుక్ర మూఢమి.  మూఢాల ను  మౌఢ్యములు అని కూడా  అంటారు .

సామాన్యులకు కూడా  అర్ధమయ్యే విధంగా  చెప్పాలంటే , గురువు  సూర్యునికి  దగ్గరగా వచ్చినప్పుడు  ఏర్పడే దానిని  గురు మూఢమని  . అలానే శుక్రుడు సూర్యునికి  దగ్గరగా  వచ్చి నప్పుడు  ఏర్పడే దానిని   శుక్ర మూఢమని  అంటారు .

దీనినే సాంగత్వ  దోషమని  అంటారు . శుభ గ్రహాలు  అస్తాంగత్వంలో  ఉన్నపుడు  మూఢమి  వస్తుంది . సూర్యునికి  దగ్గరగా  గురు , శుక్రులు  వచ్చి నప్పుడు , గురు శుక్రుల  శక్తులు  తగ్గి పోతాయి . బలం తగ్గి పోతుంది . బలహీన మౌతాయి . నీరస పడుతాయి . సన్నగిల్లుతాయి . వేయి  వాట్స్  బల్బు ముందు , ఒక  చిన్న క్యాండిల్  పెడితే , ఆ క్యాండిల్ శక్తి  ఎంత మాములుగా  ఉంటుందో , అలానే సూర్యుడి  ముందు  గురు శుక్రుల శక్తి  అంత తక్కువగా , బల హీనంగా  ఉంటుంది . అందుకే శుభ కార్యాలు  ఆ రోజులలో  జరుప కూడదు అని అంటారు .

అందువలన , ఈ కాలంలో  శుభ కార్యాలు , "ముఖ్యంగా  వివాహాది శుభ కార్యాలు జరుప కూడదు  , లగ్నపత్రిక రాసుకోకూడదు . వివాహాలకు  సంబంధించిన   మాటలు  మాట్లాడుకోరాదు . పుట్టు వెంట్రుకలు తీయకూడదు . గృహ శంకుస్థాపనలు  చేయ రాదు . ఇండ్లు మారకూడదు." ఎందుకంటే ఇవన్నీ జీవితంలో ఒకే సారి చేయడం జరుగుతుంది . ఎవరయినా మంచి జరుగాలనే కోరు కుంటారు .  అందుకని  మూఢాలలో  శుభ కార్యక్రమాలు  చేయ కూడదు.

మనందరికీ  తెలుసు , ఏ  శుభ కార్యక్రమానికైనా  గురు శుక్రులు బాగుండాలని . దివ్యంగా ఉండాలని . శక్తి మంతంగా ఉండాలని . గురు శుక్రులు బాగుంటేనే  శుభాలు ఎలాంటి ఆటంకం లేకుండా  జరుగుతాయి . పెండ్లిల్లకు  గురు బలం బాగుండాలి .

అయితే , మూఢాల లో అన్న ప్రాసన చేసుకోవచ్చు . ప్రయాణాలు చేయ వచ్చు .
రిపేర్లు చేసుకోవచ్చు .  తప్పవు అనుకున్న  పనులు చేసు కోవచ్చు .  భూములు కొనడం , అమ్మడం , అగ్రిమెంట్లు చేసుకోవడం , ఉద్యోగాలలో చేరడం , విదేశాలకు వెళ్ళడం అబ్బాయిలను అమ్మాయిలను చూడటం  , వ్యాపారాలు మొదలు పెట్టడం , వెహికిల్స్ కొనుక్కోవడం , బట్టలు కొనుక్కోవడం  మొదలైనవి  చేసు కోవచ్చు .

మూఢాల కాలంలో శుభ కార్యాలు చేస్తే  ఏమవుతుంది ?
మహర్షులు , జ్యోతిష్య  పండితులు, అనుభవస్తులు   శుభ కార్యాలు  చేయ  కూడదని చెప్పారే గాని , ఏమవుతుందో చెప్ప లేదు .
కానీ పెద్దలు  చెప్పిన దాని   ప్రకారం ,  ఏదయినా  అశుభం  వినవల్సి రావచ్చు . కష్టం  కలుగ వచ్చు , నష్టం  వాటిల్ల వచ్చు.

2 comments:

  1. జ్యోతిశ్శాస్త్రం ప్రకారం సూర్యుడు సహజపాపి. సహజపాపులలో అతిబలవంతుడు. గురుశుక్రులు సహజశుభులు. అతితేజశ్శాలి ఐన సూర్యుడి సమీపంలో ఉన్న గ్రహం దగ్ధం ఐనట్లు చెబుతారు - అంటే ఉండీలేనట్లే. జాతకచక్రంలో సహజగురులు ఇద్దరూ హుళక్కి ఐన సమయంలో వారివలన అప్పటి దశా - అంతర్దశలలో, గోచారాదులలో, కలగవలసిన మంచి ఫలాలు ఏమున్నా అవి చెడిపోతాయి. కాబట్టి శుభకార్యాలకు దూరంగా ఉండాలి అని చెప్పటం. నిత్యకార్యక్రమాలు మాత్రం ఇబ్బందిలేకుండా చేసుకోవచ్చును కాని ప్రత్యేకించి కొత్త శుభకార్యాలకు పూనుకోవచద్దని సూచన. అంతే.

    ReplyDelete
  2. ధన్యవాదములు . చక్కగా వివరించారు

    ReplyDelete