అన్న ప్రాశన ముహూర్తము :-
శ్లో ॥ అన్నాదనం మాసి రసైరభిన్నే సూనొస్తదా సన్నగ మాసయుగ్మే ।
పుత్ర్యా భవేచ్చాత్ర విదర్శ పూర్ణా భద్రాజయాపక్షతయః ప్రదిష్టాః ॥
తాత్పర్యము :- పుత్రుని యొక్క అన్నప్రాసనము జన్మాదిగా 6వ మాసమునందును పుత్రిక యొక్క అన్నప్రాసనము 6వ మాసమునకు దగ్గర వుండు 2 మాసములు అనగా 5 లేక 7వ మసముల యందును అమావాస్య విడచి పూర్ణ తిధుల యందును 5, 10 , 15 భద్రా ( 2,7,12) జయా (3,8,13) ప్రతిపత్తు తిధుల యందును చేయవలయును ( నవీన ముహూర్త శాస్త్ర కర్త అయిన రామ దైవజ్ఞుడు రిక్తా తిధుల యందును నందా తిధుల యందును అష్టమి యందును ద్వాదశి యందును అమావాస్య నందును అన్నప్రాసన చేయరాదు అని చెప్పెను . నవీనుల విధానము కంటే భిన్నముగా ఉండుట వలన కుడా కాళిదాసు ప్రాచీనత తెలియ చున్నది) .
అన్నప్రాసన నక్షత్రములు :-
శ్లో ॥ సంతోర్భకాన్నాశన కర్మణీoదు జ్ఞదేవ వంద్యో శన సామహాని ।
విమిత్రమైత్రాఖ్య లఘుధృవాణి శ్రవః శవిష్టాదితిభానిచహుః ॥
తాత్పర్యం :- బాలకులకు అన్నప్రాశనకు సోమ,బుధ,గురు,శుక్రవారము అనురాధను విడిచిపెట్టి శేషించిన మైత్ర నక్షత్రములు ( మృగశిర , రేవతి , చిత్ర ) లఘుసంజ్ఞక నక్షత్రములు ( హస్త ,అశ్విని , పుష్య ) ధ్రువ సంజ్ఞక నక్షత్రములు ఉత్తరాత్రయం రోహిణి , శ్రవణం , ధనిష్ఠ , పునర్వసు , నక్షత్రములు శుభదాయకములు అని దైవజ్ఞులు చెప్పిరి .
అన్నప్రాసనకు లగ్న బలము :-
శ్లో ॥ ప్రేక్షాంత్యపుణ్యాత్యయ కేంద్రగో రవిః , తనోతి చిత్రం పృధుకే రసాత్మజః ।
పిత్తం చ మందస్తనుతే ప్రభంజనం , కృశః కిల గ్లౌర్హి తధా దరిద్రతాం ॥
తాత్పర్యం :- అన్నప్రాసన కాలమున లగ్నము నుండి 5 ఇంటను 12 ఇంటను 9 ఇంటను 8 ఇంటను కేంద్రముల యందును ( 1,4,7,10 ) సూర్యుడున్నచో బాలకునికి తీవ్ర రోగములు వచ్చును . అదే స్థానముల యందు కుజుడున్నచో పిత్త జన్య వికారములు వచ్చును . శని ఉన్నచో వాత రోగములు వచ్చును . క్షీణ చంద్రుడు ఉన్నచో ఆ శిశువు దరిద్రమును అనుభవిన్చును అని శాస్త్ర వచనం .
మరియొక అంశంతో మళ్ళి కలుద్దాం . సర్వేజన సుఖినో భవంతు . దయచేసి మీ సలహాలను సందేహాలను క్రింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయగలరు . మీ అమూల్య మయన సమయాన్ని వెచ్చించి నా పోస్ట్లు చదివి ,కామెంట్ వ్రాసినందుకు ధన్యవాదములు ,
సదా ఆద్యాత్మిక సేవలో ,
బ్రహ్మశ్రీ మురళీ కృష్ణ శర్మ భువనగిరి ,
నార్త్ కరోలినా , USA .
సెల్ : (001)-336-517-6268 .