వాస్తు , జ్యోతిష్యము అనునవి వేరు వేరు శాస్త్రాలు  కాదు.  రెండు ఒకే శాస్త్రము నుండి వచ్చినవి మరియు 
వేదాంగములు కూడాను . ఈ రెండిటి లో ఎ ఓక్కదాన్ని విడచి మరి ఒక దానితో  ఏ   
విషయం గణించ లేము .   ఇందులో జ్యోతిష్యం అను నది కొంచం ఆధునిక పండితులకు 
నూతన విధానాలకి అన్వయించి చెప్పటం సులువుగాను , మరియు ఇతరత్రా కారణాలు కూడా
 ...! 
కానీ వాస్తు శాస్త్రం అలా కాదు . అసలు నిజానికి మన సనాతన వాస్తు 
శాస్త్రం లో ఇప్పుడు మన ఆధునిక వాస్తు పండితులు తెలుసుకున్నది 50 % 
అందులోను వడగలుగు తున్నది 10 % మాత్రమే . ఈ ఆకాశానికి అంటేలా 50 ,100 బహుళ 
అంతస్తు భావనలు ,కాంక్రీటు అరణ్యము లు  వాస్తు నందు లేవు  . 
కేవలం ,ద్వార 
నిర్ణయం , ఈశాన్యంలో బోరు ,ఆగ్నేయం లో వంటిల్లు ,నైరుతిలో పడకగది . దేవుడి 
గది ఈశాన్యంలో వుండాలి అని తెలుసుకొని వాస్తు పండితులం అని చెప్పు కునే 
వారికి తెలిసింది వాస్తు శాస్త్రం కాదు అది  వాస్తు శాస్త్ర సముద్రములో ఒక 
నీటి బొట్టు మాత్రమె . అర్వణము , భూమి పరీక్షా , శల్యములు , ప్రహరి నిర్ణయం
 ,వర్గు నిర్ణయం,ఆయము,ఇంటి వాతములు ,భూమిలో జల కనుగోనటం , గర్భ పరిశీలనా , 
ఇంతే కాక ప్రహరి నుండి మొదలుకొన్ని కప్పు ( ఈ రోజులలో స్లాప్ ) దాక 
,కొలతలు,యోగ్య మైన ముహూర్తాలు ఇలా ఎన్నో విషయాలు వాస్తు శాస్త్రం చెపుతుంది
 . అసలు ఇంటికి ఎన్ని దూలాలు వుండాలి ,అడ్డు వరసలు ,నిలువు వరుసలు వాటి 
లెక్క ఇవన్ని ఎంతో గణించి నిర్ణయించే వారు పూర్వం పండితులు . అసలు ఈ 
రోజుల్లో భావి తవ్వించి వరలు దించే వారే కరువయ్యారు .. 
అపార్టుమెంట్ 
సంప్రదాయం . ఇరుకైన రోడ్లు ,ఆధునికతకు పెద్దపీట వేసిన, హంగు,ఆర్భాటాలతో 
కట్టిన భవంతులు , మహానగరం అని చెప్పుకుని కనీసం మురికి కాలవలు సరిలేని 
పట్టణాలు , అగ్గిపేట్ట అంత  ఇళ్ళ కట్టడాలు అర్ధం పర్ధం లేని దిక్కులలో 
నిర్మాణాలు , వీటి అన్నిటి కింద పడి ఏనాడో వాస్తు శాస్త్రం నలిగి కోన 
ఊపిరితో కొట్టుకుంటుంది . ఇది చాలక , అన్ని తెలుసని అనుకునే మేస్త్రీలు , 
అవసరాలను కొనే బలహీనత వలన - ఉపేక్షా భావము వహించే యజమానులు . అది బాగోలేదు ,
 ఇది బాగోలేదు , అని తెలిసి తెలియక,ధనార్జనకు , భుక్తి కోసం శాస్త్రాన్ని 
నమ్ముకో పొగ అమ్ముకునే వారు వాస్తు శాస్త్రాన్ని ఈ సభ్య సమాజం సాక్షిగా 
ప్రతి రోజు దిగజారుస్తు మిగిలిన ఊపిరి తీస్తున్నారు . 
అలా అని వాస్తు 
శాస్త్రం ఈ సమాజానికి పనికిరాదని కానీ తెలిసిన పండితులు లేరు అని నేను అనటం
 లేదు . ఎంతో మంది మహాను భావులు "ఆధునిక వాస్తు శాస్త్రం " పై అధ్యయనం చేసి
 అపురుప మైన గ్రంధాలను సమాజానికి ఇచ్చారు . వాటిని అనుసరించుకొని మనకు 
కుదిరినంత వరకు పాటించటానికి ప్రజలు , మిడి మిడి జ్ఞానంతో కాకుండా 
అభ్యసించి ,అనుభవాన్ని గణించిన తర్వాతే ,వాస్తు శాస్త్ర పండితులుగా వారి 
సేవలు అందిస్తే కొంచమైన శాస్త్రాలకు విలువ మిగులుతుంది .
సమాజం బాగుపడుతుంది . భారత వేద జ్యోతిష  విజ్ఞాన  ఫలాలు భావి తరాల వారికి అందుతాయి . 
sathyamaina vishayanni rasaru
ReplyDeleteDhanyavadamulu
Deleteఈశాన్యంలో జల ప్రవాహం అనే అపప్రధనుకూడా వీరు ఇష్టమొచ్చిన రీతిలో వాడుతున్నారు ...బావి ఏ దిక్కులో ఉండాలో కూడా తెలియని వారు ఇప్పుడు సంఘంలో పెద్ద వాస్తు పండితులుగా చెలామణి కావడం శోచనీయం...ఆయముల గణన తెలిసిన వ్యక్తులే లేరు ..బ్రంహం గారు చెప్పినట్టుగా అక్షరాలూ రాయడమూ--పలకడమూ తెలియని వారు పండితులుగా పోజు లిచ్చే కలికాలం ఇది ...సంస్కృత పండితులు జ్యోతిర్-వాస్తు గ్రంధాలను తమకు తోచిన విధంగా అనువదిస్తూ, శాస్త్రాలను భ్రష్టు పట్టించారు...పైగా వీరంతా పత్రికల్లో-టీవీ మాధ్యమాల్లో ,అంతర్జాల గ్రూపుల్లో,ఎవరి బిచానాలను వారు తెరిచి మరీ డప్పు కొట్టుకోవడం ఇంకా దరిద్రం.వాస్తు పుస్తకాలు చూసి మరీ వాస్తు చెప్పే పండితులు ఎక్కువై పోయారు.ఆ పుస్తకాలు కూడా మార్కెట్లో మిరపకాయ బజ్జిల్లా అమ్ముడుపోతున్నాయి.
ReplyDelete