Monday, February 15, 2016

అనంతమైన కాలంలో మానవుని కాలం యెంత చిన్నదో ఉహిస్తె ఆశ్చర్యం కలుగుతుంది కదా !

మహా కాలాలు :-  చతుర్యుగాలు అనగా
కృతయుగం ............ 17,28,000 సంవత్సరములు
త్రేతాయుగం ............ 12,46,000 సంవత్సరములు
ద్వాపరయుగము .... 8,64,000 సంవత్సరములు
కలియుగం ......... .... 4,32,000 సంవత్సరములు
మొత్తం కలసి 43,20,000 సంవత్సరములను " మహా యుగం " అంటారు.
ఇటువంటి 71 మహాయుగములు కలిపితే 1 " మన్వంతరము "
               14 మన్వంతరములు కలిపితే 1 కల్పము అవుతాయి .
కల్పము అంటే బ్రహ్మకు 100 సంవత్సరాల ఆయుర్దాయం . ఇటు వంటి బ్రాహ్మలు .. 9 , ఇప్పుడు అందులో బ్రహ్మయొక్క ద్వితీయ పదార్ధము అంటే 51 సంవత్సరాలు గడచి మొదటి మాసం మొదటి రోజు అనే శ్వేతవరహ కల్పంలో , ద్వితీయ యామము , 28 మహాయుగము లు కృత ,త్రేతా ,ద్వాపర యుగములు గడచి కలియుగం లో 5117 సంవత్సరము అవుతుంది .

 దేవమానము అని చెప్పబడే కాలమానము  :- 
మనుష్యులకు               దేవతలకు
1 సంవత్సరం                1 దినము
30 సంవత్సరములు        1 నెల
360 సంవత్సరాలు         1 సంవత్సరం
బ్రహ్మకు 200 మహా యుగములు 1 రోజు , ఇటువంటి 30 దినములు 1 నెల , 12 నెలలు 1 సంవత్సరం అట్టి 108 సంవత్సరములు ఒక జీవితం . 200 మహా యుగములు 1 బ్రహ్మకల్పము బ్రహ్మప్రళయము , 2  బ్రహ్మప్రళయాలు ఆది విరాట్టునకు 1 దినము . అనంతమైన కాలంలో మానవుని కాలం యెంత చిన్నదో ఉహిస్తె ఆశ్చర్యం కలుగుతుంది కదా ! 

Tuesday, November 24, 2015

కార్తిక మాసములో వల్మిక లింగము లతో మహా,సహస్ర లింగార్చన ఫలితము మరియు వివరణ.Significance of Maha Sahasra Lingarchana.

Significance of Maha Sahasra Lingarchana . 

శ్లో : వాగర్ధా వివ సంపుృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే,
      జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ .
జగతః పితరులు అయిన పార్వతీ పరమేశ్వరులకి ముందుగా నమస్కారము. కలియుగంలో మానవులు అల్పఆయుష్షు కలవారుగా, భగవత్ అనుగ్రహం పొందటానికి ఘోర తపస్సు గాని , విశేష యజ్ఞ యాగములు చేయు శక్తి మరియు సాధన సామద్యాన్ని  పొంది లేక ఉండటమే కాక దైవసంబంధ కార్యములు చేయుటకు ఆశక్తి వున్నా నిత్య జీవితం లో తగిన సమయము భగవత్ ఆరాధనకు వినియోగించ లేక పోవటం మనం ప్రత్యక్షంగా గమనిస్తూనే వున్నాం . 
కనుక కలియుగంలో మానవులకి భక్తి ప్రదాయకమైన విధానాలను పూజలు,వ్రతాలు,అభిషేక మరియు హోమ ప్రకరణముల తో, తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ ఫలమును , జ్ఞానమును మరియు ముక్తిని ప్రసాదించేవి గా మనకి వీలుగా మహర్షులు మనకి ఎన్నో అందించారు , వాటిలో ఈ కార్తీకమాస లో చేసే విశేష శివారాధన విధి కూడా ఒకటి. 
సాధారణంగా శివాలయంలో మనకి శివలింగాన్ని దర్శనం చేసుకొనే వీలు మాత్రమే ఉంటుంది స్ప్రుసించి అభిషేకాదులు చేసుకొనే వీలు స్వయం భు లింగములు అనగా ఉదాహరణకు శ్రీశైలం లాంటి మహా పుణ్య ప్రదేశాల లో మాత్రమే అది కొన్ని సమయాల లో మాత్రమే వుంటుంది , ఒకవేళ సామాన్యులు ఇంటిలో శివలింగాన్ని ఉంచి అభిషేకాలు నిత్యం నిర్వహించాలన్నా ఆచార నియమాలు , పరిశుబ్రత తప్పకుండ పాటించ వలసి వుంటుంది . వాటిని ప్రస్తుత కాలంలో పాటించటం అసాద్యం కాకపోయినా కొంచం కష్ట సాద్యం .
మరి ప్రస్తుత కాలమానంలో  మానవులకి ఏ రకంగా శివ ఆరాధన చేసి శివ అనుగ్రహం పొందవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం . శివారాధనలో మనకి ముఖ్యంగా మహాశివరాత్రి , కార్తీక మాసం విశేషంగా చెప్పబడింది.

 శ్లో : న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్. 
అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు. 

కనుక కార్తీకమాసంలో శివలింగార్చన చేయటం భక్తి ముక్తిదాయకాలుగా మనయొక్క పురాణాలు మనకి చెబుతున్నాయి . మరి భక్తులు ఎటువంటి శివలింగాన్ని అర్చన చేయవచ్చు అనగా, మనకి వల్మీకముతో చేసిన అనగా "పుట్టమన్నుతో " చేసిన శివలింగము కలియుగమున విశేషముగా చెప్పబడినది . శాస్త్రంలో మనకు వల్మీకము (పుట్టమన్ను) కు , ఎంతో ప్రాధాన్యత ఉంది. పంచ మృత్తికలు, అష్ట మృత్తికలు, ఇలా అన్ని పవిత్రమైన మట్టి విషయాలలో వల్మీకము (పుట్టమన్ను )కు స్థానం ఉంది. వీటిని అనేక వైదిక కార్యక్రమాలలో వినియోగిస్తారు. కనుకనే పుట్టమన్నును పవిత్రమైనదిగా శాస్త్రం చెబుతోంది. ఇక శైవ సంబంధమైన విషయానికి వస్తే పుట్టమన్నుతో శివలింగము చెసి అర్చించటం కలియుగంలో సత్వర విశేష ఫలితం ఇస్తుంది అని చెప్పబడింది. 
కృతయుగంలో రత్న లింగమును, త్రేతాయుగంలో బంగారు లింగమును , ద్వాపరయుగంలో పాదరస లింగమును , కలియుగంలో వల్మీక లింగమును అర్చించవలేనని, యుగధర్మం మనకు చెబుతోంది. అదియునుకాక పరమేశ్వరునికి కంఠంనందు అలంకారం అయిన నాగేంద్రుడుకి నివాసస్థానం అయిన పుట్ట శివునికి ఎంతో ప్రీతిపాత్రం కనుక పుట్టమన్నుతో శివలింగాన్ని అర్చించటం పరమేశ్వరునికి ఎంతో ప్రీతిని కలిగించును. " మృత్తికే హనమే పాపం యన్మయా దుషుౄృతం కృతం " అన్న వేద వాక్యం మనకు  మృత్తిక స్పర్శనం వల్ల చేతనే, మనయొక్క చెడు స్వభావం, స్వయం కృత పాపములు  తొలగునని తెలియజేయు చున్నది , అందుకనే పుట్టమన్ను అతి పవిత్ర మైనది . పుట్టమన్నుతో ఏక లింగమును చేసి అనగా శివలింగ రూపముగా మట్టిముద్దను చేసి , అర్చన చేయటం ఒక సాధారణం మరియు సులభమైన మార్గము . ఇది కాక మనకి "365"శివలింగములు  లేదా "1128" లింగములని పూజించు విశేష పూజా విధానములు వున్నవి . అదియే " మహాలింగార్చన 365 లింగములతో" సహస్ర లింగార్చన 1128 లింగములతో "చేసి అభిషేకించటం . మహాలింగార్చనలో 365 లిన్గములను ఒక క్రమపద్దతిలో వేద మంత్రములతో కైలాస మహా యంత్ర రూపముగా అమర్చి శివలింగఆకృతిని ఏర్పరచి మహాన్యాసముతో దేహ ఇంద్రియ శుద్ధి చేసుకొని నమక చేమకములతో అభిషేకం చేస్తారు. ఈ ప్రకారం సంవత్సరంలో ఒక్కసారి చేసినను, ప్రతి రోజు అభిషేకం చేసిన ఫలితాన్ని పొందవచ్చును .
ఇక సర్వోత్క్రుష్టమైన సహస్రలింగార్చనని వేదమంత్రాలతొ పదహారు దశలలో  ( ఆవరణములు ) 1128 లింగములని ఒకదాని తర్వాత ఒకటి శివ ప్రోక్త కైలాస రహస్య మహా యంత్ర ప్రకరణం ప్రకారంగా ఏర్పరుస్తూ శివలింగాకృతి చేయటం ఒక మహాఅద్భుతం. ఈ ప్రకారం చేసిన సహస్రలిన్గాలకు మహాన్యాసముతో దేహ ఇంద్రియ శుద్ధి చేసుకొని నమక చేమకములతో అభిషేకం చేయటం పూర్వ జన్మ సుకృతం మరియు శివ అనుగ్రహ హేతువు . వీరికి వేయి లిన్గాలని అభిషేకించిన ఫలితం మాత్రమే కాక మహా యజ్ఞ యగాములను చేసి నను పొందని మహా ఫలితమును పొందుదురు . 
వల్మీక శివలింగ అర్చన , మహా , సహస్ర లింగ అర్చన చేసిన కలుగు ఫలితము మరియు శివుడు అభిషేక ప్రియుడు కనుక వివిధ ద్రవ్యములతో అభిషేకించిన వచ్చు విశేష ఫలితము , ప్రత్యేకత ఇప్పుడు తెలుసుకుందాం . . . . 

కామ్య కర్మలను సఫలం చేయటానికి వల్మీకములో ఇతర పదార్ధాలు కలిపి శివలింగాలు చేయటం ద్వారా కామ్యములు అనగా కోరికలు తీరుతాయి. శివాభిషేక ఫలములు 
1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. 
2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును 
6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును. 
7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును. 
8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును. 
9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును. 
10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. 
11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును. 
12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును. 
13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును. 
14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును. 
15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును. 
16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును. 
17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. 
18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు. 
19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది. 
20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును. 
21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును. 
22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును. 
23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును. 
24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.
" రుదం ద్రావయతీతి రుద్రః " శం కరోతీతి శంకరః 
రుదం అనగా ఏడుపు , బాధ , దుఖం వీటిని మన నుంచి ద్రవింప చేయగలిగినది , కడిగి వెయ గలిగినది " రుద్రము . 
శం అనగా శుభము " మనకు శుభములను ప్రసాదించ గలిగిన వాడు శంకరుడు . 
కావున ఈ పవిత్ర కార్తీక మాసమున శివ అర్చన , అభిషేకములు చేసి శివ పురాణమును చదివి , విని తరిద్దాం ..!
కార్తీకం లో విష్ణు మూర్తి పూజ చేయటం వలన కార్తీక దామోదరుని అనుగ్రహం పొందుతాము .అందుకనే మనకు స్కాంద పురాణ అంతర్గత మయన " సత్యనారాయణ స్వామి వ్రతం " ఈ మాసములన ఎక్కువగా చేయటం గమనిస్తాం . 
భక్తులు ఉపాసనా కాల మయన ఈ కార్తీక మాసమున శివ కేశవులను ఆరాదించి తరించాలి అని ఆసిస్తూ .... సెలవు ..! 
దయచేసి మీ బంధువులతో మిత్రులతో ఈ వ్యాసమును షేర్ చేయ గలరు .. సదా భగవత్ సేవలో మీ ...
లోకా సమస్తా సుఖినో భవంతు ..! 

Friday, December 19, 2014

అద్భుత శక్తీ సంపన్నుడు,ఆగ్రహమే కాదు అనుగ్రహించే శనీశ్వరుడు గురించి తెలుసుకో ...! about lord saneeswara In Telugu ..!

అద్భుత శక్తీ సంపన్నుడు,ఆగ్రహమే కాదు అనుగ్రహించే శనీశ్వరుడు గురించి తెలుసుకో ...!
నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు
చెబుతున్నాయి. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు.
జనన వృత్తాంతము :
అదితి , కస్యపు ముని కుమారుడైన సుర్యభావానునికి ముగ్గురు భార్యలు -- ఉషా(సంజ్ఞా) , చాయ , పద్మిని .
లోకాలన్నితికి వెలుగునిచ్చే సుర్యాడు త్వష్ట ప్రజాపతి "విశ్వకర్మ" కూతురు సంజ్ఞా(ఉమా) దేవిని పెళ్ళిచేసుకున్నాడు . పెళ్ళైన నుండే సూర్యకాంతిని , తేజస్సును భారిచలేక , చూడలేక విచారము తో ఉన్న ఉమాదేవి ని నారదుడు చూసి , విషయము తలుసుకొని ... ఈశ్వరుని తపస్సు చేసి శక్తిని పొందమని ఉపాయమార్గము జప్పెను . అప్పటికే తనకి ముగ్గురు పిల్లలు  -మొదటివాడు వైవాస్తవ . రెండేవ వాడు యముడు . మూడవది కూతురు యమున. నారద సలహా మేరకు ఉమాదేవి తన నీడకు ప్రాణము పోసి "చాయాదేవి" గా సూర్యుని వద్ద పెట్టి పుట్టింటికి వెళ్ళిపోయెను, కూతురు భర్తకి చెప్పకుండా పుట్టింటికి వచ్చినందున అనరాని మాటలతో నిందించి తిరిగి సుర్యునివద్దకే వెళ్ళిపొమ్మని చెప్పగా .. గోప్యం గా ఉన్న ఛాయా రహస్యము బయట పడ కూడదనే సదుద్దేశముతో అడవికి పోయి తపస్సు చేయసాగెను . తన అందము , యవ్వనము చూసి ఇతరులబారినుంది తప్పించుకొనుటకు గుఱ్ఱము రూపములో మారిపోయి ఈశ్వరునికి తప్పస్సు చేయసాగెను . సూర్యునికి .. ఛాయాదేవికి "మను (సావర్ణుడు) , శని , తపతి (కూతురు) జన్మిచారు . శని గర్భము లో ఉండగా చాయ ఈశ్వరునికి ఘోర తపస్సు చేసెను . ఉపవాసదీక్ష చేయడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ నల్లగా మారిపోయాడని , తల్లి తపోశక్తి వల్ల అనేక ఈశ్వర శక్తులు గ్రహించాడని , శని చూపే వినాశకరం గా మారినదని పండితులు అంటారు . సూర్య తేజస్సు లేని ఈబిడ్డ తనబిడ్డ కాదని చాయని సూర్యుడు అనుమానించి అవమానిస్తాడు . అది విన్న శని తండ్రి అయిన సూర్యున్నే నల్లగా మారిపోవాలని , సూర్యగమనం ఆగిపోవాలని , సూర్య రధం నల్ల రంగు గా అయిపోవాలని శపిస్తాడు . అప్పుడు తన తప్పును తెలుసు కున్న సూర్యుడు ఈశ్వరుని వేడగా ... జరిగిన విషయమంతా సూర్యునకు తెలిజేయగా ఈశ్వరుని కోరిక మేరకు శని తన శాపాన్ని వెనక్కి తీసుకొని సూర్యున్ని శాపవిముక్తి గావించెను . అంతా సుఖము గా ఉన్నా ... శని సూర్యుని పై పగబూని ఈశ్వరుని తపస్సు జేసి ఎన్నో వరాలు పొందెను .
శని జన్మ నక్షత్రము : శని విభావనామ సంవత్సరము , మాఘమాసము ,కృష్ణపక్షము ,చతుర్దశి నాడు , ధనిష్టా నక్షము న జన్మించాడని కొందరంటే .. మార్గశిర మాసము -బహుళ నవమి ,రోహిణీ నక్షత్రాన శివుని ఆశీస్సులతో జన్మించాడని కొందరు అంటారు . . శనీశ్వరుడు కుడి చేతిలో దండము , ఎడమ చేతిలో కమండలము , sword (ఖడ్గము) arrows and two daggers దరించి ఉంటాడు .
శని పెళ్ళి : లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవి(ఈమెనే దరిద్రదేవత అంటారు) శనైశ్చరుడి భార్య. అంటే శనిభగవానుడు విష్ణుమూర్తికి తోడల్లుడు అన్నమాట., యమధర్మరాజు కి సోదరుడు , గ్రహాలకు యువరాజు .
హరిచ్శంద్రుడు , నలుడు , పురుకుత్సుడు , పురూరవుడు , సగరుడు , కార్తవీర్యార్జునుడు , శని మహిమ వల్ల అనేక కస్టాలు పొంది చివరకి శని కృప వల్లే సర్వ సుఖాలు పొందేరు .
శనిదూషణ సర్వదేవతలనూ తిట్టినదాంతో సమానం అని పెద్దలు చెబుతారు. ఆయనను పూజిస్తే దేవతలందరినీ పూజించినంత ఫలితం లభిస్తుందంటారు. త్రేతాయుగంలో లంకలో రావణాసురుని చెరలో ఉన్న శనైశ్చరుని ఆంజనేయుడు విడిపించాడని ఒక కథనం. అందుకే హనుమత్‌దీక్షలో ఉన్నవారినీ అలాగే మందుడికి ఇష్టమైన నల్లటి వస్త్రాలు ధరించే అయ్యప్ప దీక్షాపరులనూ ఆయన బాధించడని నమ్మిక.
శనీశ్వరుడు మరియు హనుమంతుడు
హనుమంతుడుని పూజించుట వలన శని భగవానుడి యొక్క ఉనికిచే ఏర్పడే 'ప్రతికూల' ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని విశ్వసిస్తారు. రామాయణంలో హనుమంతుడు రావణుని బారి నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా, ఎవరైనా హనుమంతుని ప్రార్ధించినచో, ముఖ్యముగా శనివారాలలో, వారు శనిగ్రహం యొక్క "దుష్ప్రభావాల" నుండి విముక్తులగుదురు, లేదా కనీసం వాటి ప్రభావము తగ్గుతుందని శని హనుమంతునికి ప్రమాణం చేశాడు.
శని భగవానుడు మరియు హనుమంతుని మధ్య జరిగిన ఇంకొక సంఘర్షణను గూర్చిన కథనం ప్రకారం శని ప్రభావము హనుమంతునిపై మొదలవుతున్న సూచికగా, ఒకసారి శని హనుమంతుని భుజాలపై ఎక్కాడు. అప్పుడు హనుమంతుడు భారీ కాయునిగా అవతరించగా, శని హనుమంతుడు భుజాలు మరియు వారు ఉన్న గది యొక్క పైకప్పు మధ్య బంధింపబడ్డాడు. ఆ నొప్పిని భరించలేక శని భగవానుడు హనుమంతుడును తనను విడిచిపెట్టమని వేడుకుంటూ, ఎవరైనా హనుమంతుడిని ప్రార్థించినచో ఆ వ్యక్తిపై తన(శని) యొక్క దుష్ప్రభావాలు తగ్గుట లేదా పూర్తిగా నిర్ములింపబడునట్లుగా చేసెదెనని శనిభగవానుడు మాట యిచ్చాడు. ఆ తరువాత హనుమంతుడు శనిని విడిచిపెట్టెను.
శనీశ్వరుడు - శివుడు :
పూర్వము కృతయుగములో కైలాసము లోని పరమశివుని దర్శించవచ్చిన నారదుడు ... ప్రమేశ్వరునికి నవగ్రహాలలో శనిగ్రహ ఆధిక్యతను బహువిధాల చెప్పాడు . నారదుడు చెప్పిన శనిగ్రహం పొగడ్తలు శివునికి నచ్చలేదు . ఆ కారణము గా .. ' శని అంతటి శక్తిమంతుదైతే తన ప్రభావాన్ని తనపై (శివునిపై) చూపి , తనను పీడించి శని శక్తిసామర్ధ్యాలను నిరూపించుకోమను ' అని శివుడు అనగా నారదుడు ఆవిషయము శని తో చెప్పెను . పరమశివుని మాటలకు శనికి అవేశము , పట్టుదల ప్రేరేపించాయి . తను శివుని ఒక క్షణము పట్టి పీడిస్తానని ... ఆ విషయము తెలియజేయమని నారదునిచే వార్త పంపెను . ఈ విధముగా నారదుడు శివ , శని ల మద్య తగాదా సృష్టించాడు .
నారదుడు తక్షణం శని చెప్పిన మాటలు శివునికి తెలియజేసి శనిప్రభావాన పడకుండా జాగ్రత్తపడమని చెప్పి వెళ్ళిపోయెను . " శని తనను ఎలా పీడించగలడో చూస్తాను ' అనుకుంటూ కైలాసము నుంచి మాయమై దండకారణ్యము దారిపట్టాడు శివుడు . ఎవరి ద్రుష్టికీ ఊహకు రాని చోటుకోసం అలోచించాడు . ఆ ఆడవిలోతూర్పు గోదావరి జిల్లా రావులపాలెం వద్ద మందపల్లి గ్రామం నందు ఒక పెద్ద రావిచెట్టు తొర్ర లొ ఈశ్వరుడు దాక్కున్నాడని, తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి. మరునాడు ఉదయం ఈశ్వరుడు కళ్లు తెరిచేటప్పటికి శని ఎదురుగా నిలబడి ఈశ్వరునికి నమస్కరించాడు. అప్పుడు " ఏ మయింది నీ శపథం " అని ప్రశ్నించాడు ఈశ్వరుడు . ఆయన మాటలకు శని పరిహాసం చేస్తూ " పరమశివుదంతటివాడు దేవతలకు , ఋషులకు , మరి ఎందరికో ఆరాధ్యదైవం , చల్ల్ని ప్రశాంతమైన కైలాసము నుంచి పారిపోయి దండకారణ్యములో పరుగులు పెట్టి దిక్కులేని వాడివలె చెట్టు తొర్రలో దాగుకోవడమంటే ... ఆ క్షణము శని పట్టినట్లు కాదా ! "అని అడిగాడు శని నెమ్మదిగా వినయం గా . శని సమయస్పూర్తికి , వినయానికి ఆయన ప్రభావానికి , పట్టుదలకు మెచ్చుకున్నాడు శివుడు . . తనను మెప్పించిన శనికి ఆనాటినుండి ఈశ్వర అనేశబ్దము సార్ధకం కాగలదని మానవులు తనను(శనిని) శనీశ్వరా అని పూజిస్తే .. శని తరపున పరమశివుడు ఆశీస్సులు ఇస్తానని వరము ఇచ్చెను . అలా శనిగ్రహం శనీశ్వరడు అయ్యాడు .
శని త్రయోదశి ఎలా వాడుకలోనికి వచ్చినది :
సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడునే ఆహా! శని ప్రభావమునకు లోనయ్యాను. సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు , శని... " నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకుని శనేశ్వరుడని పేరు పొందగలవు. ఈ రోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీ కిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంఖు పుష్పములు, నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్పించి ఆరాధిస్తారో .. వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని వరము ఇస్తునానని తెలిపాడు. ఆ తదుపరి త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, పాండవులు, మహామునులు అందరూ కూడా ఈశ్వరునికి అర్చించి తమ దోషాలు పోగొట్టుకున్నారు. శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.
"శని" భగవానునికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం న త్రయోదశి రోజు .
శనీశ్వరుడు మరియు రోమపాద మహారాజు
తన రాజ్యములో నెలకొన్న కరువు మరియు పేదరికానికి శని భగవానుడే కారణమని గుర్తించి ఆయనతో ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడ్డ ఏకైక వ్యక్తి దశరథ మహారాజు. దశరథ మహారాజు యొక్క సుగుణాలను మెచ్చుకుంటూ శనీశ్వరుడు "నేను నా భాద్యతలనుండి తప్పించుకోలేను, కాని నీ ధైర్యానికి ముగ్ధుడనయ్యాను". ఋష్యశృంగ మహర్షి నీకు సాయం చేయగలడు. ఎక్కడైతే ఋష్యశృంగుడు నివశిస్తాడో ఆ దేశములో కరువుకాటకాలు ఉండవు" అని చెప్పెను. శని భగవానుని దీవెనలు అందుకున్న తరువాత దశరథ మహారాజు, ఋష్యశృంగుని తన అల్లునిగా చేసుకొని తన సమస్యను తెలివిగా పరిష్కరించుకున్నాడు. ఋష్యశృంగుడు ఎల్లప్పుడూ అయోధ్యలో ఉండేవిధంగా, దశరథుడు కుమార్తెగా చెప్పబడే 'శాంత'ను ఆయనకు ఇచ్చి వివాహం జరిపించారు.
శనిత్రయోదశి పూజ కోసము వారు కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది.
1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగినవారు ఆరోజు పగలు ఉపవాసము ఉండి సాయంత్రము 8గంటలతరువాత భోజనాదులను చేయటము.
2. ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు.
3. వీలైన వారుశివార్చన స్వయముగా చేయటము.
4. శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు [నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం] అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.
5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.{జపంచేయటానికి కూడా సమయము వెచ్చించలేనివారి కోసము మేమేమీ చేయలేము}
6. ఆరోజు [కుంటివాళ్ళు,వికలాంగులకు] ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం
7. ఎవరివద్దనుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలి.
ఏలినాటి శని గ్రహ దోష శాంతి విదానం :-
1 మయూరి నీఎలం ధరించుట
2 శని జపం ప్రతి రోజు జపించుట
3 శని కి తిలభిషేకం చేఇంచుట
4 శివ దేవునకు అభిషేకం ,ప్రతి సనివారం రోజు ఎనిమిది రూపాయలు లేదా ఎనిమిది సంక్య వచ్చే లాగా బ్రహంనుకి దానం చేయుట
5 శని వారం రోజు నవగ్రహాల ఆలయం లో లేదా శివాలయం లో ప్రసాదం పంచుట
6 ప్రతి రోజు నువుండలు కాకులకు పెట్టుట వలన
7 శని వారం రోజు రొట్టి పై నువుల నూనే వేసి కుక్కలకు పెట్టుట వలన
8 హనుమంతుని పూజ వలన
9 సుందరకాండ లేదా నల చరిత్ర చదువత వలన
10 కాలవలో కానీ నది లో కానీ బొగ్గులు నల్ల నువులు మేకు కలపటం వలన
11 శని ఎకదాస నామాలు చదువత వలన ( సనేస్వర ,కోన, పింగల , బబ్రు, కృష్ణ , రౌద్ర ,అంతక , యమ, సౌరి, మంద ,చాయపుత్ర ) ప్రతి రోజు చడువటం వలన
12 బియపు రవ్వ మరియు పంచదార కలిపి చిమలకు పెట్టుట వలన
13 ఆవుకు నల్ల చెక్క ప్రతి రోజు పెట్టుట వలన
14 ప్రతిహి శని వారం రాగి చెట్టుకు ప్రదషణం మరిఉ నల్ల నువులు మినుములు కలిపినా నీటిని రాగి చెట్టు కు పోయటం వలన
15 ఇనుము తో చేసిన ఉంగరం ధరించుట వలన
16 చేపలు పట్టే పడవ ముందు బాగం లోని మేకు తో ఉంగరం చేసి ధరించుట వలన
17 బ్ర్హమనకు నల్ల వంకాయ, నల్ల నువులు, మేకు , నల్లని దుప్పటి దానం
18 ప్రతి శని వారం శివాలయం లేదా నవగ్రహలయం ముందు బిచ్చగాలకు ఆహరం పెట్టుట వలన నల్లని దుప్పటి దానం చేయటం వలన
19 అయ్యప్ప మాలా ధరించుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి కి తల నీలాలు ఇచ్చుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలా ధరించుట వలన 20 ప్రతి శని వారం వెంకటేశ్వర స్వామి దరసనం శివాలయం లో శివుని దర్సనం హనుమంతుని దర్సనం kala bhirava puja దరసనం వలన శని గ్రహ దోషం సాన్తిచ్చును
న్యాయాధికారి
మానవులు పూర్వజన్మలో చేసుకున్న పాప, పుణ్యాల ఆధారంగా వారి నడవడికను శనైశ్చరుడు నియంత్రిస్తాడంటారు. అలా ఈ జన్మలో ఆ మానవుడు చేసే పాపపుణ్యాల ఆధారంగా మరణానంతరం స్వర్గనరకాలను నిర్ణయిస్తాడు యమధర్మరాజు. సూర్యుని కుమారులైన శని, యమధర్మరాజు ఇలా న్యాయాధికారులుగా వ్యవహరించడం విశేషం. శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడని నమ్మిక. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సద్వర్తన కలిగినవారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడని పెద్దలు చెబుతారు. శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.
మందపల్లి మందుడు
తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలో శనీశ్వరాలయం ప్రసిద్ధిగాంచింది. పూర్వం అశ్వత్ధ´, పిప్పలాదులనే రాక్షసులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునే మునులను సంహరించి వారిని భక్షించేవారట. అప్పుడు వారంతా వెళ్లి అక్కడే పరమేశ్వరుని తపస్సులో ఉన్న శనీశ్వరునితో వెురపెట్టుకున్నారట. వారి వెురను ఆలకించిన మందుడు ఆ రాక్షసులను హతమార్చాడట. అసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని నివారించుకునేందుకు మందపల్లిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడట. అప్పట్నుంచి ఆ ఆలయం శనైశ్చర క్షేత్రంగా పేరుపొందింది. శత్రుబాధ, రుణబాధ, రోగపీడతోనూ... ఏలినాటిశని, అర్ధాష్టమశనితోనూ బాధపడేవారు ఈ స్వామికి తైలాభిషేకం జరిపిస్తే అవన్నీ తొలగిపోతాయని ప్రతీతి. ఏటా శ్రావణమాసంలోనూ శనిత్రయోదశి వచ్చే రోజుల్లోనూ మందేశ్వరుడికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు.
ఇంకా... మహారాష్ట్రలోని శనిసింగణాపూర్‌ ప్రపంచ ప్రసిద్ధ శనైశ్చరాలయం. ఇటీవలే కర్ణాటకలోని ఉడుపిలో దేశంలోనే అతిపెద్దదైన శనీశ్వరుడి విగ్రహాన్ని (23 అడుగులు) ఆవిష్కరించారు.
శని తీర్థయాత్రలు
* మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరి శ్రీ శనైశ్చర దేవాలయం, మంగళూరు, కర్ణాటక.
* శ్రీ శని మహాత్మ దేవాలయం పావగడ, తుంకూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం.
* శనిదేవుని ఆలయం, గ్వాలియర్ కోకిలవనం, వ్రిందావనం.
* శ్రీ శని దేవాలయం బీధ్, మహారాష్ట్ర.
* శ్రీ శని క్షేత్ర నస్తన్పూర్, మహారాష్ట్ర.
* శ్రీ శని క్షేత్ర నమూనా తీర్థ్ నందూర్ బార్, మహారాష్ట్ర.
* శ్రీ శని క్షేత్ర రామేశ్వర తీర్థం.
* శ్రీ శని తీర్థం తిరునలరు పుదుచేరి.
* శ్రీ శని మందిర్ తీర్థం, ఉజ్జయిని.
* శ్రీ శని శింగనాపూర్, మహారాష్ట్ర.
* శ్రీ శని తీర్థ క్షేత్ర, అసోల, ఫతేపూర్ బేరి, మెహ్రులి, ఢిల్లీ.
* శ్రీ సిధ్ శక్తి పీట్ట్ శనిధాం.
* శ్రీ శని దేవాలయం, మడివాల, బెంగుళూరు
* శనైశ్కర దేవాలయం, హస్సన్
* శ్రీ శనిమహాత్మ దేవాలయం, సయ్యాజిరావు మార్గం, మైసూరు.
* శ్రీ శనీశ్వర దేవాలయం, నందివడ్డేమను, నాగర్ కర్నూల్, ఆంధ్రప్రదేశ్.
* శ్రీ శనీశ్వర ఆలయం, శ్రీ కాళహస్తి ఆలయం కాంప్లెక్స్, శ్రీ కాళహస్తి, తిరుపతికి 35 కి.మీ. ఆంధ్రప్రదేశ్.
* శ్రీ శని దేవాలయం, హత్ల, జామ్నగర్ జిల్లా, గుజరాత్
* శ్రీ శనీశ్వరాలయం వీరన్నపాలెం, పర్చూర్ మండలం, ప్రకాశం (జిల్లా) ఆంధ్రప్రదేశ్.
* శ్రీ శనీశ్వరాలయం, మందపల్లి, రావులపాలెం కి 5 కిలోమీటర్లు దూరం. తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం.(ఇది పురాతన ఆలయము)
* శ్రీ శనీశ్వర దేవాలయం, గుంజూరు, వర్తూర్ అనంతరం, బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం.
* శ్రీ శనీశ్వర దేవాలయం, కన్నన్మంగల, బెల్తూర్ అనంతరం, శ్రీ సత్య సాయి ఆశ్రమం, వైట్ఫీల్డ్, బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం.
* శ్రీ శనీశ్వర దేవాలయం, చిక్క తిరుపతికి వెళ్ళే మార్గంలో, బెంగుళూరు, సమేతహళ్లి, కర్ణాటక, భారతదేశం.
* శ్రీ శనీశ్వర దేవాలయం, తిరుపతి, తిరుపతి బస్సు స్టాండ్ దగ్గర, ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
* శ్రీ శనీశ్వర దేవాలయం, కంగ్ర, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం.
* శ్రీ శనీశ్వర దేవాలయం, హోసూర్ మెయిన్ రోడ్, హొస రోడ్, బసపుర, బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం.
* శ్రీ శనీశ్వర దేవాలయం, వైట్ఫీల్డ్, సవన హోటల్ దగ్గర, బెంగుళూరు, భారతదేశం.
* శ్రీ అభయ శనీశ్వర దేవాలయం(1956) రామ్మూర్తినగర్, భారతదేశం.
* శ్రీ శనైశ్కర దేవాలయం - రామ్మూర్తినగర్, బెంగుళూరు, భారతదేశం.
* శ్రీ శనైశ్కర దేవాలయం - హేబ్బాల్, హేబ్బాల్ ఫ్లైఓవర్ క్రింద, బెంగుళూరు, భారతదేశం.
* శ్రీ శనైశ్కర దేవాలయం - అడంబక్కం, చెన్నై, భారతదేశం.
* శ్రీ శనైశ్కర దేవాలయం - డెల్ దగ్గర (నెక్స్ట్ సిగ్నల్ వద్దగల వైట్ గోపుర)కోరమంగల ఇంటర్మీడియట్ రింగ్ రోడ్
* శ్రీ శనైశ్కర దేవాలయం - నతున్గుంజ్, బంకుర, పశ్చిమ బెంగాల్, సంప్ర-ప్రసేన్జిట్ దరిప,S/O లేట్ దేవదాస్ దరిప.
* శ్రీ శనీశ్వర దేవాలయం, అనేకల్, బెంగుళూరు దగ్గర, కర్ణాటక, భారతదేశం.