రజస్వల- శుభాశుభ ఫలితాలు
స్త్రీ తొలుత పుష్పవతియగు తిధి వారము నక్షత్రము ననుసరించి వారికి వారి సంతతికిని శుభాశుభములు గలుగ గలవు.
1 అశ్వని 2 రోహిణి 3 మృగశిర 4 పుష్యమి 5 ఉత్తర 6 హస్త 7 చిత్త 8 స్వాతి 9 విశాఖ 10 అనూరాధ 11 మూల 12 ఉత్తరాషాఢ 13 శ్రవణం 14 థనిష్ఠ 15 శతభిషం 16 ఉత్తరాభాద్ర 17 రేవతి'' అను యీ పదునేడు నక్షత్రములయందు పుష్పవతియైనచో శుభకరము. అనగా దంపతులకు సంతతికి శుభములు చేకూరుచుండగలవని భావము.
1. భరణి 2. కృత్తిక 3 ఆర్ద్ర 4 పునర్వసు 5. ఆశ్లేష 6 మఖ 7 పుబ్బ (పూర్వఫల్గుణి) 8 జ్యేష్ఠ 9 పూర్వాషాఢ 10 పూర్వాభాద్ర అను నీ పది నక్షత్రములలో తొలుత సమర్తాడెనేని అశుభకరము.
ఈ రీతిని వారములు సహ శుభాశుభములుగలవు.
సోమ - బుధ - గురు - శుక్ర వారములు శుభకరములు. అది - మంగళ - శనివారములు అశుభకరములు.
పై చెప్పిన దుష్ట నక్షత్రములకు యిచ్చు ఫలములేవనగా మఖ - ఆర్ద్ర నక్షత్రములలో ప్రధమ రజస్వలయైన వనిత దుఃఖము ననుభవించును.
పునర్వసు - జార గుణము కలుగ గలదు, జ్యేష్ట - కృత్తికలు దరిద్రురాలు భరణి పుబ్బ - పూర్వాషాఢ - పూర్వాబాద్ర - ఆశ్రేషలు తొలిపాదమున వైధవ్యము - రెండవపాదమున గొడ్రాలు, మూడవ పాదమున దరిద్రురాలు. నాలుగవ పాదమున శుభములు బొందును. ఈ visdhana
ఆది - మంగళ - శని వారములలో ప్రధమ రజస్వల యైనచో రోగవంతురాలునగును.
సూర్యోదయాస్తమయ కాలములు, గ్రహణము, అమావాస పౌర్ణమి, బహుళాష్టమి, బహుళచతుర్దశి. మేషాదిసంక్రమణ కాలములు, చవితి షష్టి అష్టమ నవమి ద్వాదశిత్యాజ్వ ఘడియలు, అవమా. త్రిద్యుస్పృక్‌లు, (అవమ-మూడు తిధులుగల వారము) (త్రిద్యుస్పృక్ - మూడు వారములతో గూడిన తిధి) పై చెప్పిన దుష్ట నక్షత్రములలో సూర్యుడుండగనూ, ప్రధమావర్తమునకు దోషకరములుగాన యధావిధినీ శాంతి జరుపుకొనుట శ్రేయస్కరము.
ఈ రీతిని ప్రధమరజస్వలమైన తిది వార నక్షత్రములు చూచుకొని దోషములున్న శాంత్యాదులు జరపుకొని, శుభ తిది వార నక్షత్రలగ్నములు గుర్తించి, లగ్న శుద్ధి అష్టమశుద్ధిగల పుంలగ్నమున నిషేకము యధాశాస్త్రీయముగ జరపినచో గల్గు సంతతి, మంచి ఆయుర్దాయము, అదృష్టము అధికారము. కీర్తి ప్రతిష్టలు తేజోకాంతులు గల్గినవారై మంచి ధర్మాత్ములుగను, నుండగలరు.
No comments:
Post a Comment