Monday, July 14, 2014

మీ నక్షత్రము ప్రకారము మీ అదృష్ట సంఖ్య మీకు తెలుసా ? lucky numbers based on birth star ?

అశ్వని - మఖ - మూల : - 7
భరణి - పుబ్బ -పుర్వషాడ :- 6
కృత్తిక - ఉత్తర - ఉత్తరాషాడ :- 1
రోహిణి -హస్త -శ్రవణం :- 2
మృగశిర - చిత్త - ధనిష్ఠ :- 9
ఆర్ద్ర - స్వాతి - శతభిష :- 4
పునర్వసు -విశాఖ - పూర్వాభాద్ర :- 3
పుష్యమి - అనూరాధ - ఉత్తరాభాద్ర :- 8
ఆశ్లేష - జ్యేష్ఠ - రేవతి :- 5
" జన్మ మరియు నామ " తారలు అయిన వారికి .

Wednesday, June 11, 2014

మన యొక్క అంతిమ లక్ష్యం సత్యమును తెలుసుకొనుటమే

మన వైదిక సంస్కృతి మానవాళికి సాంప్రదాయాలను తెలియజేస్తూ సాధించవలసిన అంతిమ లక్ష్యం కోసం విధానాలను ఏర్పరిచాయి. మన యొక్క అంతిమ లక్ష్యం సత్యమును తెలుసుకొనుటమే. ఆ సత్యమును తెలుసుకొనుటకు వ్రతము యొక్క ఆవశ్యకతను గురించి ఈ శ్లోకంలో తెలియజేయబడినది.
శ్లోకం:
వ్రతేన దీక్షా మాప్నోతి దీక్షామాప్నోతి దక్షిణాం
దక్షిణాం శ్రద్ధా మాప్నోతి శ్రద్దయా సత్య మాప్యతే


వ్రతము వలన దీక్ష, దీక్ష వలన దక్షిణ, దక్షిణ వలన శ్రద్ధ, శ్రద్ధ వలన సత్యం లభిస్తుంది. కనుక మనము విధిగా వ్రతాలను ఆచరించాలి
వ్రతమనగా నియమిత సమయంలో నిర్దేశించిన కార్యమును ఆచరించుట

Thursday, May 8, 2014

ఉపచారములు ఆధ్యాత్మికంగా వాటి ఉపయోగం ? Who many Vupacharas there in Hindu Dharma ?

What is Panchopachara Pooja  ?  Who many Vupacharas there in Hindu Dharma ?

ఉపచారము అనగా భగవంతునికి పూజ నందు చేయు సేవలు లేదా కైంకర్యము లు అని చెప్పవచ్చు. సనాతన ధర్మము  నందు ఎన్నో రకముల సంప్రదాయములు , ఆచార వ్యవహారములు కలవు కావున వారి వారి పద్ధతి ని ఆచరించి ఈ ఉప చారములు  వున్నవి . అందు కొన్ని వివరించు కొను ప్రయత్నం చేయుచున్నాను .

ఈ ఉపచారముల యందు ఏకోపచారము , త్రయోపచారము ,పంచోపచారము ,నవోపచారము , షోడశోపచారము ,అష్టాదసోపచారము ,ఎకవింశత్యుపచారం , ఎకత్రింశత్యుపచారములు మున్నగు భేదములు అనేకము కలవు .

 కేవలం నైవేద్యము ను మాత్రమే చెల్లించుట ఏకోపచారము అనబడును . స్నాన , పుష్ప ,నైవేద్యము
లు త్రయోపచారము లేక త్రివిదోపచారము అగును . గంధ ,పుష్ప ,ధూప ,దీప,నైవేద్యం పంచోపచారము అనబడును .

 ఆవాహన , పాద్య , ఆచమన , స్నాన , గంధ , పుష్ప ,ధూప ,దీప ,నైవేద్యములు ,నవోపచారములు అని చెప్ప బడినది .

 ఆవాహన , ఆసన ,పాద్య ,అర్ఘ్య , ఆచమన , స్నాన ,వస్త్ర , గంధ , పుష్ప ,ధూప ,దీప ,నైవేద్యము,తాంబూలం ,నీరాజన ,మంత్ర పుష్పం , నమస్కారములు ,గావించుట షోడశోపచారము .


 ధ్యాన , ఆవాహన , ఆసన ,పాద్య ,అర్ఘ్య , ఆచమన ,మధుపర్క , స్నాన ,వస్త్ర , గంధ , పుష్ప ,ధూప ,దీప ,నైవేద్యము,తాంబూలం ,నీరాజన ,మంత్ర పుష్పం , నమస్కారములు అష్టాదసోపచారము .


 ధ్యాన , ఆవాహన , ఆసన ,పాద్య ,అర్ఘ్య , ఆచమన ,మధుపర్క , స్నాన ,వస్త్ర ,యజ్ఞోపవీత ,  గంధ ,ఆభరణ , పుష్ప ,ధూప ,దీప ,నైవేద్యము,తాంబూలం ,నీరాజన ,మంత్ర పుష్పం , నమస్కారములు ఎకవింశత్యుపచారములు అగును .

శైవ ధర్మమున శరీరస్తంబులగు ముప్పదియారు తత్వముల కార్య సమర్పనాత్మకముగ ముప్పదియారు ఉపచారములు శివ పూజ యందు గావింపబడుచుండెది . దేవి పూజలందు అరవైనాలుగు ఉపచారములు  ఉపయోగించటం జరుగు చున్నది .

షోడశోపచారము  ప్రసిద్ధములు , మంత్ర శాస్త్ర పరముగ పంచోపచారములు ప్రసిద్ధములు . జప , తప , స్తోత్ర , కవచాదుల యందు , దీని వినియోగం అధికం . దీనిని లమితి పంచ పూజ యని యును వ్యవహరించు చుందురు .