Monday, June 16, 2025

కళ్యాణ ఘడియలు తెలుసుకోవ‌డం ఎలా..?

 కళ్యాణ ఘడియలు తెలుసుకోవ‌డం ఎలా..?


మ‌నిషి జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్య‌మైన సంద‌ర్భం. పెళ్లి ఎప్పుడు జ‌రుగుతుంద‌ని వ‌య‌సు వ‌చ్చిన‌ ప్ర‌తి వ్య‌క్తిలో ఆలోచ‌న మొద‌ల‌వుతుంది. కొంద‌రిలో అనుకున్న స‌మ‌యంలో వివాహం కాక.. అది ఒక‌ స‌మ‌స్య‌గా మారుతుంది. జాత‌కం ప్రకారమే వివాహ స‌మ‌యం నిర్థేశించ‌బ‌డుతుంద‌ని గ‌మ‌నించాలి. అయితే 22 సంవత్సరాల్లోపు జరిగే వివాహాలను తొందరగా(శీఘ్రం) జరిగే వివాహాలుగా చెప్పుకోవచ్చు. 28 సంవత్సరాలు, ఆ పై వయస్సులో జరిగేవి ఆలస్య వివాహం.


తొందరగా(శీఘ్రం) జరిగే వివాహాలకు కార‌ణం


లగ్నం, సప్తమభావముల యందు శుభ గ్రహాలు ఉండి సప్తమాధిపతి పాప గ్రహాలతో కలవకుండా శుభ గ్రహాల దృష్టి పొందడం వ‌ల్ల‌, లేదా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు. అనగా మిథున రాశిలో గాని, తుల, వృషభ రాశులలోగాని, రవికి 150 లకుపైగా దూరంగా ఉన్నప్పుడు. లేదా

శుక్రుడు, శని గ్రహాలపైన చంద్రుని దృష్టి పడకుండా ఉన్నప్పుడు. లేదా శుభ గ్రహాలు వక్రగతి పొందకుండా ఉన్నప్పుడు. లేదా ద్వితీయ అష్టమ స్థానమలలో శుభ గ్రహాలు ఉన్నప్పుడు. లేదా శుభ గ్రహాలు వక్రగతి పొందకుండా ఉన్నప్పుడు లేదా జ‌లతత్వ రాశులలో శుభగ్రాహాలు ఉన్నప్పుడు వివాహం తొందరగా జరుగుతుంది.


ఆలస్య వివాహానికి గల కారణాలు


లగ్నమందు, సప్తమ స్థానమందు పాపగ్రహాలు అనగా.. శని, రాహు, కేతువు, రవి, కుజ గ్రహాలు ఉన్నప్పుడు, సప్తమ స్థానమందు 2 గాని అంతకన్నా ఎక్కువ పాపగ్రహాలు ఉన్నప్పుడు. లేదా ద్వితీయ అష్టమ భావములలో పాపగ్రహా లు గాని, వక్రములు గాని ఉన్నప్పుడు. లేదా  శుక్రుడు రాహువుతో గాని, శనితో గాని కలిసివున్నప్పుడు. లేదా శుక్రుడు రవి గ్రహానికి 430 201 కన్నా ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు. లేదా జాతకంలో ఎక్కువ గ్రహాలు నీచంలో గాని వక్రించి గాని ఉన్నప్పుడు. లేదా సప్తమ భావముపై, సప్తమాధిపై పాప గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఆలస్య వివాహం జరుగును.


ఇలా జాతకంలో శ్రీఘ్ర వివాహమా? ఆలస్య వివాహమా అని నిర్ణయించిన తర్వాత జరుగుతున్న దశ అంతర్దశలను బట్టి గోచారంలో గురువు, శుక్ర గ్రహాలను బట్టి వివాహ కాలం నిర్ణయించుకోవ‌చ్చు.


వివాహకాలం నిర్ణయించుటకు జాతకునికి 21 సంవ‌త్స‌రాలు దాటిన తరువాత వచ్చు దశ అంతర్దశలను పరిశీలించాలి. సప్తమాది యెక్క లేదా సప్తమ భావాన్ని చూస్తున్న లేదా సప్తమాధిపతితో యతి వీక్షణలు పొందుతున్న గ్రహాల యొక్క దశ, అంతర్దశలలో వివాహం జరుగుతుంది. అలాగే నవాంశ లగ్నాధిపతి యొక్క, లేదా సప్తమాదిపతి నవాంశమందున్న రాశి నాథుని యొక్క‌ దశ, అంతర్దశలలో పెళ్లి జరుగుతుంది. ఈ విధంగా పెళ్లి జరిగే స‌మ‌యం నిర్ణయించిన తర్వాత గురు గ్రహం గోచార గమనాన్ని బట్టి వివాహం జరుగే సంవత్సరం నిర్ణయించాలి. వ‌రుడి జాతకంలో శుక్రుడు, వ‌ధువు జాతకంలో కుజుడు ఉన్న రాశులపై గోచార గురువు యొక్క దృష్టి లేదా కలయిక వచ్చిన సంవత్సరంలో వివాహం జరుగుతుంది.


ఉత్తరాయణ కాలంలో జన్మించిన వారికి నవాంశలో గురువు ఉన్న రాశిలోనికి గాని, గురువుకు 5, 9 స్థానాల్లోగాని రవి గోచార రీత్యా వచ్చిన నెలలో వివాహం జరుగుతుంది. దక్షిణాయణంలో జన్మించిన వారికి నవాంశలో శుక్రుడున్న రాశిలోగాని, శుక్రునికి 5, 9 స్థానాలల్లోనికి గాని గోచార రవి వచ్చిన మాసంలో పెళ్లి జరుగుతుంది. ఈ విధంగా గురువు యొక్క సంచారాన్ని బట్టి పెళ్లి జరుగు సంవత్సరం, రవి యొక్క సంచారాన్ని బట్టి వివాహం జరుగు మాసం నిర్ణయించాలి. త‌ర్వాత చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి పెళ్లి జరిగే రోజు నిర్ణయించాలి.


జాతక చక్రం పరిశీలించేటప్పుడు ఆలస్య వివాహానికి కారణం తెలుసుకొని తత్సంబంధమైన గ్రహానికి సంబంధించిన పరిహారాలు చేయాలు చేయాలి. అప్పుడే దోషాలు తొలగి శ్రీఘ్ర వివాహం జరుగుతుంది. సప్తమస్థానంపై రాహు, కేతువుల ప్రభావం ఉన్నప్పుడు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా ఫ‌లితం ఉండ‌దు. కొన్ని సందర్భాల్లో నిశ్చితార్ధం జరిగిన తరువాత కూడా పెళ్లి ముందు రోజు కూడా ఏవో కారణాల వల్ల వాయిదా పడుతుంటాయి. ఇటువంటి వారు కనక దుర్గమ్మ వారికి 8 శుక్రవారాలు కుంకుమార్చన జరిపించ‌డం వ‌ల్ల‌ దోషాలు తొల‌గిపోతాయి. 


వివాహం తొందరగా కావాలని కోరుకునే వారు 8 మంగళవారాలు హనుమాన్‌ ఆలయంలో స్వామివారికి 108 తమల పాకులతో అర్చన జరిపించ‌డం వ‌ల్ల పెళ్లి కుదుదరుతుంది. శని గ్రహ దోషం వల్ల వివాహం ఆలస్యమవుతుంటే తమల పాకులలో తేనె పోసి నల్ల చీమలకు ఆహారంగా ఉంచ‌డం వ‌ల్ల ఆ దోషం న‌శించిపోతుంది.


ఏదో ఒక కారణం వల్ల వివాహం ఆలస్యం అవుతుంటే ఈ క్రింది మంత్రమును ప్రతి రోజూ 108 సార్లు పారాయణం చేయాలి.

దేవీంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిణి సర్వ సౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్యదాయ  


గ్రహములు-వ్యాధులు

 గ్రహములు-వ్యాధులు


 గురువు : కాలేయం, మధుమేహం, రక్తనాళాలు, కుడిచెవి, తొడలు, నితంబములు, అతిమూత్రవ్యాధి, బి.పి. (రక్తవికారం) హృదయరోగం, నడుము, కాళ్ళనొప్పులు, పక్షవాతం, సన్నిపాతం, మాట పడిపోవడం, వంటి వ్యాధులు లేదా వాటికి సంబంధించిన వ్యాధులు రావచ్చు.


శని : కీళ్ళు, మోకాళ్ళు, దంతాలు, ఎముకలు, చర్మవ్యాధులుటాంయి. నరాల బలహీనత, బోన్స్‌ వీక్‌నెస్‌, వాత సంబంధ గ్యాస్‌ (వాయు) వికారాలు, దీర్ఘ వ్యాధులు, పక్షవాతం, అంగములు, కాళ్ళు, చేతులు పీలబడుట, కాళ్ళు ఉబ్బుట, మచ్చలు లేచుట వంటి వ్యాధులకు గురి కావచ్చు. వీరికి ప్రమాదాలు (యాక్సిడెంట్లు) ఎక్కువగా అవుతాయి. మానసిక పైత్య, ఉదర (అజీర్తి) వ్యాధులు కూడా ఉంటాయి.


రవి : ఎముకలు, తల, నేత్రములు, గుండె, రక్తప్రసరణ, ఊపిరితిత్తులు, చేతులు, దంత, కంఠ, ఎడమ కన్ను వ్యాధులుటాంయి. అర్షమొలలు, తలనొప్పులు, బోన్స్‌ వీక్‌నెస్‌, పిత్యాధిక్యత, పిరికితనం ఉంటాయి. అగ్ని, విద్యుత్తు, శస్త్ర చికిత్సలెక్కువ. చర్మ సంబంధ వ్యాధులుటాంయి.


బుధ : నరములు, ఊపిరితిత్తులు, చేతులు, దంత, నాలుక, కంఠం, దురద, నోటికి సంబంధించినవి. మూర్ఛ, ఫిట్స్ వంటి రుగ్మతలు, గాయాలు, చర్మవ్యాధులు, సన్నిపాతం, జ్వరం, దేనిక్రిందనైనా పడి నలగడం వంటివి ఉండవచ్చు. చేతులకు భుజాలకు ప్రమాదాలెక్కువ, అస్పష్టవాక్కు.


కుజ : నుదురు, శిరస్సు, ముక్కు, కండరాలు, జననేంద్రియాలు, అర్శమొలలు, రక్తస్రారం, గాయాలు, వేడివల్ల వచ్చే అనారోగ్యాలు, అగ్ని, విద్యుత్తు ప్రమాదాలు, అస్త్ర, శస్త్ర భయం, చర్మవ్యాధులు, క్యాన్సర్‌ పుండు, యాక్సిడెంట్లు, కండరాల నొప్పులు, బి.పి. అతిదాహం, పిత్తాధిక్యం, అజీర్తి, నిద్రలేమి, రక్తహీనత ఉంటాయి.


శుక్ర : జననేంద్రియ వ్యాధులు, కఫం, వీర్యం, అతిమూత్రవ్యాధి, గుప్తరోగాలు, జలగండాలు, ముక్కు,  చెవులు, శిరస్సు సంబంధించిన వ్యాధులు, కంఠ సంబంధ వ్యాధి ఏదో ఒకి తప్పక ఉంటుంది. శరీర ఆయాసం, నీరసముంటుంది. స్త్రీలైన ప్రసవవేదన, ఋతుదోషం లేదా మరే ఇతర స్త్రీ సంబంధ వ్యాధులుండవచ్చు.


చంద్ర : దగ్గు, దమ్ము, ఆస్త్మా, పైత్యం, ఉదరవ్యాధులు, ద్రవసంబంధవ్యాధులు, ఇస్నోఫీలియా, కఫరోగం, నేత్రవ్యాధులు, మస్తిష్కవ్యాధులు, మూర్ఛలు, ఉన్మాదం, షుగరు, స్వప్నదోష వ్యాధులు, యక్ష్మ, వీర్యం, టాన్సిల్స్‌, గండమాల, ఊపిరితిత్తుల వ్యాధి, శ్వాసరోగం, మర్మావయం, క్షయ, నీటిగండం, జలదరింపులు, భూత ప్రేత భయాలు, మూఢ విశ్వాసాలు, నస, గులుగుడు, ఏకాంతం, శాడిజం ఉంటాయి.


రాహు : నేత్రవ్యాధులు, మశూచి వంటి చర్మవ్యాధులు, అపస్మారకం వంటి మానసిక వ్యాధులు, హృదయరోగాలుటాంయి.


కేతువు : చర్మ, ఉదర, పైత్య, హృదయ సంబంధ వ్యాధులుంటాయి. వీరికి చెమట విపరీతంగా ఉంటుంది.


గృహప్రవేశమునకు సాముదాయకముగా శుభాశుభములు

 గృహప్రవేశమునకు సాముదాయకముగా శుభాశుభములు


శుభ తిథులు : శుక్ల పక్షమున తదియ,పంచమి,సప్తమి,దశమి,ఏకాదశి,త్రయెాదశి,పూర్ణిమ తిథులును,బహుళపక్షమున పాడ్యమి,విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి,తిథులు.

శుభ వారములు: సోమ,బుధ,గురు,శుక్రవారములు.

శుభ మాసములు:-మాఘ,ఫాల్గుణ,వైశాఖ,జ్యేష్ఠమాసములు శుభప్రదమైనవి.మార్గశిర కార్తీక మాసములు మధ్యమ ఫలముల నిచ్చునట్టివిగా తెలుసుకొనవలయును.

శుభ నక్షత్రములు:రోహిణి,మృగశిర,ఉత్తర,ఉత్తరాషాఢ,చిత్త,అనూరాధ,ధనిష్ఠ,శతభిషం,రేవతి.

శుభ లగ్నములు:వృషభ,మిథున,సింహ,కన్య,వృశ్చిక,ధనస్సు,కుంభం,మీనం.

విశేషములు అష్టమశుద్ది,చతుర్దశుద్ది,కలిశ చక్రశుద్ది కలిగియుండ వలయును.వృషభచక్ర శుద్ది కూడా చూచుట మంచిది.

 నూతన గృహరంభ గృహప్రవేశ విషయమై వృషభచక్రశుద్ధి


రవి యున్న నక్షత్రాదిగా ఫలితములు చూచుకోవాలి.రవి అనూరాధ నక్షత్రములో యున్న అనూరాధ  మెుదలు 3 నక్షత్రములు  అంటే 1.అనూరాధ 2.జ్యేష్ఠ,3.మూల నక్షత్రములలో ఒకటి అయిన దుర్దశగను,తరువాత 4 పూర్వాషాఢ,5.ఉత్తరాషాఢ,6.శ్రవణ,7.ధనిష్ఠ నక్షత్రములైన దురవస్తగా స్వీకరించాలి.కానీ పాఠకులు ఈ శ్రమకు వెనుతగ్గి గృహస్థులకు తగిన న్యాయము జరుపుట లేనందున పాఠకులకు ఇసుమంత శ్రమలేకుండా రవియున్న నక్షత్రమున కెదురు వృషభచక్రశుద్ధి కలిగిన నక్షత్రముల పట్టిక తెలుపుచున్నాను.ముఖ్యము గృహారంభమునకు వృహభచక్రశుద్దిని,గృహప్రవేశమునకు కలిశచక్రశుద్దిని,అత్యంత ప్రాధాన్యముగాగుర్తించండి.ఉభయ చక్ర శుద్ధులు చూచుట మిక్కిలి శుభదాయకము.

 రవి సంచార నక్షత్రము నుండి లెక్కించగా (వృషభ చక్రమమదు అభిజిత్తు సహా లెక్కించాలి)

1. 1,2,3 నక్షత్రములు - దుర్దశ

2. 4,5,6,7, నక్షత్రములు - దురవస్థ

3. 8,9,10,11 నక్షత్రములు - చిరకాల స్థైర్యం

4. 12,13,14, నక్షత్రములు - దేశభ్రమణం

5. 15,16,17,18 నక్షత్రములు - ధనం

6. 19,20,21,22 నక్షత్రములు - ధాన్యం

7. 23,24,25 నక్షత్రములు - సంపద

8. 26,27,28 నక్షత్రములు - పశువృద్ది

 గృహారంభ,గృహప్రవేశములకు వృషభ చక్రశుద్ధి


రవిసంచార నక్షత్రము - గృహారంభ,గృహప్రవేశ ముహూర్త నక్షములకు వృషభ చక్ర శుద్ధి అయిన నక్షత్రములు.

అశ్వని పుష్య,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూరాధ,మూల,ఉత్తరాషాఢ,శ్రవణం,ధనిష్ఠ,శతభిషం,ఉత్తరాభాద్ర,రేవతి.

భరణి మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూరాధ,మూల,ఉ.షా,శవణ,ధని,శత,ఉ.భా,రేవతి,అశ్వని.

కృత్తిక మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధని,శత,ఉ.భా,రేవతి,అశ్వని.

రోహిణి ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా;శ్రవణ,ధనిష్ఠ,శత,ఉ.భా;రేవతి అశ్వని.

మృగశిర ఉత్తర,హస్త,చిత్త,అనూ,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి.

ఆరుద్ర హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర.

పునర్వసు చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగ.

పుష్యమి  స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధని,శత,ఉ.భా,రేవ,అశ్వని,రోహిణి,మృగ,పుష్యర్వసు.

అశ్లేష అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవ,అశ్వ,రోహి,మృగ,పునర్వ,పుష్యమి.

మఖ అనూ,మూల,ఉ.షాశ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి.

పుబ్బ మూల,ఉ.షా,శ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహి,మృగశిర,పునర్వ,పుష్య,మఖ.

ఉత్తర మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ.

హస్త ఉ.షా,శ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగ,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర.

చిత్త ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త.

స్వాతి శ్రవణ,ధనిష్ఠ,శత,ఉ భా,రేవ,అశ్వని,రోహిణిమృగ,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త.

విశాఖ శ్రవణ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగ,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి.

అనూరాధ ధనిష్ఠ,శత,ఉభా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి.

జ్యేష్ఠ శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్య,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ.

మూల ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్య,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల.

పూర్వాషాఢ ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల.

ఉత్తరాషాఢ రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూరాధ,మూల.

శ్రవణం రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా.

ధనిష్ఠ రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవణ.

శతభిషం రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ.

పూర్వాభాద్ర మృగ,పునర్వసు,పుష్య,మఖ,ఉత్తర,హస్త,చిత్త స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శతభిషం.

ఉత్తరాభాద్ర పునర్వసు,పుష్య,మఖ,ఉత్తర,హస్త చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శతభిష,పూర్వాభాద్ర.

రేవతి పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శత,ఉ.భా.                      నూతన గృహారంభ గృహప్రవేశ విషయమై కలిశ చక్రశుద్ధి


1. 1వ నక్షత్రము - శిరచ్చేదము

2. 2,3,4,5 నక్షత్రములు - పరదేశ గమనము

3. 6,7,8,9 నక్షత్రములు - నిర్భయము

4. 10,11,12,13 నక్షత్రములు - ధాన్యము

5. 14,15,16,17 నక్షత్రములు - నిర్ధనము

6. 18,19,20,21 నక్షత్రము - గర్భాస్రావము

7.22,23,24,నక్షత్రములు - సంపద

8.25,26,27,28 నక్షత్రములు - పూర్ణాయువు

రవి సంచార నక్షత్రమునుండి లెక్చించగా పై ఫలితములు కలుగును.కలిశచక్రమునందు 27.నక్షత్రములు మాత్రమే లెంక్కించాలి,కలశచక్ర శుద్ధి కలిగిన నక్షత్రములను దిగువ చక్రము ద్వారా తెలుపుచున్నాను.

 గృహారంభ, గృహప్రవేశములకు కలశ చక్రశుద్ధి


రవిసంచార నక్షత్రము -  గృహారంభ,గృహప్రవేశ మూహూర్త నక్షత్రములకు కలశ చక్ర శుద్ధి అయిన నక్షత్రములు


అశ్వని పున,పుష్య,మఖ,ఉత్త,హస్త,శ్రవ,ధని,శత,ఉ.భా,రేవతి.

భరణి పున,పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,ధని,శత,ఉ.భా,రేవతి,అశ్వని,

కృత్తిక పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి,శత,ఉ.భా,రేవతి,అశ్వని.

రోహిణి మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,ఉ.భా,రేవతి,అశ్వని.

మృగశిర మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి.

ఆరుద్ర ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,రేవతి,అశ్వని,రోహిణి.

పునర్వసు ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,అశ్వని,రోహిణి,మృగశిర.

పుష్యమి హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,రోహిణి,మృగశిర,పునర్వసు.

ఆశ్లేష చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,రోహిణి,మృగశిర,పున,పుష్యమి.

మఖ స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవణ,రోహి,మృగ,పున,పుష్యమి.

పుబ్బ అనూ,మూల,ఉ షా,శ్రవ,ధని,మృగశిర,పున,పుష్యమి,మఖ.

ఉత్తర అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధని,శత,పునర్వసు,పుష్యమి,మఖ.

హస్త మూల,ఉ.షా,శ్రవ,ధని,శతభిష,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర.

చిత్త మూల,ఉ.షా,శ్రవ,శతభిష,ఉ.భా,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త.

స్వాతి ఉ.షా,శ్రవ,ధన,శతభిష,ఉ.భా,రేవతి,మఖ,ఉత్తర,హస్త,చిత్త.

విశాఖ ఉ.షా,శ్రవ,ధని,ఉ.భా,రేవ,అశ్వ,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి.

అనూరాధ శ్రవ,ధని,శతభిష,ఉ.భా,రేవ,అశ్వ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి.

జ్యేష్ఠ ధని,శతభిష,ఉ.భా,రేవతి,అశ్వని,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూరాధ.

మూల శతభిష,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,హస్త,చిత్త,స్వాతి,అనూరాధ.

పూర్వషాఢ ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,చిత్త,స్వాతి,అనూ,మూల.

ఉత్తరాషాఢ ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,స్వాతి,అనూరాధ,మూల.

శ్రవణం  రేవతి,అశ్వని,రోహి,మృగశిర,పునర్వసు,అనూ,మూల,ఉత్తరాషాఢ.

ధనిష్ఠ అశ్వని,రోహి,మృగశిర,పున,పుష్యమి,అనూ,మూల,ఉ.షా,శ్రవణం.

శతభిషం రోహిణి,మృగశిర,పున,పుష్యమి,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ.

పూర్వాభాద్ర రోహిణి,మృగశిర,పున,పుష్యమి,మఖ,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శతభిషం.

ఉత్తరాభాద్ర రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శతభిషం.

రేవతి మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,ఉ.షా,శ్రవణం,ధనిష్ఠ,శతభిషం.ఉ.భా.                  

షష్ట్యంశ వర్గచక్ర విశ్లేషణ

 షష్ట్యంశ వర్గచక్ర విశ్లేషణ

      షష్ట్యంశ కాల వ్యవధి 1-30 నిమిషాల  నుండి 2 నిమిషాలు వరకు ఉండును. ప్రతిభావాన్ని అరవై భాగాలు చేయగా 01 -30ల నుండి 2 నిమిషాల ప్రమాణం ఉంటుంది. ఒక షష్ట్యంశ బేసిరాశులలో 0 నుండి 60 వరకు, సరి రాశులలో 60 నుండి 0 వరకు లెక్కించటం జరుగుతుంది. రాశిలో ఉన్న గ్రహ స్ఫుటాన్ని 2 పెట్టి గుణించి, నిమిషాలను వదలివేసి, డిగ్రీలను 12 పెట్టి భాగించి శేషానికి 1 కలపాలి. వచ్చిన మొత్తాన్ని ఆ గ్రహం ఉన్న రాశి నుండి లెక్కించాలి. 2 నిమిషాల కాల వ్యవదిలో షష్ట్యంశ వర్గ చక్రంలో గ్రహాలు మార్పు చెందుతాయి కావున కవలల విషయంలో షష్ట్యంశ వర్గ చక్రం విశ్లేషణ అత్యంత ప్రాముఖ్యమైనది.


   షష్ట్యంశ ద్వారా సమస్త విషయాలు తెలుసుకోవచ్చును. పూర్వజన్మ విషయాలు తెలుసుకోవచ్చును. కవలల పిల్లల విశ్లేషణకు, ముహూర్త విషయంలో, ముహూర్త లగ్నం షష్ట్యంశలో మంచిగా ఉండాలి.


    గురుగ్రహం మృదంశలో ఉంటే గురుగ్రహ అనుగ్రహం లభించినట్టే. బేసిరాశులలో 19 వది, సరిరాశులలో 42 వది మృదంశ అవుతుంది. 


బేసి రాశులలో మృదంశ డిగ్రీలు -9°-0' నుండి 9°-30'   

సరి రాశులలో మృదంశ డిగ్రీలు - 20°-30' నుండి 21°-00'


    బేసిరాశులలో మిధున, తుల, ధనస్సు మంచివి. సరిరాశులలో వృషభ, కర్కాటకం, మీనం మంచివి. సర్వోత్తమ స్దితి మీనరాశిలో రేవతి నక్షత్రంలో గురువు ఉండటం మంచిది. పై స్ధితులలో గురువు ఉన్న ఇబ్బంది పడుతున్నారంటే దాని అర్ధం ఈ జన్మలో గురుదోషం ఉందని అర్ధం.


లగ్నం గాని, గ్రహం గాని శుభ  షష్ట్యంశలలో ఉంటే శుభ ఫలితాలను, పాప షష్ట్యంశలలో ఉంటే అశుభ ఫలితాలను ఇస్తాయి. 60 షష్ట్యంశలలో 60 మంది దేవతలు ఉంటారు.


షష్ట్యంశ దేవతలు 

ఘోరశ్చ రాక్షశో దేవః కుబేరో యక్షకిన్నరౌ ।

భ్రష్టః కులఘ్నో గరలో వహ్నిర్మాయా పురీషకః ॥


అపామ్పతిర్మరుత్వాంశ్చ కాలః సర్పామృతేన్దుకాః ।

మృదుః కోమలహేరమ్బబ్రహ్మవిష్ణుమహేశ్వరాః ॥


దేవార్ద్రౌ కలినాశశ్చ క్షితీశకమలాకరౌ ।

గులికో మృత్యుకాలశ్చ దావాగ్నిర్ఘోరసంజ్ఞకః ॥


యమశ్చ కణ్టకసుధాఽమృతౌ పూర్ణనిశాకరః ।

విషదగ్ధకులాన్తశ్చ ముఖ్యో వంశక్షయస్తథా ॥


ఉత్పాతకాలసౌమ్యాఖ్యాః కోమలః శీతలాభిధః ।

కరాలదంష్ట్రచన్ద్రాస్యౌ ప్రవీణః కాలపావకః ॥


దణ్డభృన్నిర్మలః సౌమ్యః క్రూరోఽతిశీతలోఽమృతః ।

పయోధిభ్రమణాఖ్యౌ చ చన్ద్రరేఖా త్వయుగ్మపాః ॥


సమే భే వ్యత్యయాజ్జ్ఞేయాః షష్ట్యంశేశాః ప్రకీర్తితాః ।

షష్ట్యాంశస్వామినస్త్వోజే తదీశాదవ్యత్పయః సమే ॥


శుభషష్టయంశసంయుక్తా గ్రహాః శుభఫలప్రదాః ।

క్రూరషష్ట్యంశాసంయుక్తా నాశయన్తి ఖచారిణః ॥


1) ఘోరాంశ (అశుభం), 2) రాక్షసాంశ (అశుభం), 3) దేవాంశ (శుభం), 4) కుభేరాంశ (శుభం), 5) యక్షాంశ (అశుభం), 6) కిన్నెరాంశ (శుభం), 7) భ్రష్టాంశ (అశుభం), 8) కులజ్ఞాంశ (అశుభం), 9) గరళాంశ (అశుభం), 10) అగ్నింశ (అశుభం), 11) మాయాంశ (శుభం), 12) పురీశాంశ (అశుభం), 13) అపంపత్యంశ (శుభం), 14) మరుత్యంశ (శుభం), 15) కలాంశ (శుభం), 16) సర్పాంశ (అశుభం), 17) అమృతాంశ (శుభం), 18) చంద్రాంశ (శుభం), 19) మృదుంశ (శుభం), 20) కోమలాంశ (శుభం), 21) హేరంభాంశ (శుభం), 22) బ్రహ్మాంశ (శుభం), 23) విష్ణాంశ (శుభం), 24) దిగంబరాంశ (అశుభం), 25) దేవాంశ (శుభం), 26) ఇంద్రాంశ (శుభం), 27) కలినాశనాంశ (శుభం), 28) క్షితీశ్వరాంశ (శుభం), 29) కమలాకరాంశ (శుభం), 30) గుళికాంశ (అశుభం), 31) మృత్యుకరాంశ (అశుభం), 32) కళాంశ (అశుభం), 33) దావాగ్నింశ (అశుభం), 34) ఘోరాంశ (అశుభం), 35) యమాంశ (అశుభం), 36) కంటకాంశ (అశుభం), 37) సుధాంశ (శుభం), 38) అమృతాంశ (శుభం), 39) పూర్ణచంద్రాంశ (శుభం), 40) విషదగ్ధాంశ (అశుభం), 41) కులనాసంశ (అశుభం), 42) వంశక్షయాంశ (అశుభం), 43) ఉత్పాతకాంశ (అశుభం), 44) కాలరూపాంశ (అశుభం), 45) సౌమ్యాంశ (శుభం), 46) కోమలాంశ (శుభం), 47) సీతలాంశ (శుభం), 48) దంష్ట్రాకరలాంశ (అశుభం), 49) ఇంద్రముఖాంశ (శుభం), 50) ప్రవీణాంశ (శుభం), 51) కాలాగ్నింశ (అశుభం), 52) దండాయుధాంశ (అశుభం), 53) నిర్మాలాంశ (శుభం), 54) సౌమ్యాంశ (శుభం), 55) క్రూరాంశ (అశుభం), 56) అతిశీతలాంశ (శుభం), 57) అమృతాంశ (శుభం), 58) ప్రయోదాంశ (శుభం), 59) బ్రమణాంశ (అశుభం), 60) ఇందురేఖాంశ (శుభం).  


బేసి రాశులకు వరుసగా వచ్చును. సరి రాశులకు వ్యతిరేకముగా అనగా ఇందురేఖ, బ్రహ్మాణాంశ లు వరుసగా వచ్చును.           


ఉదాహరణ జాతకచక్రంలోని గ్రహ స్ఫుటాల ఆధారంగా షష్ట్యంశ వర్గచక్ర నిర్మాణం


రాశిచక్రంలో కన్యా లగ్నం స్ఫుటం -25°-14' నిమిషాలను 2 చేత గుణించగా 50°-28' లను నిమిషాలను వదలి 50° లను 12 చేత భాగించగా శేషం 2 వచ్చిన దానికి 1 కలుపగా 3 వచ్చును. రాశి చక్రంలోని కన్యా లగ్నానికి మూడవ స్ధానం వృశ్చికం కావున  షష్ట్యంశ వర్గచక్ర లగ్నం వృశ్చిక లగ్నం అవుతుంది.


రాశి చక్రంలోని కన్యా లగ్నంలోని రవిగ్రహ స్ఫుటం 18°-52' నిమిషాలను 2 చేత గుణించగా 37°-04' లను నిమిషాలను వదలి 37° లను 12 చేత భాగించగా శేషం 1 వచ్చిన దానికి 1 కలుపగా 2 వచ్చును. రాశి చక్రంలోని కన్యా లగ్నానికి రెండవ స్ధానం తులారాశి కావున షష్ట్యంశ వర్గచక్రంలో రవి తులారాశిలో ఉంటాడు.


రాశి చక్రంలోని వృశ్చిక రాశి లోని చంద్ర గ్రహ స్ఫుటం 05°-14' నిమిషాలను 2 చేత గు


ణించగా 10°-28' లను నిమిషాలను వదలి 10° లను 12 చేత భాగించలేము కనుక  10° లకు 1 కలుపగా 11 వచ్చును. రాశి చక్రంలోని వృశ్చిక రాశికి 11 స్ధానం కన్యా రాశి కావున షష్ట్యంశ వర్గచక్రంలో చంద్రుడు కన్యారాశిలో ఉంటాడు.


రాశిచక్రంలోని తులారాశిలోని కుజ గ్రహ స్ఫుటం 17°-26' నిమిషాలను 2 చేత గుణించగా 34°-52' లను నిమిషాలను వదలి 34° లను 12 చేత భాగించగా శేషం 10 వచ్చిన దానికి 1 కలుపగా 11 వచ్చును. రాశి చక్రంలోని తులారాశికి 11 స్ధానం సింహారాశి కావున షష్ట్యంశ వర్గచక్రంలో కుజుడు సింహారాశిలో ఉంటాడు.


ఈ విధంగా రాశి చక్రంలోని గ్రహా స్ఫుటాలను ఆదారంగా చేసుకొని షష్ట్యంశ వర్గచక్రం నిర్మాణం ఎవరికి వారే వారి జాతక చక్రాలను తయారు చేసుకోవచ్చును.


దుష్కర్మ ఫలితం!

దుష్కర్మ ఫలితం!


మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ-ఎలా తుడుచుపెట్టుకు పోతాయో ఒకసారి పరిశీలిద్దాం…


ఈరోజు చాలామందిమి, పూజలు చేసాము, వ్రతాలు నోచాము, దానాలు చేసాము, ధర్మాలు ఆచరించాము, అని విర్ర వీగుతుంటాము, కానీ అవి ఎంతవరకు మనలను - భగ్వద్ సన్నిధికి చేర్చుతాయని ఆలోచించము కదూ. 

అలాంటి ఒక సంఘటన మహాభారతం లో చోటు చేసుకుంది. అదేమిటో ఒకసారి పరిశీలిద్దామా?


కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు.  


తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు.


కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్లి బోరున విల పిస్తాడు. చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న అతన్ని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు.


ధృతరాష్ట్రుడి దుఃఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు.


“అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండి పోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకు వందమంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు?” అని నిలదీస్తాడు.


అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధాన మిస్తాడు…


“ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదు,  నేను జరగనిచ్చిందీ కాదు, ఇది ఇలా జరగడానికి, నీకు పుత్ర శోకం కలగడానికీ అన్నిటికీ కారణం నువ్వూ, నీ కర్మ.   యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి(వేటగాడు)


ఒకరోజు వేటకు వెళ్లి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో, ఒక అశోకవృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూటిలో గుడ్లతో నివసిస్తున్నాయి, వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బతుకగా, అప్పటికే సహనం నశించిన వాడివై కోపంతో ఆ గూటిలో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు.


తమ కంటి ముందే తమ నూరుగురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండి పోయాయి. 

ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను 

ఆ పాపం నుంచి విముక్తుడిని చేసి కర్మబంధం నుంచి విడిపించింది.”

“నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా, 

నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింప జేస్తుంది, కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు!” అని అంటాడు.


ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్లీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు...


“కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు.?” అని ప్రశ్నిస్తాడు.


అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ..  “ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి... ఎన్నో సత్కర్మలు ఆచరించాలి, ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావాల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు, వందలాది మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాకే  

నీ కర్మ తన పనిచేయడం మొదలుపెట్టింది!” అని సెలవిస్తాడు.


అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా కుప్పకూలి పోతాడు.


మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ ఏ జన్మలో ఎలా తుడిచిపెట్టుకు పోతాయో ఎవరికీ తెలియదు, అందుకోసం చేసుకున్న పుణ్యాన్ని చూసి మురిసి పోవడం వద్దు, అహంకార మమ కారాలకు దూరంగా ఉండి, ‘అంతా భగవదేచ్ఛ’ అని ఆయనకే అర్పితం చేయడం నేర్చుకోవాలి. అప్పుడే ఈ మానవ జీవితంలో సుఖశాంతులు మిగులుతాయి.

  

భూమిమీద పడినప్పటినుండి భూమిలో కలిసేంత వరకు అనుక్షణం జాగ్రత్తలో ఉండాలి. 

ఏ ఆధ్యాత్మిక కధ విన్నా, గజేంద్ర మోక్షము కాని, ఏ కధైనా మనకర్మ ఫలమే. నవ్వులో గానీ, మాటలాడుటలో గానీ, అతి జాగ్రత్తవహించాలి. గతాన్ని ఏమీ చేయలేకపోయినా ఇప్పటినుండి జాగ్రత్తగా వ్యవహరించాలి!”✍

          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


ఆరూడ లగ్నం - సమగ్ర పరిశీలన

ఆరూడ చక్రం అంటే రూడి చేసి చెప్పేది. లగ్న, ద్వితీయ, చతుర్ధ, పంచమ, సప్తమ, నవమ, దశమ, ద్వాదశ భావాలనే ఆరూఢాలు అంటారు. ఆరూడములు ఎనిమిది. 3,6,8,11 భావములకు ఆరూడములు లేవు. ఇవి వరుసగా లగ్నరూఢం, ధనరూఢం, వాహన రూఢం, మంత్రరూఢం, దారారూఢం, భాగ్యరూఢం, రాజ్యరూఢం, ఉపపదం.ఇలా అన్ని భావాలకు కూడా చూడవచ్చును.


జాతకచక్రంలో లగ్నం నుండి లగ్నాధిపతి ఎన్ని రాశుల దూరంలో ఉన్నాడో చూసి అన్ని రాశులను లగ్నాధిపతి నుండి లెక్కించగా వచ్చు రాశిలో గ్రహాన్ని ఉంచిన అరూఢలగ్నం అంటారు. ద్వితియాధిపతి ద్వితీయం నుండి ఎన్నవ స్ధానంలో ఉన్నాడో ఆ రాశి నుండి అన్నవ ఇంట్లో ధన రూఢం అవుతుంది. అలాగే చతుర్ధ, పంచమ, సప్తమ, నవమ, దశమ, ద్వాదశ అధిపతులకు ఈ విధంగానే చూసుకోవాలి.


లగ్నరూడం లగ్నం నుండి, ధనరూఢం ధన స్ధానం నుండి, వాహన రూఢం చతుర్ధ స్ధానం నుండి, మంత్ర రూఢం పంచమ స్ధానం నుండి, దారారూఢం సప్తమ స్ధానం నుండి, భాగ్యరూఢం నవమ స్ధానం నుండి, రాజ్య రూఢం దశమ స్ధానం నుండి, లాభ రూఢం ఏకాదశ స్ధానం నుండి, ఉపపదం ద్వాదశ స్ధానం నుండి లెక్కించుచూ చూచుకోనవలెను.

అరూడ లగ్నం నుండియేకాక ఉపపద లగ్నం నుండి కూడా జాతక పరిశీలన చేయవలెను. 


మతాంతరం:- ఏ భావాధిపతియైన అదే భావంలో గాని, సప్తమంలో గాని రాకూడదు. ఆ విధంగా వస్తే అక్కడ నుండి పదవరాశిలో ఆ గ్రహాన్ని ఉంఛాలి.


అరూడ లగ్నం యొక్క ప్రాముఖ్యత వ్యక్తి యొక్క నిజ స్వరూపాన్ని రూడి చేసి చెబుతుంది. ఇతరుల దృష్టిలో ప్రాముఖ్యత ఎంతవరకు ఉందో తెలుసుకోవచ్చు. ఆరూడం మాయ వంటిది. ఎదుటి వ్యక్తులు ఏ విధంగా భావిస్తున్నారో తెలుసుకోవచ్చును. ఈ లగ్నం వల్ల మనపై ఇతరులకు గల అభిప్రాయాలను తెలియజేయును.


లగ్నము, చతుర్థము, షష్ఠము, చంద్రుడు, కుజుడు వీటి సహాయముతో మాతృ వైరము లేదా మాతృ సౌఖ్యం చెప్పాలి. ఆరూఢంలో మాత్రారూఢమునకు వాహనారూఢము అని కూడా పేరు. అలాగే లగ్నాత్ నవమ స్థానం పితృస్థానం, లగ్నాత్ తృతీయం భ్రాతృస్థానం. వీటి ఆరూఢములు ఎక్కడ వున్నవో గుర్తించాలి.


“పితృమాతృ భ్రాతృ జాయాస్వామ్యా రూఢాని చాత్మనః కేంద్ర కోణంతధైవ స్యామ్మెత్రీ తేషాం భవేద్ధృవమ్ - పూర్వోక్త బంధ్వా రూఢస్య కేంద్రం కోణం భవేద్యది - స్వారూఢస్యాష్టమం షష్ఠం ద్వాదశం వైర ముచ్యతే.”


ఆరూఢ లగ్నాత్ కేంద్రములు (1,4,7,10) కోణములు (1,5,9) స్థానములు పితృ, మాతృ, భ్రాతృ, కళత్రము సంబంధ ఆరూఢములు అయినచో మైత్రి ఉంటుంది. ఒకవేళ షష్ఠాష్ట వ్యయము అయినచో తల్లికి వైరము వుండును.

ఉదాహరణకు లగ్నరూఢము మేషము అయిందనుకోండి. మేషము, కర్కాటకము, సింహము, తుల, ధనస్సు, మకరం రాశులు వాహన రూఢం (మాత్రారూఢం) అయినచో తల్లితో మైత్రి ఉంటుంది. ఒకవేళ మాత్రారూఢము కన్య, వృశ్చికము, మీనములలో ఏదైనా అయిన ఎడల మాతృమూర్తితో వైరం ఉంటుంది. ఇలాగే పితృ,  భ్రాతృ,  కళత్ర విషయములు ఊహింపదగినది. మరియు ఆరూఢ లగ్నము కేంద్ర స్థానములు, కోణ స్థానములు అలాగే షష్ఠాష్ట రిప్ఫ స్థానములు ఎలాగ చూశామో రాశి, లగ్నము నుండి కూడా శోధన చేయాలి. ఈ రెంటి యొక్క వివరముల ఆధారంగా స్నేహమా, వైరమా అనేవి స్థాయి నిర్ధారణ చేయవలెను. పితృ విషయంగా నవమ స్థానము రవి, భాతృ విషయంగా కుజుడు తృతీయ స్థానము. కళత్ర విషయంగా ఏడవ స్థానము శుక్రుడు. వీరికి షష్ఠ అష్ఠ, వ్యయ (రిప్ఫ) అధిపతుల సంబంధం దృష్ట్యా మైత్రి లేదా వైరము అనేవి నిర్ధారించవలెను.


“ఆరూఢ తత్పంచమయోః గ్రంథకృద్గురు చంద్రయోః - తమోశ్శుక్షేణ సంబాధే గ్రంథకృత్కించిదే వహి బుధ సంబంధ స్తత్ర గ్రంథ కృద్విరళం భవేత్”.


 ఆరూఢ లగ్నమునందు ఆరూఢ లగ్నాత్ పంచమమందు గురుచంద్రులు వున్న యెడల గ్రంథకర్త అగును. ఆరూఢ లగ్నం పాపగ్రహ సంయుతం కాకుంటే ఇంకా మంచిది. శుక్రుడు కూడిన యెడల కొంచెం తక్కువగాను, బుధుడు కూడిన ఎడల విరళముగా గ్రంథరచన జరుగును.


“ఆరూఢ తత్పంచమయోః కవిశ్శుక్రే స్థితేయది - నాటకాలంకృతి ప్రాజ్ఞో వాచాలః కావ్యభవేత్.” గురుణాతత్ర సంబంధే సర్వజ్ఞో గ్రాంథికో భవేత్ వైయాకరణ వేదాంతవేత్తా వా చాలకో భవేత్”.


ఆరూఢ లగ్నమందును, తత్పంచమమందును శుక్రుడు ఉన్న యెడల కవియు, నాటకాలంకార శాస్తవ్రేత్తయు కావ్యవేత్తయు అగును. - అదే రీతిగా ఆరూఢ లగ్నము తత్పంచమముల యందు గురువు వున్న యెడల సర్వజ్ఞుడును గ్రాంథికుడును అగును. ‘సర్వజ్ఞుడు’ అనే పదం పురాణములు అన్నియు తెలిసిన వాడి విషయములో ఉపయోగిస్తుంటారు.


“బలవత్పాప సంబంధో భవేత్పాప ఫలప్రదః”. బలవంతులైన శుభులతోడి సంబంధం ఉన్న గ్రహములు శుభఫలమును ఇచ్చును. బలవంతులగు పాపులతోడి సంబంధం పాప ఫలితములను ఇచ్చును. బలవంతులు అంటే ‘బలవాన్ షడ్బలయుక్తస్సన్’. షడ్బలయుక్తులయిన గ్రహములు బలవంతులైన గ్రహములు. స్థానబలము, చేష్టాబలము, కాలబలము, దిగ్బలము, దృగ్బలము, నైసర్గికబలములను షడ్బలములు అంటారు.


శుభగ్రహములు, పాపగ్రహములు అనే వర్గీకరణ విషయం ప్రస్తావిస్తే ఆధిపత్యము ప్రధానం. స్వాభావికంగా గురు, శుక్రులు పూర్ణశుభులు. బుధుడు శుభగ్రహమే. కానీ, ‘బుధః పాపయుతః పాపః క్షీణచంద్రసె్తై్ధవచ’ అవడంచేత, అంటే పాపగ్రహములతో కలసిన బుధుడు మాత్రమే పాపగ్రహము. అలాగే పూర్ణచంద్రుడు శుభగ్రహము. క్షీణచంద్రుడు పాపగ్రహము. ‘క్షీణచంద్రుడు’ అనే విషయంలో అనేక పాఠాంతరములు ఉన్ననూ బహుళ ఏకాదశి లగాయతు బహుళ విదియ వరకు క్షీణచంద్రుడుగా వాడకం ఉన్నది. రవి, కుజ, శని, రాహు, కేతువులు పాపగ్రహములు.


లగ్నాత్ 1,5,9 స్థానాధిపతులు ఎవరైననూ శుభగ్రహములే. 4,7,10 స్థానాధిపత్యము వచ్చిన పాపగ్రహములు శుభఫలితములు ఇచ్చును. 4,7,10 స్థానాధిపత్యము వచ్చిన శుభగ్రహములు పాపాధిపత్యము ఇచ్చును. ‘త్రిషడాయ పఅత్వం స్యాదశుభత్వప్రయోజకం, రంధ్రవ్యయే శతాచ స్యాదశుభత్వ ప్రయోజకా’ అని ఉన్నది. 3,6,8,11,12 ఆధిపత్యములు లగ్నాత్‌గా వచ్చిన గ్రహములు చెడు ఫలితములే ఇచ్చును.


‘శుభానాం కేంద్రవాసిత్వ శుభదానస్య సాధనం పాపానాం కేంద్రవాసిత్వమసిమశుభస్మహి సాధనం’. కేంద్రములయందు ఉన్న శుభగ్రహములు శుభఫలితమలను, పాపగ్రహములు, పాప ఫలితములను ఇచ్చును. కేంద్రములు అంటే లగ్నాత్ 1,4, 7, 10 స్థానములు, కోణములు అంటే లగ్నాత్ 1, 5 9 స్థానములు, లగ్నాత్ 2, 5, 8 పణఫరములు, లగ్నాత్ 3, 6, 9, 12 స్థానములు అపోక్లీబములు. లగ్నాత్ 3, 6, 10, 11 స్థానములు ఉపచయస్థానములు అంటారు.


‘స్వమిత్రోచ్ఛక్షేత్ర గత స్తాదృక్సంబంధాన్ బలీ, నీచారిక్షేత్రగస్తాదృక్సంబంధస్తగతోబలః’ స్వక్షేత్రము, మిత్రక్షేత్రము, ఉచ్ఛక్షేత్రమును పొందినవాడు అట్టివారితో సంబంధకలవాడు బలవంతుడు అగును. నీచక్షేత్రమును, శతృక్షేత్రమును పొందినవాడును, అట్టివారితో సంబంధగల గ్రహము అస్తంగత్వము పొందిన గ్రహము దుర్బలుడగును.


 ‘ఆరూఢ లాభే శుక్రేణ దృష్టే రాజా భవేన్నరః తస్మించ్ఛ్భుయుతే సంపద్దారిద్య్రం పాపసంయుతే’. ఆరూఢ లగ్నమునకు లాభస్థానమును శుక్రుడు చూచినేని జాతకుడు భూపతియగును. ఆ లాభస్థానమునందు శుభగ్రహము ఉండెనేని సంపదయు, పాపగ్రహము ఉండెనేని దరిద్రము కలుగును. ‘బలహీనోదేహానాథో యదిస్స్యా ద్వ్యాధిమాన్నరః సకేంద్రకోణగస్స్యాచ్ఛేన్నహ్యధీమాంస్తు కోపవాన్’. తను స్థానాధిపతి బలహీనుడయిన జాతకుడు వ్యాధిగలవాడు అగును.తను స్థానాధిపతి బలహీనుడై కేంద్ర కోణములయందు ఉండెనేని బుద్ధిమంతుడు కాకపోడుగానీ గోపముగలవాడు అగును.


ఆరూఢ లహ్నమనుకు ఏకాదశ స్థానమందు శుభాశుభ గ్రహసంబంధము కలిగిన జాతకుడు సంపన్నుడు కాగలడు. ఆరూఢ లగ్నమునకు ఏకాదశమునందు శుభగ్రహములు ఉన్నఎడల న్యాయమార్గంవలననూ, పాపగ్రహములు ఉన్న ఎడల అన్యాయమార్గము వలననూ లాభము కలుగును. ఆరూఢ లగ్నమునకు ఏకాదశమందు  స్వాచ్ఛమిత్ర గ్రహములు ఉన్నచో వాని దశలయందు విశేషముగా ఐశ్వర్య ప్రాప్తికలుగును.


ఆరూఢ లగ్నమునకు ఏకాదశ స్థానముతో ఉన్న గ్రహమునకు ఆస్ధానము నీచస్థానము అయినచో ఆ స్థానంలో ఉన్న గ్రహ దశలయందు ఆదాయ వ్యయములు సమానముగా ఉండును. ఆరూఢ లగ్నమునకు ఏకాదశ స్థానమునందు రవి, శుక్ర, రాహువు ఉన్న ఎడల రాజువల్ల ఐశ్వర్యప్రాప్తి కలుగును. ఏకాదశము ఆరూఢ లగ్నమునకు రవి, శుక్ర, రాహువులు ఉండి చంద్రుడు చూచినేని విశేషముగా ఐశ్వర్యము కలుగును.


‘లగ్నాచ్చ ద్విర్ద్వా శయోర్గ్రహ సామ్యేతు బంధనమ్’ అని చెప్పారు. లగ్నానికి ద్వితీయ ద్వాదశ స్థానముల యందు పాపగ్రహములు సమానముగా వుండెనేని జాతకునకు ఆయా గ్రహ దశ అంతర్దశులలో బంధనం కలుగును. ఇక్కడ జ్యోతిశ్శాస్త్ర శోధనలో జన్మలగ్న, ఆరూఢ లగ్నం, కారక లగ్నముల శోధన ఏది అయినా “ర్ఫిఃష్టారి గతస్య రాశిర స్తద్దేశయు గ్దృష్ట్భం భ్రష్టంస్యాత్” అనే సూత్రం ప్రధాన భూమిక అవుతోంది. అయితే ఈ 6,8,12 స్థానాధిపతులు ఒకరి ఇంట ఒకరు వారికి పరివర్తన మాత్రం రాజయోగమే చెబుతోంది.


ఏ చక్రాలలో అయినా “నీచస్థాన గతాశ్చ పరాజితాస్త్వరి గతా పాపేక్షితా క్రాంత యుఙ్మధ్వస్థాన గతాశ్చవక్ర వికల స్వర్భాను సంసర్గకాః భావంత స్థితిభే చరాః షష్ఠాష్టరిఫాధిపాః” అనే నియమం ప్రకారం మనం ఏ భావం శోధన చేయుచున్నామో ఆ భావం యొక్క అధిపతి నీచలో వున్ననూ, కుజుడితో కలిసి పరాజితుడు అయిననూ అనగా కుజుడుకు వెనకగా వుండటం, శత్రు క్షేత్రంలో వుండడం, పాపగ్రహముల వీక్షణ, యతి (కలయిక), వారిచేత ఆక్రమింపబడటం, వక్రము, వికలావస్థ, అస్తమయం పొందడం, భావం యొక్క అంత్యంలో వుండడం, 6,8,12 అధిపతులతో కలయిక ఆ స్థానములలో వుండడం అనేవి ఏ భావమునకు అయినా మంచిది కాదు. ఇది ప్రతి భావం విషయంలోను శోధించాలి.


మంచి యోగము అయినా చెడు యోగము అయినా సరే దానిని ఇస్తున్న గ్రహము బలవంతమయిన గ్రహం అయితే యోగం పని చేస్తుంది. మంచి యోగం ఇచ్చే గ్రహం బలవంతమయిన గ్రహం అయితే మంచి ఫలితాలు అధికం. చెడు ఇచ్చే గ్రహము బలమయితే అధిక చెడు కలుగజేయును. మంచి చేయు గ్రహం స్థానబలం లేనిది అయితే మంచి పెద్దగా జరగదు. చెడు చేయవలసిన గ్రహం బలహీనం అయితే చెడు పెద్దగా జరగదు. “లగ్నాదారూఢ లగ్నాద్వాకోణ యోరి పురంధ్రయో తృతీయైకాద శయోరావ గ్రహసామ్యేపి బంధనం”.  జన్మలగ్నం ఆరూఢ లగ్నమునమే గానీ పంచమ నవయములు/ షష్ఠాష్టములు/ తృతీమైకా దశములలో వీటిలో ఎందయినా సమస్థాయి పాపగ్రహములు వున్న యెడల ఆ గ్రహ దశాంతర్దశలతో కారాగార యోగం కలుగును.


సమం చతుర్థే దశమే స స్థితి స్తదపేక్షయా - శుభ పాప గ్రహాణాం చేద్బంధనం నాత్ర సంశయః - లగ్నము, ఆరూఢములకు చతుర్థ దశమముల యందు శుభ పాప గ్రహముల సామ్యము ఉన్న యెడల బంధనము కలుగును. ఇది కారాగార యోగముగాను లేదా ప్రైవేట్‌గా అనగా కిడ్నాప్ వంటివిగా కూడా చెప్పవచ్చు. అధికారులు నిర్బంధించారు, ప్రజలు నిర్బంధించారు అని చెబుతుంటారు కదా! అటువంటి ఫలితాంశాలను ఇక్కడ వర్తింపజేయవచ్చును.


సామ్యము అనే పదంలో ‘సంఖ్య’ అని తీసుకోవచ్చు లేదా బలము అని కూడా తీసుకోవచ్చు. ‘తేషు చేచ్ఛ్భు సంబంధో భటై దావవరణం ప్రభోః పాపాన్వయే శృంఖలాది పీడా ప్రహరణాదికమ్’ అలా చెప్పబడిన స్థానములకు శుభ గ్రహ వీక్షణ సంబంధం కలిగిన యెడల రాజభటులచే పట్టుబడుటయు పాపగ్రహ సంబంధం కలిగిన యెడల శృంఖలాబంధనం రాజదండనం చెప్పాలి. మరి పాపగ్రహ సామ్యము శుభగ్రహ వీక్షణాది సంబంధం అయితే ఎవరైనా అధికారులు పట్టుకోవడం, వెహికల్‌కి ఫైన్ వేయడం వంటివి స్థానబలం యొక్క స్థాయిని బట్టి నిర్ధారించాలి. యోగం అవయోగం ఏదైనా స్థాయిని అనుసరించి ఫలితం చెప్పాలి. స్థానబలం ఎక్కువ అయితే ఎక్కువ యోగం లేదా శిక్ష తక్కువ అయితే తక్కువ యోగం తక్కువ శిక్ష చెప్పాలి.


“రాశేః కోణవర్తీ రాహుశే్చ త్సూర్య వీక్షితః నేత్రరోగీ భవేన్నూనం వోచేత్తత్ర శుభాన్వయః” శుక్రుడు వున్న రాశికి కోణములలో రాహువు వుండి ఆ రాహువుకు రవి వీక్షణ వున్న యెడల శుభగ్రహ సంబంధం రాహువు లేని యెడల నేత్ర రోగి కాగలడు. జైమిని పరాశరులు, కేవలం సప్తమ స్థాన దృష్టి ఒకటే కాకుండా ఇంకా ఇతర దృష్టి విషయాలు తెలియజేశారు. అందులో భాగంగా రవి శుక్రుడికి దగ్గర్లో వున్నప్పటికీ  శుక్రుడికి కోణంలో వున్న రాహువును చూస్తారు.


“ఆరూఢ లగ్నే లగ్నేవా చంద్ర శుక్రాయదిస్థితౌ చతురంగ బలాదీని రాజ చిహ్నాని సంతిహి” లగ్నమునందు లేదా ఆరూఢ లగ్నము నందు చంద్ర శుక్రులు వున్న ఎడల ఆ జాతకుడు చతురంగ బలము మొదలయిన రాజ చిహ్నములతో భోగ జాతకుడు కాగలడు.


 ‘ఉపపదము’ అని ఆరూఢ చక్రములో రాసి ఉంటుంది. ఆ ఉపపదంలో పాపి వున్న యెడల లేదా ఉపపద స్థానమునకు పాప సంబంధము కలిగిన ఎడల జాతకునకు సన్యాసము లేదా కళత్ర వియోగం చెప్పబడినది. మరి ఉపపదంలో వున్న రవి మాత్రం పాపగ్రహ కాదుట. “రవిః పాపోనోపపదే నోక్త దోష శ్శుభాన్వయే - స్యాతాం తౌచ కళత్రేశ నీచత్వాది స్వభావశ” ఉపపదమునకు శుభగ్రహ సంబంధము కలిగినేని వెనుక చెప్పిన సన్యాసముగానీ, కళత్ర వియోగము గానీ కలుగదు. ఒకవేళ కళత్రాధిపతికి నీచత్వాది దోషములు కలిగినప్పుడు కలుగును.


“ఉపపదే ద్వితీయేవా గ్రహస్స్యక్షేత్రగోయది. లగ్నాత్సప్తసు పాపస్స్యా త్స్వక్షేత్రో యది వర్తతే - ఉత్తరాయుషి నిర్దారో భవేన్నో చేచ్ఛ్భున్వయః.” ఉపపదమునకు గానీ దాని ద్వితీయమునకు గానీ అందులో స్వక్షేత్ర గ్రహం వున్ననూ లగ్నము ఆరూఢ లగ్నము కారక లగ్నాదులకు సప్తమంలో స్వక్షేత్ర గ్రహముగా ఏదేని పాపగ్రహం వున్న యెడల ఉత్తర వయస్సులో కళత్ర విహీనం కలుగును. ఉదాహరణకు ఉపపదం మకరం అయినది. మకరంలో లేదా కుంభంలో శని వున్నారు అనుకోండి. శని స్వక్షేత్రంలో వున్నారు కావున దోషం చెప్పబడుతున్నది. ఇదే రీతిగా జన్మలగ్నానికి సప్తమంలో పాపగ్రహం వుంటే ఆ పాప గ్రహమునకు ఆ స్థానం స్వక్షేత్రం అయితే అనే అంశంలో చాలా మతాంతర పాఠాలు వున్నాయి. కళత్రాధిపతి కళత్ర స్థానంలో స్వక్షేత్రంలో వుంటే దోషం లేదు అనేవారున్నారు గానీ ఫలితాలు మాత్రం పై విషయాన్ని సూచిస్తున్నాయి.


ఎటువంటి కళత్రం వచ్చే అవకాశం ఉన్నది అనే అంశం ప్రస్తావిస్తే – “కళత్రేశే చోపపదాదుచ్చస్థే స్వకులోత్తమాత్, దార లాభో భవేన్నీచే స్స్యాచ్చ నీచకులాద్భవేత్”. ఉపపదమునకు సప్తమాధిపతి ఉచ్ఛయందున్నచో తన వంశము కంటే ఉత్తమ వంశము నుండియు నీచయందున్న యెడల తన వంశము కంటే తక్కువ వంశము నుండియు దార లాభము కలుగును.


“సుందరీ శుభ సంబందాద్భార్యాస్సాదస్య ధాన్యధా - అపవాదాద్దారనాశ శ్శని రాహ్వన్యయే భవేత్” ఉపపద సప్తమమునకు కానీ తదధిపతికి గానీ శుభ గ్రహ సంబంధం కలిగినేని భార్య రూపవతి యగును. అట్టి సంబంధం లేని యెడల కురూపి అగును. స్త్రీజాతక శోధన చేయునప్పుడు భర్త అని చెప్పాలి. ఉపపద సప్తమమునకు తదధిపతికి శని రాహు సంబంధం కలిగినేని అపవాదుల వలన భార్యాభర్తలు విడిపోగలరు. నేడు కోర్టు గొడవల జాతకాలు శోధిస్తే ఈ అంశం ఎక్కువగా గోచరిస్తోంది. ఇదే విషయం జాతకం రాశి చక్రం ద్వారా శోధించదలచిన యెడల “వంధ్యాపతి స్సితరవీ మదనోదయస్థౌ చంద్రోదయే సమగృహే లలనా కృతిస్స్యాత్ పుంరాశిగే పురుష భావయుత కళత్రం స్ర్తిపుంగ్రహే క్షితయుతే సతి మిశ్రరూపం”. శుక్ర సూర్యులు లగ్నంలో కానీ సప్తమంలో కానీ వుండిరేని భార్య గొడ్రాలు అగును అనగా సంతానవతి కానేరదు. రవి శుక్రుల కలయిక అస్తంగత్వ దోషం ఇస్తుంది కదా! మరి వారు అలాంటి దోషం కలవారై లగ్నంలో వుంటే కళత్ర స్థానమును చూస్తారు. కళత్రంలో వుంటే ఇక చెప్పనవసరం లేదు కదా. అందుకే ఈ ఫలితం చెప్పారు. ఇక చంద్రోదయము సమరాశులలో అయితే కళత్రము లలనాకృతి అగును అని చెప్పుచూ పురుష రాశిని పొందినేని కళత్రము పురుష భావం కలిగి వుండును అన్నారు. స్త్రీపుంగ్రహములతో కూడికొని యుండినేని కళత్రము మిశ్రరూపము కలదై యుండును. ఈ సూత్రం పురుష జాతకం వరకే కాక స్త్రీజాతకములకు కూడా అమలుచేయవలెను.


మరొక ముఖ్య శోధన “భౌమాంశేవా భౌమరాశౌమి లగ్నాత్. కామస్థానే జన్మభేవా వధూనామ్‌॥ జాయదాసీ నీచమూఢ గ్రహాంశే దుష్టావా స్యాద్యౌవనే భర్తృహీనాః” పురుషుల జాతకంలో సప్తమ స్థానం స్త్రీల జాతకంలో లగ్నం ద్వారా శోధించవలసిన అంశము ఇది. పురుషుల సప్తమ స్థానము లేదా స్త్రీలకు లగ్నము అంగారక రాశిగానీ అంశ గానీ అయిన యెడల భార్య దాసీయై ఉండును. అలాగే సప్తమము అయినను, లగ్నము అయినను నీచ మూఢ గ్రహాంశలు కలది అయిన యెడల కళత్రము యుక్త వయసులో వుండగా దుష్ట స్వభావము కలది అయి ఉండును. లేదా భర్తృహనురాలు అయి ఉండును. ఇది పురుష జాతకమునకు కూడా అమలు చేయవచ్చును.


“శుభాంశ రాశౌయది సద్గుణాఢ్యా శుభౌక్షితే చారుతరం కళత్రం - చంద్రాంశకే దుర్బల చంద్రరాశౌ జాతాపతిఘ్నీ సబలేతు సాధ్వీ” సప్తమము గానీ లగ్నము గానీ శుభాంశ రాశి అయ్యెనేని భార్య సద్గుణవతి అగును. సప్తమ స్థానము శుభ గ్రహములచే చూడబడెనేని మిగుల సుందరి అయిన భార్య రాగలదు. ఈ నియమం భర్త రాగలడు అని చెప్పవచ్చు. సప్తమ స్థానము చంద్రరాశి అయి వుండగా చంద్రరాశి దుర్బలమయి ఉండెనేని పతిని హింసించునట్టి, భార్య కలుగును. అదే చంద్రరాశి బలము కలది అయిన యెడల భార్య పతివ్రత అగును. లగ్నాధిపతి సప్తమ స్థానమున ఉండి శుభ గ్రహములతో కూడుకొని ఉన్న యెడల సత్కులమునందు పుట్టిన భార్య రాగలదు. లగ్నాధిపతి దుష్ట క్షేత్ర ఆధిపత్యంతో వున్న సప్తమంలో వున్ననూ లేదా దుష్ట గ్రహములతో కలసి సప్తమంలో వున్ననూ దుష్టకులము నందు పుట్టిన భార్య రాగలదు.


“కామస్థేతనుపే శుభగ్రహయుతే సద్వంశ జామృచ్ఛతి క్రూరర్షే మదగ్నే మిగ్నే రమణే దుర్వంశ జాతాంగనామ్‌” భార్య యొక్క లక్షణములు అని చెప్పబడిన ఫలితాంశములు భర్త యొక్క లక్షణములు అని కూడా మార్పుచేసి చెప్పవచ్చు. దారాపదము మిథున కన్యలలో ఏదో ఒకటి అయి శని కుజుల వీక్షణ కలిగిన యెడల ముక్కు, శ్వాస రంధ్రములు, ఊపిరితిత్తులు, వాటికి సంబంధించిన అనారోగ్యములు కలిగిన భార్య కలుగును. ఇదే దారారూఢము మేషము లేదా వృశ్చికములలో ఒకటి అయి గురువు లేదా శనితో వీక్షణ కలిగిన యెడల చెవులకు సంబంధించిన రోగము కలిగిన కళత్రం. దారా రూఢంలో గురు రాహువులు వున్న యెడల చెవుడు, దంత రోగములు ఉండు కళత్రము కలుగును. ఉప పదం కన్య లేదా తుల అయిన అచట శని రాహువులు వున్న యెడల కళత్రమునకు కుంటితనము లేదా వాత రోగము ఉండును. ఈ పై యోగములలో ఏ యోగము కలిగిననూ వారికి శుభ గ్రహ దృష్టి కలిగిన యెడల ఈ యోగములు ఉండవు.


ఉప పదములో శని బుధ శుక్రులు వున్న యెడల జాతకునకు సంతాన యోగం ఉండదు. “లగ్నాదుప పదా దంశా త్కారకాచ్చాపి పంచమః పుత్రభావ ఇతిజ్ఞేయః సూత్రకారాది సమ్మతః” లగ్నము అంశ లగ్నము కారకులు వున్న రాశి తత్పంచమ స్థానములు పుత్ర భావము అని పేరు. అందు గురు రవి రాహువులు వున్న యెడల బహుపుత్రవంతులు అగుదురు. చంద్రుడు వున్న యెడల ఏకపుత్రుడు కలుగును.


 ‘బుధారాభ్యాం దత్తపుత్రః’ కుజ బుధులు గానీ; కుజ శనులుగానీ పైన చెప్పిన పుత్ర స్థానములో వున్న యెడల జాతకుడు దత్తపుత్రుడు కలవాడు అగును. ‘శనిమాత్రే మృతప్రజః’ కేవలం శని ఒకటే వున్న యెడల మృత సంతతి గలవాడు అగును. ‘ఓజేస్మిన్ బహుపుత్ర స్వాత్’ పైన చెప్పిన పంచమ స్థానములు ఓజరాశులు అయిన యెడల జాతకుడు బహు పుత్రకుడు అగును. ఓజరాశులు అంటే మేష, మిథున, సింహ, తుల, ధనుః, కుంభరాశులు. యుగ్మరాశులు అనగా వృషభ, కర్కాటక, కన్య, వృశ్చిక, మకర, మీనములు. ‘యుగ్మేస్మిన్ అల్పపుత్రకః’ పైన చెప్పిన పంచమము యుగ్మరాశులు అయిన యెడల స్వల్ప సంతతి కలుగును.


‘తృతీయే మందరాహుభ్యాం పదాదేకాదశే తథా’ - భ్రాత్రోర్నాశః క్రమే ఇస్స్యాత్కనిష్ఠ జ్యేష్ఠయోరపి’ తృతీయము నందు కానీ ఆరూఢ ఏకాదశమము నందు గానీ శని రాహువులు వున్నచో క్రమముగా కనిష్ఠ జ్యేష్ఠ సోదరుల నాశనము కలుగును. భ్రాతృస్థానము నందు కుజ చంద్ర గురు బుధులు వున్నచో చాలామంది సోదరులు కలుగుదురు. భాతృస్థానము నందు శని యున్ననూ చూచిననూ తన తల్లికి కలిగిన సంతతిలో తానొక్కడే మిగులును.


ఉపపదంలో రవి గాని కుజుడు గాని ఉంటే అప్పులు ఇస్తే రావు. మళ్ళీ మానవజన్మ ఎత్తి అప్పుడు రాబట్టాలి. చంద్రుడు శుభుడై ఉన్న కళలలో నైపుణ్యం కలిగి ఉంటారు. బుధుడు ఉపపదంలో ఉన్న వ్యాపారంలో పెట్టుబడి పెడతాడు. గురువు ఉన్న దానాలు చేస్తాడు కాబట్టి స్వర్గప్రాప్తి పొందుతాడు. శుక్రుడు కుజ, శని రాశులలో లేకుంటే భోగాలు అనుభవిస్తాడు. నిరంతర ఆనందం, స్వర్గం లభిస్తుంది. శని ఉంటే పిసినారిగా ఉంటూ చివరికి ఎవరికో ఇస్తాడు. రాహువు ఉన్న దురాశతో ఖర్చు పెడతాడు. కేతువు ఉన్న మోక్షం కలుగుతుంది.


రజస్వల- శుభాశుభ ఫలితాలు

 రజస్వల- శుభాశుభ ఫలితాలు 



స్త్రీ తొలుత పుష్పవతియగు తిధి వారము నక్షత్రము ననుసరించి వారికి వారి సంతతికిని శుభాశుభములు గలుగ గలవు. 


1 అశ్వని 2 రోహిణి 3 మృగశిర 4 పుష్యమి 5 ఉత్తర 6 హస్త 7 చిత్త 8 స్వాతి 9 విశాఖ 10 అనూరాధ 11 మూల 12 ఉత్తరాషాఢ 13 శ్రవణం 14 థనిష్ఠ 15 శతభిషం 16 ఉత్తరాభాద్ర 17 రేవతి'' అను యీ పదునేడు నక్షత్రములయందు పుష్పవతియైనచో శుభకరము. అనగా దంపతులకు సంతతికి శుభములు చేకూరుచుండగలవని భావము.


1. భరణి 2. కృత్తిక 3 ఆర్ద్ర 4 పునర్వసు 5. ఆశ్లేష 6 మఖ 7 పుబ్బ (పూర్వఫల్గుణి) 8 జ్యేష్ఠ 9 పూర్వాషాఢ 10 పూర్వాభాద్ర అను నీ పది నక్షత్రములలో తొలుత సమర్తాడెనేని అశుభకరము.


ఈ రీతిని వారములు సహ శుభాశుభములుగలవు.


సోమ - బుధ - గురు - శుక్ర వారములు శుభకరములు. అది - మంగళ - శనివారములు అశుభకరములు.


పై చెప్పిన దుష్ట నక్షత్రములకు యిచ్చు ఫలములేవనగా మఖ - ఆర్ద్ర నక్షత్రములలో ప్రధమ రజస్వలయైన వనిత దుఃఖము ననుభవించును.


పునర్వసు - జార గుణము కలుగ గలదు, జ్యేష్ట - కృత్తికలు దరిద్రురాలు భరణి పుబ్బ - పూర్వాషాఢ - పూర్వాబాద్ర - ఆశ్రేషలు తొలిపాదమున వైధవ్యము - రెండవపాదమున గొడ్రాలు, మూడవ పాదమున దరిద్రురాలు. నాలుగవ పాదమున శుభములు బొందును. ఈ visdhana


ఆది - మంగళ - శని వారములలో ప్రధమ రజస్వల యైనచో రోగవంతురాలునగును. 


సూర్యోదయాస్తమయ కాలములు, గ్రహణము, అమావాస పౌర్ణమి, బహుళాష్టమి, బహుళచతుర్దశి. మేషాదిసంక్రమణ కాలములు, చవితి షష్టి అష్టమ నవమి ద్వాదశిత్యాజ్వ ఘడియలు, అవమా. త్రిద్యుస్పృక్‌లు, (అవమ-మూడు తిధులుగల వారము) (త్రిద్యుస్పృక్‌ - మూడు వారములతో గూడిన తిధి) పై చెప్పిన దుష్ట నక్షత్రములలో సూర్యుడుండగనూ, ప్రధమావర్తమునకు దోషకరములుగాన యధావిధినీ శాంతి జరుపుకొనుట శ్రేయస్కరము.


ఈ రీతిని ప్రధమరజస్వలమైన తిది వార నక్షత్రములు చూచుకొని దోషములున్న శాంత్యాదులు జరపుకొని, శుభ తిది వార నక్షత్రలగ్నములు గుర్తించి, లగ్న శుద్ధి అష్టమశుద్ధిగల పుంలగ్నమున నిషేకము యధాశాస్త్రీయముగ జరపినచో గల్గు సంతతి, మంచి ఆయుర్దాయము, అదృష్టము అధికారము. కీర్తి ప్రతిష్టలు తేజోకాంతులు గల్గినవారై మంచి ధర్మాత్ములుగను, నుండగలరు.