*గజకేసరి యోగం*:- మనవ జాతకంలో గ్రహ స్థితిని బట్టి ఏర్పడిన యోగములలో ఈ యోగము చాలా మంచి ఫలితములిచ్చును. జాతక చక్రములో గురు, చంద్రుల ఉనికి వలన ఈ యోగము ఏర్పడుతుంది. చంద్రుని నుంచి గురుడు కేంద్రముల యందు ఉన్నప్పుడు అనగా గురుడు 4, 7, 10 స్థానములలో వున్నప్పుడు ఈ యోగబలము 4 కన్నా 7 లోనూ, 7 కన్నా 10 లోను అధికముగా వుంటుంది. ఈ యోగముల వారు సభ్యత, ఉదారము, సంపద, దానగుణము, ఉన్నతాధికారము మొదలగు సకల శుభ లక్షణములు కలిగి ఉందురు. కొందరు గురుడు కోణ మున్దున్నను ఈ యోగముగా భావించ వలెననుచున్నారు. కానీ నా అనుభవమున గురుని స్వస్థాన, ఉచ్చస్థాన, ధనుర్, మీన లగ్నమందు, కర్కాటక, వృషభ లగ్నమందు విశేష బలము కలుగునట్లు గమనించితిని. ఇతర రాశులలో దీని బలము నామ మాత్రమే. జాతకములో గజకేసరి యోగమును దాని బలమును నిర్థారించుటకు విశేష అనుభవము కావలెను. గురు చంద్రుల బలములు, గురుడు చంద్రుని కంటే ఎక్కువ బలము పొందిన ఆ జాతకులు విశేష ధన కీర్తి, సుఖమయ జీవితం జీవితాంతం గడిపినవారున్నారు !
ఈ యోగములలొ ఉన్న సర్వ శుభములు కనుపించుటకు ఆ గ్రహములన్నియు అస్థంగత దొషము లేకుండా ఉండవలెను. ఆ గ్రహములకు షడ్బలము దిగ్మలము కలిగిఉండవలెను. జాతకములలొ పైన చెప్పబడిన గ్రహస్తితి ఉన్ననూ ఈ బలములు లేనియడల ఆ యోగములు అంతగా ఫలితములను ఇచ్చుటలేదు. ఈ గ్రహస్తితినీ ఉనికినీ బలములనూ పరిగణలొనికి తీసుకునుని ఫలితములు చెప్పవలెను.
No comments:
Post a Comment