అతి ప్రాచీనమైన మన భారత దేశము శిల్ప కళలకు వాస్తు వైభవమునకు ప్రఖ్యాతి వహించి వున్నది . ఈ ఉపఖండము నిర్మాణము కూడా ఎన్నో వాస్తు విశేషాలతో అలరారుచున్నది . ఇందు చాలా పట్టణ ,పుర ,నగర ,గ్రామాలు వున్నాయి . ఇలాంటి పురములు ,దివ్య సౌధములు ,సాధారణ గృహములు కలిగి వున్న" వస్తువు " కనుకనే భూమికి వాస్తు అనే పేరు వాచ్చినది . ఈ భుమియన్దోనర్చు అన్ని విషయాలను తెలియ జేయు విజ్ఞాన శాస్త్రమే ఈ " వాస్తు శాస్త్రము ".
అర్వణము :
" దిస కుదిరితే దశ కుదురు " అన్న సమేతలగా .. ! " దిశ " అనగా " తాను నివసించు దిక్కు , స్థలము , గృహము " అని అర్ధము ." దశ "అనగా "జాతక రీత్యా ప్రాప్తించగల అభివృద్ది కరమైన శుభ యోగములు " కనుక ప్రతి వారును తాము నివసించే ఉనికిని , శాస్త్ర సమ్మతముగా రూపొందించు కొనవలసి యున్నది .
నివసించే గృహము సొంతము ఐనా -కా కపోయినా కుడా , కొన్ని అతి ముఖ్యమైన విషయాలను ఉపేక్షింప కూడదు !గృహమేవరిది ఐనను అందలి సౌకర్యములు నివసించు వారనుభవించు నట్లు ... దోషములను కూడా అనుభవించ వలసి వుంటుంది . ఈ ప్రకారము మంచి కూడా అందుగల వారె పొందుచుండేదరు .
"జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ "అని పెద్దలు చెప్పారు . రామాయణ కలం లో కుడా.బంగరు మయమై , నవరత్న సౌధములతో తులతూగుతున్న కాంచన లంకను చూసి మొహపడుతున్న లక్ష్మణుకి ,అన్నగారయన శ్రీ రామ చoద్రుడంతటి అవతార మూర్తి ఈ విధముగా చెప్పారు .
" ఓ లక్ష్మణ ! లంకానగరము యావత్తు - స్వర్ణ మయమే ఐనను ,అనేక రత్న ,వజ్ర ,మణి మయమై నను ,నాకు దానియందు ఇష్టము లేదు . భ్రాంతి కలుగుట లేదు . ఎమందు వేని -ప్రతి వారికీ కూడా "కన్నతల్లి" , "జన్మ భూమి" అను రెండూ కూడా స్వర్గము కన్నా శ్రేష్టములై యున్నవి ! [ రామాయణం ]
ఎవరు జన్మించిన దేశము ,గ్రామము ,ప్రాంతము ,వారికి అత్యంత సౌఖ్య పదమై యుండగలదు . కొన్ని కారణాంతరాల వలన పర గ్రామ మందు నివసించ వలసి వచ్చినా .. ఆ గ్రామము శాస్త్ర రీత్యా తనకు మంచిదా కదా ?? అని పరిశీలించాలి . దీనికే " గ్రామ అర్వణము " గా పెద్దలు చెబుతుంటారు .
అర్వణము చూచే పద్దతులు అనేకము వున్నవి . అన్నీ మంచి పద్దతులే ఐనా .. అనుభవము నందు ఎక్కువగా సరిపోవుచున్న విధానము ను ఉపయోగించుకోనుట . చాలా మంచిది . వాస్తు శాస్త్ర ప్రకారము ఏ పని చేయాలన్నా .. "జన్మ నక్షత్రం " కంటే "నామ నక్షత్రం" శ్రేష్టం ! తన పేరుకు గల మొదటి అక్షరము ప్రకారము నక్షత్ర ,దిశా వర్గ నిర్ణయాలను చేసుకోవాలి .
తెలుగు భాషలో అక్షరాలు మొత్తం 51 వున్నవి . వీటిని 8 భాగాలుగా విభజించి - " అష్టవర్గులు " అని పేరు పెట్టారు .
వీటిలో మొదటి దానికి "అ" వర్గు అని పేరు ! అనగా .. ఈ వర్గం లో " అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఏ ఐ ఓ ఔ అం అః " పదహారు అక్షరాలు ఉండగలవు . వీటిలో ఏ అక్షరము తమ పేరు నకు మొదట వున్నా .. అట్టి వారు "అ వర్గు " నకు చెందిన వారుగా పరిగణింప బడతారు . వీరికి " తూర్పు దిక్కు " స్వదిశ అవుతుంది .
రెండవది " క " వర్గు ! ఈ వర్గు నందు " క ఖ గ ఘ ఙ " అను ఐదు అక్షరములు వుంటాయి . వీటిలో ఏ అక్షరము తమ పేరు నకు మొదట వున్నా .. అట్టి వారు "క వర్గు " నకు చెందిన వారుగా పరిగణింప బడతారు . వీరికి "ఆగ్నేయ దిక్కు " స్వదిశ అవుతుంది .
మూడవది " చ వర్గు " ! ఈ వర్గు నందు " చ ఛ జ ఝ ఞ " అను ఐదు అక్షరములు వుంటాయి . వీటిలో ఏ అక్షరము తమ పేరు నకు మొదట వున్నా .. అట్టి వారు " చ వర్గు " నకు చెందిన వారుగా పరిగణింప బడతారు . వీరికి "దక్షిణ దిక్కు " స్వదిశ అవుతుంది .
నాల్గవది " ట వర్గు " ఈ వర్గు నందు " ట ఠ డ ఢ ణ " అను ఐదు అక్షరములు వుంటాయి . వీటిలో ఏ అక్షరము తమ పేరు నకు మొదట వున్నా .. అట్టి వారు "ట వర్గు " నకు చెందిన వారుగా పరిగణింప బడతారు . వీరికి "నైరుతి దిక్కు " స్వదిశ అవుతుంది .
ఐదవది "త వర్గు " ఈ వర్గు నందు " త థ ద ధ న " అను ఐదు అక్షరములు వుంటాయి . వీటిలో ఏ అక్షరము తమ పేరు నకు మొదట వున్నా .. అట్టి వారు "త వర్గు " నకు చెందిన వారుగా పరిగణింప బడతారు . వీరికి " పడమర దిక్కు " స్వదిశ అవుతుంది .
ఆరవది " ప వర్గు " ఈ వర్గు నందు " ప ఫ బ భ మ" అను ఐదు అక్షరములు వుంటాయి . వీటిలో ఏ అక్షరము తమ పేరు నకు మొదట వున్నా .. అట్టి వారు " ప వర్గు " నకు చెందిన వారుగా పరిగణింప బడతారు . వీరికి "వాయవ్య దిక్కు " స్వదిశ అవుతుంది .
ఏడవది " య వర్గు " ఈ వర్గు నందు " య ర ల వ " అను నాలుగు అక్షరములు వుంటాయి . వీటిలో ఏ అక్షరము తమ పేరు నకు మొదట వున్నా .. అట్టి వారు " య వర్గు " నకు చెందిన వారుగా పరిగణింప బడతారు . వీరికి "ఉత్తర దిక్కు " స్వదిశ అవుతుంది .
ఎనిమిదవది "శ వర్గు " ఈ వర్గు నందు " శ ష స హ ళ క్ష " అను ఆరు అక్షరములు వుంటాయి . వీటిలో ఏ అక్షరము తమ పేరు నకు మొదట వున్నా .. అట్టి వారు "శ వర్గు " నకు చెందిన వారుగా పరిగణింప బడతారు . వీరికి "ఈశాన్య దిక్కు " స్వదిశ అవుతుంది .
ఈ ప్రకారముగా వారి వారి పేరును బట్టి వా రే వర్గు నకు చెందిన వారో మొదట తెలుసుకోవాలి . ఆ తర్వాత "ఇంటి దిశ" , "సింహద్వార " మరియు " గ్రామ అర్వణము" ల గురించి సులువుగా తెలుసు కోన వచ్చును .
గమనిక : ప్రతి వారికి వారి జన్మస్థలము మరియు స్వగ్రామము చాలా మంచివి . స్వగ్రామము నాకు స్వదిశ యందున్న గ్రామము లేక దిశ అత్యంత శుభము ! స్వ దిశ మొదలు కొని 1-3-7 దిశ మరియు గ్రామాలూ కూడా శుభాములే ! 2-4-6-8 దిశల యందున్న గ్రామములు మద్యమ ఫలితాన్ని ఇవ్వ గలదు . 5 శత్రు దిశగా పరిగనించ వచ్చు . ఇందు బాధలు , దరిద్రము ,చిక్కులు , అధికము అని చెప్పవచ్చు .
సింహ ద్వారా నిర్ణయ విశేషాలను నా తదుపరి వ్యాసంలో తెలుసు కుందాం ...!
ధన్యవాదములు ...
భువనగిరి మురళి కృష్ణ శర్మ
నార్త్ కరోలినా . ఉత్తర అమెరికా .
అర్వణము :
" దిస కుదిరితే దశ కుదురు " అన్న సమేతలగా .. ! " దిశ " అనగా " తాను నివసించు దిక్కు , స్థలము , గృహము " అని అర్ధము ." దశ "అనగా "జాతక రీత్యా ప్రాప్తించగల అభివృద్ది కరమైన శుభ యోగములు " కనుక ప్రతి వారును తాము నివసించే ఉనికిని , శాస్త్ర సమ్మతముగా రూపొందించు కొనవలసి యున్నది .
నివసించే గృహము సొంతము ఐనా -కా కపోయినా కుడా , కొన్ని అతి ముఖ్యమైన విషయాలను ఉపేక్షింప కూడదు !గృహమేవరిది ఐనను అందలి సౌకర్యములు నివసించు వారనుభవించు నట్లు ... దోషములను కూడా అనుభవించ వలసి వుంటుంది . ఈ ప్రకారము మంచి కూడా అందుగల వారె పొందుచుండేదరు .
"జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ "అని పెద్దలు చెప్పారు . రామాయణ కలం లో కుడా.బంగరు మయమై , నవరత్న సౌధములతో తులతూగుతున్న కాంచన లంకను చూసి మొహపడుతున్న లక్ష్మణుకి ,అన్నగారయన శ్రీ రామ చoద్రుడంతటి అవతార మూర్తి ఈ విధముగా చెప్పారు .
శ్లో ॥ అపి స్వర్ణమయీ లంకానమే లక్ష్మణ రోచతె ।
జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ ॥