సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 4 వ పాదంలో ప్రవేశించినది మొదలుకొని వృషభరాశి లోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మద్య కాలాన్ని “కర్తరీ” అంటారు. దీన్నే వాస్తు కర్తరి అంటారు. అంటే భరణి నాలుగో పాదం, కృత్తిక నాలుగు పాదాలు, రోహిణి మొదటి పాదం మొత్తం ఆరు పాదాలలో సూర్యుడు ఉన్న కాలం కర్తరీ అంటారు. దీనినే “కత్తెర” అనికూడ అంటారు. కర్తరి నక్షత్ర కాలంలో సూర్యుడు నిప్పులు చెరుగుతాడు. డిగ్రీలలో చెప్పాలంటే మేషరాశిలో(డిగ్రీల 23°-20′ నిమిషాలు) నుండి వృషభరాశిలో (డిగ్రీల 26°-40′ నిమిషాలు).
కర్తరీలో చేయకూడని పనులు:- కర్తరీలో చెట్లు నరకటం, నార తీయటం, వ్యవసాయ ఆరంభం, విత్తనాలు చల్లటం, భూమిని త్రవ్వటం, తోటలు వేయటం, చెఱువులు, బావులు, కొలనులు త్రవ్వటం, నూతన గృహ నిర్మాణం చేయటము, కప్పులువేయుట, స్లాబులు, నిర్మాణ పనులు చేయరాదు.
కర్తరీలో చేసుకోదగిన పనులు:- కర్తరీలో ఉపనయనం, వివాహం, గృహప్రవేశము, నిశ్చితార్దాలు, శాంతులు, నవగ్రహ హోమములు, యజ్ఞం, మండపాదులను కప్పటం వంటి పనులు చేయవచ్చును