Thursday, December 31, 2020
Tuesday, December 22, 2020
తీక్షణదంష్ట్ర కాలభైరవాష్టకం. Tekshnadamstra KalaBhairava Astakam Telugu.
Friday, December 18, 2020
Tuesday, December 15, 2020
Vaikunta Ekadasi 2020 Dec 25th || Significance and story explained by Sr...
Monday, December 14, 2020
Poli Swargam katha in Telugu by Hindu Priest Rama Krishna Mahankali
Thursday, December 10, 2020
సమస్యనుబట్టి ప్రార్థన చేయాల్సిన శ్లోకాలు.
సూర్య గ్రహానికి
గ్రహాణాం ఆదిరాదిత్యః లోకరక్షణకారకః ।
విషమస్థాన సంభూతం పీడాంహరతుమే రవిః ॥ ఈశ్లోకాన్ని 7 వేలసార్లు జపించాలి
దానాలు త గోధులు,గోధుమపిండి పదార్థాలు రొట్టెలవంటివి,రాగివస్తువులు.
పూజలు- విష్ణుమూర్తికి పూజ,సూర్యోపాసన.
రత్నాలు- కెంపు ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)
చంద్ర గ్రహానికి
రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సురాశనః ।
విషమస్థాన సంభూతం పీడాంహరతుమే విదుః ।। ఈ శ్లోకాన్ని (10 వేలసార్లు జపించాలి)
దానాలు తపాలు,తెల్లబట్టలు,బియ్యం వెండి వస్తువులు.నీరుదానంచేయవచ్చులేదా నీటి ట్యాంకర్ కట్టించడం.శివాలయం,ఏదైనా తీర్థాలు,
పూజలు-శివారాధన,చంద్రపూజ,చంద్రుడి అష్టోత్తరశతనామాలుచదవటం
రత్నాలు- ముత్యం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)
కుజ గ్రహానికి
భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్‌సదా ।
వృష్టికృత్ సృష్టిహర్తాచ పీడాంహరతుమే కుజః ॥ ఈ శ్లోకాన్ని 7 వేలసార్లు జపించాలి
దానాలు త కారం వస్తువులు,ఎర్రవస్త్రాలు,కందులు,కందిపప్పు.రక్తదానం
పూజలు-దుర్గారాధన,సుబ్రహ్మణ్యారాధన ,కుజపూజ ,కుజఅష్టోత్తరశతనామాలుచదవటం
రత్నాలు- పగడం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)
బుధ గ్రహానికి
ఉత్పాతరూపో జగతాం చంద్రపుత్రోమహాద్యుతిః ।
సూర్యప్రియకరోవిద్వాన్ పీడాంహరతుమే బుధః । ఈశ్లోకాన్ని 17 వేలసార్లు జపించాలి
దానాలు తపెసలు,ఆకుపచ్చని దుస్తులు,ఎలక్ట్రానిక్‌వస్తువులు,రోగులకు మందులు ఇవ్వడం,
రత్నాలు- పచ్చ (దీన్నేమరకతం అంటారు) ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)
పూజ.విష్ను ఆరాధన,వణిగింద్రపూజ,కుబేరపూజ ఆయాదేవతలఅష్టోత్తరశతనామాలుచదవటం
గురు గ్రహానికి
దేవమంత్రీవిశాలాక్షః సదాలోకహితేరతః ।
అనేకశిశ్య సంపూర్ణః పీడాంహరతుమే గురుః॥ ఈశ్లోకాన్ని 16 వేలసార్లు జపించాలి
దానాలు త పుస్తకాలు,బంగారువస్తువులు,తీపి పిండివంటలు,పట్టుబట్టలు.పండ్లు.
పూజలు.హయగ్రీవ,సరస్వతీ,లలితా ,బుధగ్రహాల పూజలు ఆయాదేవతలఅష్టోత్తరశతనామాలుచదవటం.
రత్నాలు- పుష్యరాగం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)
శుక్ర గ్రహానికి
దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చమహామతిః ।
ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాంహరతుమే భృగుః ॥ ఈ శ్లోకాన్ని 20వేలసార్లు జపించాలి
దానాలు తచక్కెర,బబ్బెర్లు,అలంకరణ వస్తువులు.పూలు.ఆవు
పూజలు.లలితా ,కాలీ ,శుక్రగ్రహంపూజ చేయడం ఆయాదేవతల అష్టోత్తరశతనామాలుచదవటం
రత్నాలు- వజ్రం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)
శని గ్రహానికి
సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః ।
మందచారప్రసన్నాత్మా పీడాంహరతు శనిః ॥ ఈ శ్లోకాన్ని 19 వేలసార్లు జపించాలి
దానాలు తవాడుకున్నవస్త్రాల్లోచినిగిపోనివస్త్రాలు,నల్లని వస్త్రాలు,నూనె,నువ్వులుండలు.అవిటివారు,రోగులకుమందులు,ఆహారం ఇవ్వడం,సిమెంట్,నేరేడుపండ్లు,దానంచేయడం,నువ్వులనూనెతో శరీరాన్ని రుద్ది తర్వాత స్నానం చేయడం.
పూజలు,రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారం వ్రతం పూజలు ఆయాదేవతల అష్టోత్తరశతనామాలుచదవటం.
రత్నాలు- నీలం(దీన్నే ఇంద్రనీలం అంటారు) ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)
రాహు గ్రహానికి
అనేకరూప వర్ణైశ్చ శతశఃఅథసహస్రశః ।
ఉత్పాత రూపోజగతాం పీడాంహరతుమే తమః ॥ ఈ శ్లోకాన్ని 18 వేలసార్లు జపించాలి
దానాలు తముల్లంగివంటి దుంపలు ,మినప్పప్పుతో చేసినవడలు,మినుములు,ఆవాలు
పూజలు,దుర్గారాధన,కాలసర్పపూజలు,సుబ్రహ్మణ్య ,రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తరశతనామాలుచదవటం
రత్నాలు-గోమేధికం ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)
కేతు గ్రహానికి
మహాశిరో మహావక్త్రో దీర్ఘదంష్ట్రోమహాబలః।
అతనుశ్వ ఊర్ధ్వ కేశశ్చ పీడాం హరతుమే శిఖీ ॥ ఈ శ్లోకాన్ని 7 వేలసార్లు జపించాలి
దానాలు ఉలవలు,మిక్స్‌డ్ కలర్స్ వస్త్రాలు,ఆహారం,
పూజలు,దుర్గారాధన,కాలసర్పపూజలు,సుబ్రహ్మణ్య ,రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తరశతనామాలుచదవటం
రత్నాలు- వైఢూర్యం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)
విశేషాలు (సమస్యనుబట్టి ప్రార్థన చేయాల్సిన శ్లోకాలు ఇచ్చాము)
వివాహం కానివారికి,(మగవారికి)
పత్నీం మనోరమామదేహి మనో వృత్తాను సారిణి,
తారిణిం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం.
వివాహం కానివారికి,(స్త్రీలకు)
కాత్యాయనీ మహామాయే మాహా యోగిన్యధీశ్వరీ
నందగోపసుతం దేవి పతింమే కురుతేనమః
సంతానం లేనివారికి
(మర్రి,మామిడి,మేడి,జువ్వి,రావి వంటి పుణ్యవృక్షాలకు ప్రదక్షిణచేయడం,ఎక్కువసేపు గడపడం వల్ల గర్భసంబధ రోగాలు తగ్గుతాయి)
దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే
దేహిమే తనయంకృష్ణ త్వామహం శరణం గతః ॥
నమోదేవ్యై మహాదేవ్యై దుర్గాయై సతతంనమః।
పుత్రసౌఖ్యం దేహిదేహి గర్భరక్షాంకురుష్వనః॥
ఉద్యోగం లేనివారుంప్రమోషన్ కోరేవారు
శ్రీ రాజమాతంగ్యై నమః
ఇంటిలో అశాంతి తొలగుటకు
ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం।
లోకాభిరామంశ్రీరామం భూయో భూయో నమామ్యహం
Thursday, November 19, 2020
Wednesday, October 28, 2020
Friday, October 16, 2020
Saturday, September 26, 2020
*శ్రీ సూక్తశ్లోకాలు
Friday, September 25, 2020
Thursday, September 24, 2020
Wednesday, September 2, 2020
పితృదేవతా స్తుతి
పితృదేవతా స్తుతి
శ్రాద్ధాదులలో, మహాలయ పక్షాలలో దీనిని పఠించితే పితరుల కృప లభిస్తుంది. పితృదేవతా విజ్ఞానంతో కూడిన ఈ స్తుతి ఇంట్లో ఉంటే చాలు – పితృకృప చేత ఆ యిల్లు ఆనందైశ్వర్య నిలయమవుతుంది. పుష్టికారకమైన ఈ స్తుతి శ్రాద్ధంలో భోక్తల ముందు చదవడం కూడా శ్రేష్ఠం. ఇది ’గరుడ మహాపురాణం’లో చెప్పబడుతున్నది. ఇందులో అన్ని పితృగణాలు, వాటి విశేష రహస్యాలు చెప్పబడి ఉన్నాయి. దేవతల చేత కూడా ఆరాధింపబడే మహిమాన్వితులు పితృదేవతలు. వారి అనుగ్రహం వలన వంశవృద్ధి, ఐశ్వర్య క్షేమాలు సమకూరుతాయి.
నమస్యేహం పితౄన్ భక్త్యా యే వసన్త్యధిదైవతమ్!
దేవైరపి హి తర్ప్యన్తే యే శ్రాద్ధేషు స్వధోత్తరైః!!
నమస్యేహం పితౄన్ స్వర్గే యే తర్ప్యన్తే మహర్షిభిః!
శ్రాద్ధైర్మనోమయైర్భక్త్యా భుక్తిముక్తి మభీప్సుభిః!!
నమస్యేహం పితౄన్ సర్గే సిధాః సంతర్పయన్తియాన్!
శ్రాద్ధేషు దివ్యైః సకలైరుపహారైరనుత్తమైః!!
నమస్యేహం పితౄన్ భక్త్యా యోర్చ్యన్తే గుహ్యకైర్దివి!
తన్మయత్వేన వాంఛద్భి యుద్ధిమాత్యన్తికీం పరామ్!!
నమస్యేహం పితౄన్ మర్త్యై రర్చ్యన్తే భువియే సదా!
శ్రాద్ధేయు శ్రద్ధయాభీష్టలోక పుష్టి ప్రదాయినః!!
నమస్యేహం పితౄన్ యే వై తర్ప్యన్తేరణ్యవాసిభిః!
వన్యైః శ్రాద్ధైర్యతాహారైస్తపో నిర్ధూతకల్మషైః!!
నమస్యేహం పితౄన్ విప్రైర్నైష్ఠికైర్ధర్మచారిభిః!
యే సంయతాత్మభిర్నిత్యం సంతర్పన్తే సమాధిభిః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః రాజన్యాస్తర్చయన్తియాన్!
కవ్యై రశేషైర్విధివల్లోకద్వయ ఫలప్రదమ్!!
నమస్యేహం పితౄన్ వైశ్యైరర్చ్యన్తే భువియే సదా!
స్వకర్మభి రతైర్నిత్యం పుష్పధూపాన్న వారిభిః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధే శూద్రైరపి చ భక్తితః!
సంతర్ప్యన్తే జగత్కృత్స్నం నామ్నాఖ్యాతాః సుకాలినః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధే పాతాళే యే మహాసురైః!
సంతర్ప్యన్తే సుధాహారా స్త్యక్త దర్పమదైః సదా!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః అర్చ్యన్తే యే రసాతలేః!
భోగైరశేషైర్విధివన్నాగైః కామానభీప్సుభిః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః సర్పైః సంతర్పితాన్ సదా!
తత్రైవ విధివన్మహా భోగ సంపత్సమన్వితైః!!
పితౄన్నమస్యే నివసన్తి సాక్షాద్యే దేవలోకేధమహాతలేవా!
తధాన్తరిక్షేచ సురారి పూజ్యాస్తే వై ప్రతీచ్ఛన్తు మయోపధీతమ్!!
పితౄన్నమస్యే పరమార్థభూతా యే దై విమానే నివసన్త్యమూర్తాః!
యజన్తి యానన్తమలైర్మనోభి ర్యోగీశ్వరాః క్లేశవిముక్తి హేతూన్!!
పితౄన్నమస్యేదివి యే చ మూర్తాః స్వధాభుజః కామ్య ఫలాభినన్దౌ!
ప్రదానశక్తాః సకలేప్సితానాం విముక్తిదా యేనభిసంహితేషు!!
తృప్యన్తు తేస్మిన్పితరః సమస్తా ఇచ్ఛావతాం యే ప్రదిశన్తి కామాన్!
సురత్వమిన్ద్ర త్వ మితోధికం వా గజాశ్వరత్నాని మహాగృహాణి!!
సోమస్య యే రశ్మిషు యోర్కబింబే శుక్లౌ విమానే చ సదావసన్తి!
తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైర్గన్ధాదినా పుష్టిమతో వ్రజన్తుః!!
యేషాం హుతేగ్నే హవిషాచ తృప్తిర్యే భుంజతే విప్రశరీరసంస్థాః!
యే పిండదానేన ముదం ప్రయాన్తి తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైః!!
యే ఖడ్గ్మమాం సేన సురైరభీష్టైః కృష్ణైస్తిలైర్దివ్య మనోహరైశ్చ!
కాలేన శాకేన మహర్షివర్యైః సంప్రీణతాస్తే ముదమత్రయాస్తు!!
కన్యాన్య శేషాణి చ యాన్యభీష్టాన్యతీవ తేషాం మమ పూజితానాం!
తేషాం చ సాన్నిధ్య మిహాస్తు పుష్పగంధాంబు భ్యోజ్యేషు మయాకృతేషు!!
దినే దినే యే ప్రతిగృహ్ణతేర్చాం మాసాన్త పూజ్యా భువి యేష్టకాసు!
యే వత్సరాన్తేభ్యుదయే చ పూజ్యాః ప్రయాన్తు తేమే పితరోత్ర తుష్టిమ్!!
పూజ్యాద్విజానాం కుముదేన్దు భాసో యే క్షత్రియాణాం జ్వలనార్కవర్ణాః!|
తథా విశాం యే కనకావదాతా నీల ప్రభాః శూద్రజనస్య యేచ!!
తేస్మిన్సమస్తా మమ పుష్ప గంధధూపాంబు భోజ్యాది నివేదనేన!
తథాగ్ని హోమేన చయాన్తి తృప్తిం సదా పితృభ్యః ప్రణతోస్మి తేభ్యః!!
యే దేవ పూర్వాణ్యభితృప్తి హేతో రశ్నన్తి కవ్యాని శుభాహృతాని!
తృప్తాశ్చ యే భూతిసృజో భవన్తి తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మి తేభ్యః!!
రక్షాంసి భూతాన్యసురాంస్తథోగ్రాన్ నిర్ణాశయన్తు త్వశివం ప్రజానామ్!
ఆద్యాః సురాణామమరేశ పుజ్యాస్తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మితేభ్యః!!
అగ్నిష్వాత్తా బర్హిషద ఆజ్యపాః సోమపాస్తథా!
వ్రజన్తు తృప్తిం శ్రాద్ధేస్మిన్పితర స్తర్పితా మయా!!
అగ్నిష్వాత్తాః పితృగణాః ప్రాచీం రక్షన్తు మేదిశం!
తథా బర్హిషదః పాన్తు యామ్యాం మే పితరః సదా!!
ప్రతీచీ మాజ్యపాన్త ద్వదుదీచీమపి సోమపాః!
రక్షో భూతపిశాచే భ్యస్తథైవాసురదోషతః!!
సర్వతః పితరో రక్షాం కుర్వన్తు మమ నిత్యశః!
విశ్వో విశ్వ భుగారాధ్యో ధర్మో ధన్యః శుభాననః!!
భూతిదో భూతికృత్ భూతిః పితౄణాం యే గణానవ!!
కళ్యాణః కల్యదః కర్తా కల్యః కల్యతరాశ్రయః!
కల్యతా హేతురనఘః షడిమే తే గణాః స్మృతాః!!
వరో వరేణ్యో వరదస్తుష్టిదః పుష్టిదస్తథా!
విశ్వపాతా తథా ధాతా సప్తైతే చగణాః స్మృతాః!!
మహాన్మహాత్మా మహితో మహిమావాన్మహాబలః!
గణాః పంచ తథైవైతే పితౄణాం పాపనాశనాః!!
సుఖదో ధనదశ్చాన్యే ధర్మదోన్యశ్చ భూతిదః!
పితౄణాం కథ్యతే చైవ తథా గణ చతుష్టయమ్!!
ఏకత్రింశత్పితృగణా యేర్వ్యాప్త మఖిలం జగత్!
త ఏవాత్ర పితృగణాస్తుష్యన్తు చ మదాహితాత్!!
మార్కండేయ ఉవాచ
ఏవంతు స్తువతస్తస్య తేజసో రాశిర్రుచ్ఛ్రి తః!
ప్రాదుర్బభూవ సహసా గగనవ్యాప్తి కారకః!!
తద్ దృష్ట్వా సుమహత్తేజః సమాచ్ఛాద్య స్థితం జగత్!
జానుభ్యామవనీం గత్వా రుచిః స్తోత్రమిదం జగౌ!!
రుచిరువాచ
అర్చితానామమూర్తానాం పితౄణాం దీప్త తేజసామ్!
నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్య చక్షుషామ్!!
ఇంద్రాదీనాం చ నేతారో దక్షమారీచ యోస్తథా!
సప్తర్షీణాం తథాన్యేషాం తాన్నమస్యామి కామదాన్!!
మన్వాదీనాం చ నేతారః సూర్యాచన్ద్ర మసోస్తధా!
తాన్నమస్యామ్యహం సర్వాన్ పితౄణప్యుదధావపి!!
నక్షత్రాణాం గ్రహాణాం చ వాయ్వగ్న్యోర్నభసస్తథా!
ద్యావాపృథివ్యోశ్చ తథా నమస్యామి కృతాంజలిః!!
ప్రజాపతేః కశ్యపాయ సోమాయ వరుణాయ చ!
యోగేశ్వరేభ్యశ్చ సదా నమస్యామి కృతాంజలిః!!
నమో గణేభ్యః సప్తభ్య స్తథాలోకేషు సప్తషు!
స్వాయంభువే నమస్యామి బ్రహ్మణే యోగ చక్షుషే!!
సోమాధారాన్ పితృగణాన్ యోగిమూర్తిధరాం స్తథా!
నమస్యామి తధా సోమం పితరం జగతా మహమ్!!
అగ్నిరూపాం స్తథైవాన్యాన్నమస్యామి పితౄనహమ్!
అగ్నీషోమమయం విశ్వం యత ఏతదశేషతః!!
యే చ తేజసి యే చైతే సోమసూర్యాగ్ని మూర్తయః!
జగత్స్వరూపిణశ్చైవ తథా బ్రహ్మ స్వరూపిణః!!
తేభ్యోఖిలేభ్యో యోగిభ్యః పితృభ్యో యతమానసః!
నమో నమో నమస్తేస్తు ప్రసీదస్తు స్వధాభుజః!!
మార్కండేయ వువాచ
ఏవం స్తుతాస్తతస్తేన తేజసోమునిసత్తమాః!
నిశ్చక్రముస్తే పితరో భాసయన్తో దిశోదిశ!!
నివేదనం చ యత్తేన పుష్పగంధానులేపనం!
తద్భూషితానథ స తాన్ దదృశే పురతః స్థితాన్!!
ప్రణిపత్య రుచిర్భక్త్యా పునరేవ కృతాంజలిః!
నమస్తుభ్యం నమస్తుభ్యమిత్యాహ పృధగాద్రుతః!!
స్తోత్రేణానేనచ నరో యోస్మాం స్తోష్యతి భక్తితః!
తస్య తుష్టావయం భోగానాత్మజం ధ్యానముత్తమమ్!!
ఆయురారోగ్యమర్ధం చ పుత్ర పౌత్రాదికం తధా!
వాంఛద్భిః సతతం స్తవ్యాః స్తోత్రేణానేన వైయతః!!
శ్రాద్ధేషు య ఇమం భక్త్యా త్వస్మత్ప్రీతి కరం స్తవమ్!
పఠిష్యతి ద్విజాన్మానాం భుంజతాం పురతః స్థితః!!
స్తోత్ర శ్రవణ సంప్రీత్యా సన్నిధానే పరే కృతే!
అస్మాభిరక్షయం శ్రాద్ధం తద్భవిష్యత్యసంశయమ్!!
యస్మిన్ గేహే లిఖిత మేతత్తిష్ఠతి నిత్యదా!
సన్నిధానం కృత్యౌ శ్రాద్ధౌత త్రాస్మాకం భవిష్యతి!!
తస్మాదేతత్త్వ యా శ్రాద్ధే విప్రాణాం భుంజతాం పురః!
శ్రవణీయం మహాభాగ అస్మాకం పుష్టికారకమ్!!
(రుచి ప్రజాపతి చేసిన ఈ స్తోత్రం నిత్యం పఠించవచ్చు)
Thursday, July 30, 2020
వరలక్ష్మీ వ్రత కల్పంపూజ విధానము
Friday, April 10, 2020
Life History of Sri Tadepalli Raghava Narayana Sastry Garu, popularly called as Chandolu Sastry Garu.
బాలా త్రిపుర సుందరి అమ్మ వారి స్వరూపం
చందవోలు గ్రామంలో తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి, హనుమమ్మ దంపతులకు రాఘవనారాయణ శాస్త్రి గారు జన్మించారు. తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు 1922లో శ్రీ కాకాని మల్లీశ్వర మాహాత్యము ప్రబంధాన్ని వ్రాసి ప్రచురించారు. తిరిగి 1986లో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు రామకథామృత గ్రంథమాల తరఫున పునర్ముద్రించారు
విద్యాభ్యాసం
రాఘవ నారాయణశాస్త్రికి ఎనిమిది సంవత్సరాల వయసు రాగానే తండ్రి వెంకటప్పయ్యశాస్త్రి ఉపనయనం చేశారు వెంకటప్పయ్యశాస్త్రి వద్దనే రాఘవనారాయణశాస్త్రి సంస్కృతాంధ్ర సాహిత్యాలు చదువుకోవడం ప్రారంభించారు. విద్యాభ్యాసాన్ని తీవ్రమైన ఏకాగ్రత, నిష్టతో చేయడం ప్రారంభించారు. విద్యాభ్యాస కాలం నుంచే త్రికాల సంధ్యావందనం, అగ్నికార్యం సకాలంలో చేయడం ప్రారంబించి, సంప్రదాయానుసారం, శాస్త్రానుసారం వచ్చిన విధులన్నీ పాటించేవారు. అయితే వీరిచేత అక్షరాభ్యాసం చేయించి, లౌకిక విద్య తాడికొండ గ్రామస్తులైన కేదారలింగం నేర్పడం ప్రారంభించారు. ఆయన బాలాత్రిపురసుందరీ ఉపాసకులు. 12వ సంవత్సరంలోనే రాఘవనారాయణశాస్త్రికి వెంకటప్పయ్యశాస్త్రి అనుమతితో కేదారలింగం "బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని" ఇచ్చారు. బాల ఉపాసన 16 సంవత్సరాల వయసుకే పండి జీవితాంతం అమ్మవారు పిలిస్తే పలికే దైవంగా నిలిచింది. దెందుకూరి పానకాల శాస్త్రి వద్ద తర్కం, పొదిలి సీతారామశాస్త్రి వద్ద మంత్రానుష్ఠానం నేర్చారు.
సన్యసించేందుకు ప్రయత్నాలు, వివాహం
రాఘవనారాయణశాస్త్రికి యవ్వనంలోనే సన్యసించాలనే కోరిక కలిగింది. సన్యసించేందుకు తల్లి అనుమతి తప్పనిసరి కాగా ఆమె రాఘవనారాయణశాస్త్రి సన్యసించేందుకు అనుమతినివ్వలేదు. కుమారుడు సన్యసించడాన్ని వెంకటప్పయ్యశాస్త్రి కూడా వ్యతిరేకించారు. అయితే కొన్నాళ్ళకు వెంకటప్పయ్యశాస్త్రికి కుమారుడు కనిపించక వెతుకుతూండగా ఊరి చివర పొదలమాటున నిర్వికల్ప సమాధిలో తపస్సు చేసుకుంటున్న రాఘవనారాయణశాస్త్రి కనిపించారు. తన కొడుకు వైరాగ్యం ఏ స్థాయిలో ఉందో తెలిసివచ్చింది. శ్యామలాంబ అనే యోగిని వీరి తండ్రి గారితో శాస్త్రి గారు సూర్య మండలాన్తర్వర్తి అయిన మహా సిద్ధుడు ఈ రూపంలో జన్మించాడని చెప్పింది. శాస్త్రి గారికి చిన్నతనంలో పిన తల్లి చూపించిన ఒక దృశ్యం గోచరించింది. అందులో తాను ఒక సిద్ధుడు శ్రీ చక్రేశ్వారి అయిన కామేశ్వరి దూరంగా ఉన్న యువతుల్ని తీసుకు రమ్మన్నది. ఒకరిని మోసుకొని ఇద్దర్నీ తీసుకొచ్చాడు. అమ్మవారు చిరునవ్వుతో అతని మనసు కొంచెం చలించింది అని భూలోకంలో జన్మించమని తాను మోసుకొచ్చిన అమ్మాయే భార్య అవుతుందని అన్నది. 19 వ ఏట అద్దేపల్లి మంగమ్మ, పాపయ్య శాస్త్రుల కూతురు పార్వతితో వివాహ మైంది. పిన్ని చూపించింది కూడా ఈమెనే. ఆమె పేరును శ్రీదేవిగా శాస్త్రిగారు మార్చారు.
పాండిత్యం
శాస్త్రి గారు తండ్రి గారి వేద పాఠశాల నిర్వహణలో తోడు పడుతూ ఉన్నారు. ఆయన పద్ధతి నచ్చిన చాలా మంది అమెరికాకు రమ్మన్నారు. వారికి ఇష్టం లేదు. పిన పాటి వీరభద్రయ్యతో నేత్రావధానం, ఎలేశ్వరపు పురుషోత్తమ శాస్త్రితో కవిత్వ సాధన చేశారు. అప్పటికే అనేక సభల వారు శాస్త్రి గారికి 400 కు పైగా సర్టి ఫికేట్స్ ఇచ్చారు. వ్యాకరణ గురువు గారు ముదిగొండ నాగలింగ శాస్త్రి గారితో అనేక అవధానాలు చేసి, ఆ డబ్బు అంతా గురువు గారికే సమర్పించారు. పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ చంద్ర శేఖర భారతీ స్వామి సన్నిధిలో జరిగిన అష్టావదానికి వారు మెచ్చి ఉభయ శ్లేషకు లక్ష్యంగా ఒక శ్లోకం చెప్ప మంటే ఆశువుగా అద్భుతంగా చెప్పి ఒప్పించారు.
అమ్మ వారి సాక్షాత్కారం
దేశ సంచారం చేస్తూ ఒక సారి ఇంటికి వస్తే ఇల్లు ‘’అయ్యవారి నట్టిల్లు ‘’లా ఉంది. ఇంటి వద్దే ఉండి తండ్రికి తోడ్పడ్డారు. తిండికి గడవని పరిస్థితి. మూడు రోజులు అంతా ఉపవాసమే. మూడవ రోజు రాత్రి 27 సార్లు లలితా సహస్ర నామ పూజ చేసి నైవేద్యం పెట్టిన జలాన్నే త్రాగి అన్గోస్త్రం నేల మీద పరచి నిద్ర పోయారు. 10 ఏళ్ళ బాలిక కలలో కన్పించి ‘’ఒర్ ! ముష్టి పెడతాను. కొంగు పట్టు ‘’అన్నది. దోసెడు బియ్యం కొంగు లో పోసి ‘’బండి వస్తుంది. అందులో కావలసిన సామగ్రి అంతా వస్తుంది ‘’అన్నది. తెల్లారే సరికి ఖాజీ పాలెం సీతా రామ రాజుగారి బండి వచ్చింది. అక్కడ రాజు గారు కోరిన మీదట పురాణం చెప్పి రాత్రి ఇంటికి వచ్చే సరికి తలుపు దగ్గర రాజు గారు పోయించిన పుట్టెడు ధాన్యపు రాశి కన్పించింది. అప్పటి నుంచి శాస్త్రి గారింట లక్ష్మీ దేవి నిత్య సాక్షాత్కారమే.
అనేక గ్రామాలలో భాగవతం, హరి వంశం, పురాణం చెబుతూ రాత్రికి ఇంటికి చేరేవారు. పరమ నిష్టాగరిష్టంగా జీవించేవారు. ప్రాణాయామం తపస్సు కొనసాగించారు. ఇంట్లో వేరుసెనగ నూనె, వేరుసెనగ వాడలేదు. దొండకాయ, టమేటా, బంగాళా దుంప, ముల్లంగి కాబేజీ నిషిద్ధం. కాశీకి తప్ప ఎప్పుడూ రైలు ప్రయాణం చేయలేదు. ఆయనకు మగ సంతానం లేదు. కూతురు లక్ష్మిని చెరువు సత్య నారాయణ శాస్త్రి కిచ్చి వివాహం చేశారు. ఆయనే శాస్త్రి గారి జీవిత చరిత్ర రాశారు.
అష్ట సిద్దులు కైవసం
శాస్త్రి గారికి అష్ట సిద్ధులు వశమైనాయి. వాటిని స్వంతానికి ఎప్పుడూ వాడుకోలేదు. వారు చాలా గొప్ప తపశ్శక్తి సంపన్నులు. ఆ తపస్సు ఈ ఒక్క జన్మలోనిది కాదు. ఎన్నెన్నో జన్మలలో చేసిన తపస్సంతా కలిసి ఆయన ఆ స్థితిలో ఉండేవారు. దేవతా శక్తులన్నీ వారి చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉండేవి. అన్ని దైవ శక్తులు ఎల్లప్పుడూ వారి అధీనంలో ఉండేవి. కానీ వారెన్నడూ వాటిని తన స్వార్థానికి వినియోగించుకోలేదు. అమ్మవారు వారిని అనేక సార్లు "నీకు ఏమి కావాలో చెప్పు. ఐశ్వర్యం, చక్రవర్తిత్వం, దాసదాసీలు, ఏనుగులు, సంపదలు, కీర్తి ఏమి కావాలన్నా ప్రసాదిస్తాను కోరుకో" అనేది. వారు "నువ్వే నాతో ఉన్నప్పుడు అవన్నీ నాకెందుకమ్మా" అనేవారు. పూర్తి నిష్కామంగా జీవితమంతా గడిపారు వారు ఆయుర్వేద వైద్యం చేసేవారు. దాని అధ్యయనంలో భాగంగా వారికి ’వశ్యంకర ఔషధి ‘’ని ఒక మూలిక గురించి తెలిసింది. అది కేవలం గ్రహణ సమయంలో మాత్రమే కంటికి కనిపించే మూలిక. అది కూడా ఒక నిర్ణీత స్థలంలో మాత్రమే లభ్యమవుతుంది. ఈ విషయం తెలుసుకున్న శాస్త్రి గారు అది దగ్గరలోని ఒక కొండ మీద లభిస్తుందని తెలుసుకుని ఒక గ్రహణ సమయానికి ఆ కొండ మీదకి వెళ్ళారు. సరిగ్గా గ్రహణం ఆరంభం కాగానే ఆ మూలిక వారికి కనిపించింది. పరమానందంతో వారు దానిని సమీపించి కోసుకోబోతుండగా అక్కడ ఒక చిన్న పిల్లవాడు అడ్డు వచ్చాడు. సరేలే అని వారు వేరే వైపు నుంచి వచ్చి దానిని కోసుకుందామనుకుంటే ఆ పిల్లవాడు ఆ వైపు కూడా అడ్డు వచ్చాడు. అలా ఏ వైపు చూస్తే ఆ వైపు ఆ పిల్లవాడు అడ్డు వస్తుండడంతో వారికి ఆ మూలిక కోసుకోవడం కుదరడం లేదు. ఇక విసిగిపోయిన వారు "ఎవడవురా నువ్వు? నాకెందుకు అడ్డు వస్తున్నావు? నన్ను ఆ మూలిక కోసుకోనీ. మరల గ్రహణం అయిపోతే అది కనిపించదు" అన్నారట. ఆ పిల్లవాడు "నేనెవరైతే నీకెందుకు? నీకు ఆ మూలిక ఎందుకు?" అని ప్రశ్నించాడు. "ఆ మూలిక మన దగ్గర ఉంటే మనకు విశ్వమంతా వశమవుతుందట. కనుక నన్ను దానిని తీసుకోనీ" అని శాస్త్రి గారన్నారు. దానికి అ పిల్లవాడు నవ్వి "‘’నీకు ఈ మొక్క తో పని లేదు. నీ ముఖం చూస్తేనే అందరు వశు లౌతారు ‘’ఆ మూలిక లేకుండానే నీకు విశ్వం వశమైందిగా" అన్నాడట. శాస్త్రి గారు "అదంతా నీకెందుకు? ముందు అడ్డు తొలగు. మరల గ్రహణం అయిపోతే నాకు అవకాశం చేజారిపోతుంది" అని కోరారు. కానీ పిల్లవాడు ఒప్పుకోలేదు. ఈ లోగా గ్రహణం పూర్తయిపోయింది, ఆ మూలిక మాయమైపోయింది. బాలుడు మాయమయ్యాడు శాస్త్రి గారు తనకు దాన్ని పొందే యోగం లేదని నిట్టూరుస్తూ ఉండగా ఆ పిల్లవాడు మూడు ముఖాలతో దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చాడు. కారణం ఆ మూలికకు అధిదేవత దత్తాత్రేయస్వామి.. వీరు వేరే గ్రామంలో అధ్యయనం నిమిత్తం కొన్ని రోజులు ఉన్నప్పుడు ఒక సారి ఒక 6-7 యేళ్ళ పిల్లవాడు వీరిని చూచి "మనిద్దరం కలిసి ఫలానా కొండ మీద 20 సంవత్సరాలు తపస్సు చేసుకున్నాం కదా! గుర్తు లేదా?" అని అడిగాడట. వీరికేమీ అర్థం కాక ఏ కొండ మీద, ఎప్పుడు, ఎవరు అని ఏదో అడుగబోతుండగా ఆ పిల్లవాడు పారిపోయాడట. అంటే వాడు ఏ జన్మలో వారి తపస్సాహచర్యం పొందిన మహా భాగ్యశాలియో కదా! పూర్వ జన్మ సఖుడైన ఒక యోగి కన్పించి సుఖ దుఃఖాలను సమానం గా భావించాలని చెప్పి మళ్ళీ 50 ఏళ్ళ కు కని పిస్తానని చెప్పి వెళ్లాడు. సరిగ్గా యాభై ఏళ్ళ తరువాత శాస్త్రి గారు అమరావతి వెళ్లి అమరేశ్వర స్వామిని దర్శించి తమ గదిలో ప్రాణాయామం చేస్తూ చాలా పైకి లేచి తల క్రిందులు గా పడి పోతుంటే తల నే లకు తగిలే సమయాన ఆయోగి వచ్చి చేయి అడ్డం పెట్టి కాపాడాడు. శాస్త్రి గారు నమస్కరించ గానే యోగి అదృష్యుడైనాడు.
తండ్రి గారు మొదలు పెట్టిన ‘’శ్రీ రామ కదామృతం ‘’ను వారి మరణానంతరం శాస్త్రి గారు పూర్తీ చేస్తున్నారు అయోధ్యా కాండం లో గాయత్రీ మంత్రం లోని ‘’భకార’’వర్ణం తో పద్యం రావటం లేదు. అమ్మను ఉపాశించి నిద్ర పోయారు. కలలో ఒక బీబీ జగన్మోహిని నిద్రిస్తుండగా 30ఏళ్ళ గడ్డం వాడొకడు ఆమె చొక్కా పైకెత్తి పాలు తాగుతున్నాడు. శాస్త్రి గారు ఆ దృశ్యం చూస్తుంటే ‘’ఎందుకు నిల బడ్డావు ‘’?అని అడిగింది. ’’నాకూ పాలు ఇస్తావా ?’’అని అడిగారు. మెలకువ వచ్చి ‘’భర్మ మయ రమ్య హర్మ్యము ‘’అనే భ వర్ణం తో పద్యం తేలిగ్గా వచ్చింది
తాడి కొండ వేద పాథ శాలలో దేయాలు తిరిగి ఇబ్బంది పెడుతుంటే శాస్త్రి గారు మంత్రం పఠించి పార ద్రోలారు. ఒక సారి పుస్తక ముద్రణ కోసం చందాలకు తిరుగుతూ ఉంటె సత్తెనపల్లి లో ఒక బ్రాహ్మణుల ఇంట్లోకి ఇరవైయేళ్ళ యువతీ కని పించి, నమస్కరించి లోపలి వెళ్ళింది. ఆమె గ్రహ పీడి తురాలు. అందర్ని కొడుతూ, తిడుతూ ఉండేది. అలాంటిది శాస్త్రి గారిని చూడగానే అత్యంత వినయాన్ని ప్రదర్శించటం ఇంట్లో వారందరికి ఆశ్చర్యం కలిగించింది. ఆమెను గ్రహ ప్రేరణ చేసి ‘’ఏం చేస్తే నువ్వు పోతావు /’’అని అడిగారు. ’’సహస్ర గాయత్రీ జప ఫలం ధార పోస్తే పోతాను ‘’అంది. శాస్త్రి గారు సహస్ర గాయత్రి జపం చేసి ధార పోశారు. ఇంటి ముందున్న వేప చెట్టు కొమ్మ విరిగి పడింది. దెయ్యం వదిలింది. వేరొక సారి నాగుల చవితి రోజు కాలవ లో స్నానం చేసి వస్తుంటే నాగలి చాలులో పడుకొన్న నాగు పాము తోక పై ఆయన కాలు పడింది. అది బుసలు కొడుతూ పైకి లేచి కాటు వెయ బూనితే ‘’గారుడ మంత్రం ‘’జపించారు. సర్పం తల నేల కు వాల్చింది. ’’స్వామీ !నీ జోలికి నేను రాలేదు. నా జోలికి నువ్వు రావద్దు. పొరపాటున నా కాలు తగిలింది. వెళ్లి పొండి ‘’ అనగానే పాము వెళ్లి పోయింది. ఆ రోజంతా గారుడ మంత్రం పఠిస్తూనే ఉన్నారు.
శాస్త్రి గారు 90 ఏళ్ళ జీవిత కాలం లో 80 ఏళ్ళు ‘’బాలా మంత్రానుష్టానం ‘’చేసిన మహనీయులు. ఒక సారి కాశీ లో గంగా స్నానం చేస్తుంటే గంగా దేవి’గలగలా లాడే బంగారు చ్గాజులున్న చెయ్యి చూపించి ‘’నాకేమి కానుక తెచ్చావు ?’’అని అడిగింది. శాస్త్ర్రి గారికి ఏమీ పాలు పోక తన వ్రేలికున్న బంగారు దర్భ ఉంగరం తీసి ఆమె చేతి లో పెట్టారు. బసకు తిరిగి వచ్చి దేవతార్చన పెట్టె తెరిస్తే గంగకు అర్పించిన ఉంగరం అందులోనే ఉంది. తానేమైనా పొరపడి దర్భ ఉంగరం ఇవ్వలేదా అని సందేహించి ధ్యాన నిమగ్న మయ్యారు.. గంగమ్మ కని పించి ‘’కానుక ఇమ్మంటే దర్భ ఉంగరం ఇచ్చా వేరా ?’’అన్నది. ’’అది నీకు పితృ తర్పణం చెయ్యటానికి ఉప యోగ పడుతుంది కాని నాకు ఆభరణం ఎలా అవుతుంది ?’’అని గద్దించింది. ’’అమ్మా నేనేమీ నీ కోసం తేలేదు. ఆ సమయానికి అది స్పురించి ఇచ్చానంతే. ’’అన్నారు. మళ్ళీ గంగమ్మ ‘’నీ భార్యదగ్గర నాకోసం తెచ్చిన నగ ఉంది అది తెచ్చివ్వు ‘’అన్నది గంగ. శాస్త్రి గారు భార్యను అడిగి నగను తీసుకొని పోయి ‘’గంగార్పణం ‘’చేశారు.
ఆయన తన కార్య క్రమాలన్ని ముగించుకొని వాకిలి అరుగు మీద కూర్చుంటే వందలాది మంది వచ్చి తమకు ముహూర్తం పెట్టమనో, పేరు పెట్టమనో అడిగే వారు. కాసేపు కళ్ళు మూసుకొని ముహూర్త నిర్ణయం చేసే వారు. అంతే. ఆ కార్య క్రమం శుభప్రదంగా జరిగి పోయేది. దానికి తిరుగు లేదు. అదీ వారి మంత్ర సిద్ధి.
దాదాపు ముప్ఫై ఏళ్ళ క్రితం కాంచీ పరమాచార్యులు ఉయ్యూరు కే’సి’పి’వారి ఆహ్వానం, గురజాడ లోని చల్లా శర్మ గారు ఏర్పాటు చేసిన కార్య క్రమం లో వారం రోజులున్నారు. అప్పుడు రాఘవ శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు అన్ని రోజులు. అప్పుడు వారిని చూశాను. జగద్గురువుల ను వీరినీ ఒకే సారి చూసే భాగ్యం కలిగింది. అప్పుడే ‘’నడయాడే దైవం ‘’అని పరమా చార్య మీద పుస్తకం ఆవిష్కరణ జరిగి నట్లు జ్ఞాపకం.
తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారు బయటకు వస్తే గృహస్థాశ్రమ ధర్మపు ఆచారం పాడైపోతుందని బాధపడేవారు. అప్పుడు పరమాచార్య స్వామివారు బ్రహ్మరథం(వేదం చదువుకున్న వారు మోసే పల్లకి) ఎక్కి శాస్త్రిగారి ఇంటికి వచ్చారు. వారింట్లో దిగి పరమాచార్య స్వామి వారు శాస్త్రిగారితో, “ఏమి నీ ఆచారానికి ఇబ్బంది వస్తోదని బెంగ పెట్టుకుంటున్నావా? ఇవ్వాళ మీ ఆచరానికి మేము కొత్తగా రక్ష కడుతున్నాం. ఇక నీకు ఇబ్బంది కలగదని” శాలువా తీసి కప్పారు.
పరమాచార్య స్వామి వారు శాలువా కప్పడము అంటే అంగరక్ష కట్టినట్టే. “ఇంక నీకు బెంగ లేదు. ఇప్పుడు బయటకు వచ్చినా ఏమి ఇబ్బంది కలగదు” అని అన్నారు. ఆ గురు శిష్యుల సంబధం అటువంటిది.
పరమాచార్య స్వామి వారు కూర్చొని ఉండగా శాస్త్రిగారు వారి తండ్రిగారైన కీర్తి శేషులు తాడేపల్లి వెంకటప్పయ్యశాస్త్రులు గారు ‘రామ కథామృతము’ అనే గ్రంథం రచించారు. దాన్ని స్వామి వారి ముందు చదువుదామని శాస్త్రి గారు వెళ్ళారు. పరమాచార్య స్వామి వారు లోపలికి రమ్మన్నారు. శాస్త్రిగారు ఆ పుస్తకాన్ని చదువుతున్నారు.
పరమాచార్య స్వామి వారు “పద్యాలు చాలా బాఉన్నాయి. చదువు చదువు” అని అంటున్నారు. ఇంతలో స్వామి వారి సేవకులొకరు వచ్చి “పెరియావ బెంగళూరు నుండి ఒకరు వచ్చారు. పీఠానికి ఇవ్వాలని చాలా డబ్బు తెచ్చారు. మీ దర్శనం చేసుకుని డబ్బు ఇచ్చి వెడతాము అని అంటున్నారు” అని చెప్పాడు. స్వామి వారు అతనితో కాసేపాగమను అని నువ్వు చదువు అని శాస్త్రిగారిని అన్నారు.
సేవకుడు మరలా వచ్చి “వారికి ఏదో పని ఉన్నది కావున తొందరగా మీ దర్శనం చేసుకొని వెళ్ళలాట” అని చెప్పాడు. కాని స్వామి వారు ఏమి మాట్లాడక శాస్త్రి గారి వైపు తిరిగి చదువు అని అన్నారు. సేవకులు మరలా వచ్చి అదే విషయం చెప్పారు. “ఆ బెంగళూరు ఆయనకు ఏదో పని ఉన్నదట. మీరు ఒక్కసారి దర్శనం ఇస్తే చూసి డబ్బిచ్చి వెళ్ళిపోతాడట. వారిని పంపమంటారా?”.
ఈ విషయాన్నంతా చూసి, శాస్త్రి గారు “అరే ఏమిటిది నేను ఇలా కూర్చుని పద్యాలు చదువుతూ ఉండడం వల్ల స్వామి వారికి ఇబ్బంది కలుగుతున్నట్టు ఉంది” అని లోలోపల బాధపడుతున్నారు.
అప్పుడు పరమాచార్య స్వామి వారు ఆ సేవకులతో, “అతను డబ్బు తెచ్చాడని అతనితో ముందు మాట్లాడాలా? లేక రామాయణం కన్నా అతను వచ్చి మాట్లాడడం గొప్ప అని అనుకుంటున్నాడా? నన్ను దర్శనం చెయ్యాలనుకుంటే తరువాత రమ్మను లేదా వేచి ఉండమను. నాకు ఈ రామాయణమే గొప్పది” అని అన్నారు.
శాస్త్రి గారి తండ్రి గారు వ్రాసిన ఆ రామాయణం ఎందుకు గొప్పదో లోకానికి తెలియజెప్పాలని అనుకున్నారు స్వామి వారు. శాస్త్రిగారిని ఇలా అడిగారు.
”ఏమయ్యా రాముడు సీతమ్మ తల్లితో అగ్నిప్రవేశం చెయ్యంచాడు కదా. సీత అగ్నిపునీత అని తెలుసు కదా! ఇంత తెలిసిన తరువాత కూడా ఎవరో ఎక్కడో ఒక పౌరుడు ఏదో నింద చేసాడని సీతని పరిత్యజించడం న్యాయమా? సరే రాజారాముడు చిన్న అవమానం వచ్చినా ఆ పదవిలో కూర్చోవడానికి ఇష్టపడడు అందుకే పరిత్యజించాడు అని వాల్మీకి చెప్పాడు. ఎందరో కవులు కూడా అదే చెప్పారు. నేను ఎనభై రామాయణాలు (వాల్మీకి రామాయణం , కంబ రామాయణం, భాస్కర రామాయణం, హనుమద్ రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, మొల్ల రామాయణం మొ||) చెదివాను. ఒక్కొక్క కవి ఒక్కొక్కరకంగా చెప్పారు. మరి మీ నాన్న గారు ఈ విషయాన్ని ఎలా సమర్థించారు?” అని అడిగారు.
శాస్త్రి గారు ఆ ఘట్టం తీసి, ఇలా వివరణ ఇచ్చారు “రాముడు సీతమ్మ తల్లిని రాజు కాకముందు పెళ్ళి చేసుకున్నాడు. అప్పడి రాముడు రాజకుమారుడు అంతే. యుద్ధం తరువాత సీత అగ్నిపునీత అని లోకానికి చాటి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఒకనాడు మంత్రులలో ప్రభువుకు నీతి పాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతలో ఉండగా,
“ప్రభూ! మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు. లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమిపై నడుస్తున్నారు. ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మను భర్యగా ఉంచుకున్నారు. ధర్మానికి తప్పులేదు. ప్రభువయ్యాక సీతమ్మ భార్యగా ఉండవచ్చా?” అని అడిగారు.
“ఎందుకుండకూడదు?” అని అడిగారు రాములవారు. అందుకు మంత్రి, “ప్రభువు భూమిపతి. అంటే ఈ భూమికి భర్త. మరి అప్పుడు భూమాత తనయ సీతమ్మ మీకు ఏమవుతుంది? మీరు రాజారాముడయ్యాక మీరు ఏకపత్నీవ్రతుడు కాబట్టి భూమికి మాత్రమే భర్తగా ఉండాలి. మరి ఇప్పుడు ధర్మం నిలిచిందా?” అని అడిగాడు. ఉలిక్కిపడిన రాముడు కారణం చెప్తూ ధర్మం కోసమే సీతమ్మను అడవికి పంపించాడు రాముడు” అని చెప్పారండి మా నాన్న గారు అని అన్నారు.
ఈ మాటలు విని పరమాచార్య స్వామి వారు పరవశించిపోయారు. ఇన్ని రామాయణాలు విన్నాను గాని ఇలా సమర్థించిన వాణ్ణి వినలేదు అని “ఆ పుస్తకాల సెట్టు ఒకటి అక్కడ పెట్టిపో” అన్నారు. ”తమకు నాగర లిపి వచ్చు. అరవ లిపి వచ్చు. మరి తెలుగు లిపి పరిచయమేనా?” అని శాస్త్రి గారు అడిగారు. ”నాకు అక్షరాలు వస్తేనేమి, రాకపోతేనేమి? పుస్తకాలు పెట్టి పూజ చేస్తాను. ఒక సెట్టు ఇవ్వు” అన్నారు. తరువాత కొంత కాలానికి శాస్త్రి గారు పరమాచార్య స్వామి వారి దర్శనానికి వెళ్ళారు. స్వామి వారు ఒకగంటసేపు పురాణం చేసారు. తరువాత స్వామి వారు ఈ కింది పద్యం చదివారు.
కనుమీ నీ నగుమోము మేల్సిరికి లక్ష్యం బౌటకున్ ల
జ్జెనెట్టగ మున్మున్న మునింగి కొండచరిబాటం జారె రేరేడటం
చనుమోదించుట బద్మినీపతి నిజుస్య స్మేర దృష్టి ప్రసా
ర నవోల్లాసిత హ్రీణయై తెలిపెడిన్, రామా! జగన్మోహనా!!
ఇది శాస్త్రి గారి తండ్రి గారు వ్రాసిన ‘రామ కథామృతము’లో బాలకాండ, నవమాశ్వాసములోనిది. విశ్వామిత్రుడు శ్రీరాముని నిద్రలేపు సందర్భం. మహాస్వామి వారు పై పద్యం చదివి, “మీ నాన్నగారు దారినపోతూ ఎప్పుడూ ఈ పద్యం చదువుతూ ఉండేవారు కదా?” అని శాస్త్రి గారిని అడిగారు.
ఏనాడో గతించిన వారి నాన్నగారు ఆ పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివే వారో అలాగే స్వామి వారు ఎట్లా చదవగలిగారు!
10-12-1990 ప్రమోదూత మార్గ శిర బహుళ నవమి నాడు శాస్త్రి గారు బాలా త్రిపుర సుందరి అమ్మ వారి ఒడిలోకి శాశ్వతంగా చేరి పోయారు. వారి పార్ధివ దేహానికి అగ్ని సంస్కారం చేస్తున్నప్పుడు అమ్మ వారి ఆకారంగా చితి మంటలు ఆకాశానికి లేవటం ఎందరో చూసి పరమాద్భుతంగా వర్ణించారు. శాస్త్రి గారు కారణ జన్ములు. వారి పేరు వింటే చాలు సకల శుభాలు జరుగుతాయి.
🙏🙏🙏