బాలారిష్ఠదోషములు
Newly born baby horoscope analysis / Balarishta Dosham?
శిశువు జన్మించిన తరువాత శిశువు, తల్లి తండ్రులు లేక తాత, నాయనమ్మ లేక అమ్మమ్మలు జనన సమయ మెట్లున్నదన్న ఆత్రుతతో సిద్ధాంతులను సంప్రదించు అచారము మనం సహజంగా గమనిస్తుంటాము. అది చాలా ఉత్తమైన విషయం. తద్వారా జనన కాల దోషాలను తెలుసుకొని నివారణ మార్గాలను ఆచరించ వచ్చు.
కానీ శిశువు జననానంతరము అట్టి సమయమున జాతకమెట్లున్నది. వృత్తి , ఐశ్వర్యం, అదృష్ట యోగాలు, బలా బలములేవి, మొదలగు ప్రశ్నలడుగుట సర్వ సాధారణం గా గమనించ వచ్చు . కాని వెంటనే అట్టి ప్రశ్న లడుగరాదు. జనన కాల శుభ పత్రిక మాత్రమే వ్రాయించుకొనవలెను.
వింశోత్తరి దశలు మరియు అధిక వివరాల లోకి పోరాదు .
జాతక చక్రము ,ఫలములు, మొదలగు వివరములు 1, 3, లేక 5, సం. తరువాత వ్రాయించుకోనూట ఉత్తమమని ధర్మ శాస్త్రము తెలుపు చున్నది
జననకాల శుభపత్రిక వ్రాయునపుడు కులపురోహితులు, కులగురువులు,
బాలారిష్ఠ దోషములున్నవా, అను విషయము చూచి చెప్పవలెను. అంతకుమించి,
చెప్పుటయు ,అడుగుటయు, సమంజసము కాదు . ఈ బాలారిష్ఠ దోషము గురించి వివరించెదను.
జన్మ లగ్న రీత్యా చంద్రుడు 8వ, కుజుడు 7వ, రాహువు 9వ, శని 1వ, గురుడు 3వ, రవి 5వ,
శుక్రుడు 6వ, బుధుడు, 4వ, కేతువు 11వ, స్థానముల యందున్న బాలారిష్ఠ దోషము
కలదని తెలుసుకో వలెను.
శిశు జన్మ లగ్నాధిపతి బలహీనుడై అనగా ,నీచ, శతృ క్షేత్రములందున్ననూ
కేంద్ర కోణములందు పాపులున్ననూ, పాపగ్రహము లగ్నమును చూచుచున్ననూ
బాలారిష్ట దోషము బలముగా వున్నదని భావించవలెను.
కానీ వీనికి వ్యతిరిక్తమైన దోషము, పరిహారమగునని చెప్పుచున్నారు. అది కొంత అంగీకార మైనను ,దోష పరిహారము కొరకు, గ్రహ శాంతి, జపము ,తైలావ లోకనము, మొదలగు శాంతి ప్రక్రియలు జరిపించిన శిశువు దీర్ఘాయుష్యము పొందును.
ఈ శాంతి, జపాదులు నామకరణ సమయమందు, 11 వ రోజున, 21 వ రోజున 29,వ రోజున లేక కనీసం 40 రోజుల లోపు జరిపించాలి ఏదైనా ఆరోగ్య కారణములు చే కుదరని పక్షమున 3 వ మాసమున జరిపించుట ఉత్తమము. శిశువు వున్న ప్రదేశము అనగా శిశువు శాంతి జరుగు సమయంలో ప్రత్యక్షంగా పాల్గొనుట చాలా ముఖ్యము.
ఏ దోషములు లేకుండా అనగా బాలారిష్టములు లేకుండా జననము జరిగిన సంతోషించి , ఏదోషము లేక పోయిన ఈశ్వర అభిషేకము జరిపించుట శిశువునకు శుభదాయకం.
అక్కరలేని అనవసర శాంతులు జరిపించుట సమయ , ద్రవ్య , ధన నష్టము . భగవత్ ఆరాధన సర్వత్రా , సర్వాదా శుభము. అధిక వివరాలకు, ప్రపంచంలో ఏ ప్రదేశంలో ఐన జన్మించిన శిశువు జనన కాల జన్మ పత్రికకు తప్పక సంప్రదించ గలరు . మంగళం మహత్ .
Murali Krishna Sarma Bhuvanagiri . Email : sarmaaji@gmail.com.

No comments:
Post a Comment