Sunday, December 18, 2016

సాయిబాబా చాలీసా Sai Baba Chalisa Telugu .

సాయిబాబా చాలీసా
షిరిడి వాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం - నీలో సృష్టికి  వ్యవహారం
త్రిమూర్తి రూపా ఓ సాయి కరుణించి కాపాడోయి
దరిశనమియ్యగ రావయ్యా -ముక్తి మార్గం చూపయా  || షిరిడి వాస ||

కఫినీ వస్త్రము ధరియించి - భుజముకు జోలి తగిలించి
నింబ వృక్షపు ఛాయలో - ఫకీరు వేషపు ధారణలో
కలియుగ ముందున వేలిసితివి - త్యాగం సహనం నేర్పితివి
షిరిడి గ్రామం నీ వాసం - భక్తుల మదిలో నీరూపం     || షిరిడి వాస ||
చాంద్ పాటిల్ ను కలుసుకొని  - అతని బాధలు తెలుసుకొని
గుఱ్ఱము జాడ తెలిపితివి - పాటిల్ బాధను తిర్చితివి
వెలిగించావు జ్యోతులను - నీ వుపయోగించి జలము
అచ్చెరువొందెను ఆ గ్రామం - చూసీ వింతైనా దృశ్యం      ||షిరిడి||
బాయిజా చేసెను నీసేవ - ప్రతిఫలమిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి - తాత్యాను నీవు బ్రతికించి
పశు పక్షులను ప్రేమించి - ప్రేమతో వాటిని లాలించి
జీవులపైన మమకారం - చిత్రమయానీ వ్యవహారం
నీ ద్వారములో నిలిచితిని - నిన్నే నిత్యము కొలిచితిని
అభయమునిచ్చి బ్రోవుమయ్యా - ఓ షిరిడీశా దయామయా
ధన్యము ద్వారక ఓమాయీ - నీలో నిలిచెను శ్రీసాయి
నీ ధుని మంటల వేడిమికి - పాపము పోవును తాకిడికి
ప్రళయ కాలము ఆపితివి - భక్తుల నీవు బ్రోచితివి
చేసి మహామారీ నాశం - కాపాడి షిరిడి గ్రామం
అగ్నిహోత్రి శాస్త్రికి - లీలా మహాత్మ్యం   చుపించి
శ్యామాను బ్రతికించితివి - పాము విషము తొలిగించి
భక్త భీమాజీకి క్షయరోగం - నశించే అతని సహనం
ఊదీ వైద్యం చేసావు - వ్యాధిని మాయం చేసావు
కాకాజీకి ఓ సాయి - విఠల దర్శన మిచ్చితివి
దాముకిచ్చి సంతానం - కలిగించితివి సంతోషం ||షిరిడి||
కరుణా సింధూ కరుణించు - మాపై కరుణా కురిపించు
సర్వం నీకే అర్పితము - పెంచుము భక్తి భావమును
ముస్లిమనుకొని నిన్ను మేఘా - తెలిసుకొని అతని బాధ
దాల్చి శివశంకర రూపం - ఇచ్చావయ్య దర్శనము
డాక్టరుకు నీవు రామునిగా - బల్వంతకు శ్రీ దత్తునిగా
నిమోనుకరకు మారుతిగా - చిదంబరకు శ్రీ గణపతిగా
మార్తాండ్ కు  ఖండోబాగా - గణూకు  సత్యదేవునిగా
నరసింహస్వామిగ జోషికి - దరిశన మిచ్చిన  శ్రీ సాయి ||షిరిడి||
రేయీ పగలూ నీ ధ్యానం -నిత్యం నీ లీలా పఠనం
భక్తితో చేయండి ధ్యానం - లభించును ముక్తికి మార్గం
పదకొండూ నీ వచనాలు - బాబా మాకవి వేదాలు
శరణని వచ్చిన భక్తులను - కరుణించి నీవు బ్రోచితివి ||షిరిడి||
అందరిలోన నీరూపం - నీ మహిమ అతిశక్తిమయం
ఓ సాయి మేము మూఢులము - ఓసగు మయా నీవు ఙ్ఞనమును
సృష్టికి నీవేనయ మూలం - సాయి మేము సేవకులం
సాయి నామము తలచెదము - నిత్యము సాయిని కొలిచెదము  ||షిరిడి||
భక్తి భావన తెలుసుకొని - సాయిని మదిలో నిలుపుకొని
చిత్తముతో  సాయీ ధ్యానం - చెయ్యండి ప్రతినిత్యం
బాబా కాల్చిన ధుని ఊది - నివారించును అది వ్యాధి
సమాధి నుండి శ్రీ సాయి - భక్తులను కాపాడేవోయి  ||షిరిడి||
మన ప్రశ్నలకు జవాబులు - తెలుపును సాయి చరితములు
వినండి లేక చదవండి - సాయి సత్యము చూడండి
సత్సంగమును చేయండి - సాయి స్వప్నము పొందండి
భేద భావమును మానండి - సాయీ మన సద్గురువండి  ||షిరిడి||
వందనమయ్యా పరమేశా - ఆపద్భాందవ సాయీశా
మా పాపములు  కడతేర్చు - మామది కోరిక నెరవేర్చు
కరుణా మూర్తీ ఓ సాయి - కరుణతో మము దరిచేర్చోయి
మా మనస్సే నీ మందిరము  - మా పలుకులే నీకు నై వేద్యం  ||షిరిడి||

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
       ఓం శా౦తిః  శా౦తిః  శా౦తిః 
Bramhasri Murali Krishna Sarmaaji . Greensboro . NC .336-517-6268 . Sarmaaji@gmail.com